
Photo Courtesy: BCCI/IPL
IPL 2025 CSK vs DC Updates: ఐపీఎల్-2025లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అప్‌డేట్స్
ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది.
సీఎస్‌కే బ్యాటర్లలో విజయ్ శంకర్ 69 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఎంఎస్ ధోని(30 నాటౌట్) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, స్టార్క్ తలా వికెట్ సాధించారు.
ఓటమి దిశగా సీఎస్‌కే..
17 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే 5 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. సీఎస్‌కే విజయానికి 18 బంతుల్లో 67 పరుగులు కావాలి. క్రీజులో విజయ్ శంకర్(51), ధోని(13) ఉన్నారు.
సీఎస్‌కే ఐదో వికెట్ డౌన్
రవీంద్ర జడేజా రూపంలో సీఎస్‌కే ఐదో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన జడేజా.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే 5 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. క్రీజులో ధోని(4), విజయ్ శంకర్(26) ఉన్నారు.
నాలుగో వికెట్ డౌన్
శివం దూబే (15 బంతుల్లో 18) రూపంలో చెన్నై నాలుగో వికెట్ కోల్పోయింది. విప్రాజ్ బౌలింగ్‌లో దబే స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోరు: 65/4 (9.2). జడేజా క్రీజులోకి వచ్చాడు. శంకర్ 17 పరుగులతో ఉన్నాడు.
పవర్ ప్లేలో చెన్నై స్కోరు: 46/3 (6)
దూబే 5, శంకర్ 11 రన్స్‌తో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన చెన్నై
5.3: విప్రాజ్ నిగమ్ బౌలింగ్‌లో ఓపెనర్ డెవాన్ కాన్వే (13) అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో చెన్నై మూడో వికెట్ కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా శివం దూబే క్రీజులోకి వచ్చీ రాగానే ఫోర్ బాదాడు. విజయ్ శంకర్ 11 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 45/3 (5.4)
రెండో వికెట్ కోల్పోయిన చెన్నై
2.3: కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రూపంలో సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో మెగర్క్‌కు క్యాచ్ ఇచ్చి రుతు 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. విజయ్ శంకర్ క్రీజులోకి వచ్చాడు. కాన్వే 5 రన్స్‌తో ఉన్నాడు. స్కోరు: 20/2 (2.3)
తొలి వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
1.5: ముకేశ్ కమార్ బౌలింగ్ రచిన్ రవీంద్ర బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా ఆరు బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం మూడు పరుగులు చేసి నిష్క్రమించాడు. రుతురాజ్ గైక్వాడ్ క్రీజులోకి రాగా కాన్వే ఐదు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 15-1(2)
ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు.. ఢిల్లీ స్కోరెంతంటే?
చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మెరుగైన స్కోరు సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అక్షర్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. కాగా తొలి ఓవర్లోనే ఓపెనర్ మెగర్క్ డకౌట్‌గా వెనుదిరిగినప్పటికీ.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ జట్టును ఆదుకున్నాడు.
Kamaal KL! 😎🏏
KL Rahul brings up a sublime fifty as he leads the charge for #DC, eyeing a historic win at Chepauk, their first since 2010!
Watch LIVE action ➡ https://t.co/4Kn2OwL1UW #IPLonJioStar 👉 #CSKvDC, LIVE NOW on Star Sports 2, Star Sports 2 Hindi & JioHotstar pic.twitter.com/bSx5mXAuoh— Star Sports (@StarSportsIndia) April 5, 2025
వన్‌డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ (20 బంతుల్లో 33) ఆది నుంచే దంచికొట్టగా.. రాహుల్ మాత్రం తొలుత ఆచితూచి ఆడాడు. అనంతరం కాస్త స్పీడు పెంచిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆఖరి ఓవర్లో.. 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
మిగతా వాళ్లలో కెప్టెన్ అక్షర్ పటేల్ (14 బంతుల్లో 21) , సమీర్ రిజ్వీ (15 బంతుల్లో 21), ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (12 బంతుల్లో 24 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఇక సీఎస్‌కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, మతీషా పతిరణ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు
19.2:పతిరణ బౌలింగ్‌లో రాహుల్ (77) వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
ధోని మ్యాజిక్.. ఐదో వికెట్ డౌన్
19.3: పతిరణ బౌలింగ్‌లో అశుతోశ్ శర్మ (1) రనౌట్ అయ్యాడు. స్టబ్స్‌తో కలిసి పరుగు పూర్తి చేసుకున్న అశుతోశ్‌ను.. వికెట్ల వెనుక వేగంగా కదిలిన ధోని అద్బుత రీతిలో రనౌట్ చేసి వెనక్కి పంపాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
16.1: ఖలీల్ అహ్మద్ మరోసారి అద్భుతం చేశాడు. తొలి ఓవర్లో మేగర్క్ రూపంలో కీలక వికెట్ తీసిన ఈ పేస్ బౌలర్.. తాజాగా సమీర్ రిజ్వీని వెనక్కి పంపాడు.
అహ్మద్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిజ్వీ పెవిలియన్ చేరాడు. అతడి స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 148/4 (16.2)
15 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 138/3 (15)
కేఎల్ రాహుల్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అతడికి ఇది 38వ ఫిఫ్టీ. మరోవైపు సమీర్ రిజ్వీ నిలకడగానే ఆడుతున్నాడు. పదిహేను ఓవర్లు ముగిసే సరికి రాహుల్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేయగా.. రిజ్వీ 13 బంతుల్లో 19 రన్స్ చేశాడు.
10.4: మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
అక్షర్ పటేల్ రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో అక్షర్ బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా 14 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ 21 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. స్కోరు: 90/3 (10.4). సమీర్ రిజ్వీ క్రీజులోకి వచ్చాడు.
10 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ స్కోరు: 82/2
అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతున్నారు. పది ఓవర్లు ముగిసే సరికి అక్షర్ 12 బంతుల్లో 20, రాహుల్ 23 బంతుల్లో 29 రన్స్‌తో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
6.5: జోరు మీదున్న పోరెల్‌కు జడేజా చెక్ పెట్టాడు. జడ్డూ బౌలింగ్‌లో పతిరణకు క్యాచ్ ఇచ్చి అతడు 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అక్షర్ పటేల్ క్రీజులోకి రాగా.. రాహుల్ 21 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 54/2 (6.5)
పవర్ ప్లే ముగిసే సరికి ఢిల్లీ స్కోరు: 51/1 (6)
పోరెల్ 32, రాహుల్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.
నాలుగు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 32/1
రాహుల్ 8, పోరెల్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రెండు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 20/1 (2)
ముకేశ్ బౌలింగ్‌లో చితక్కొట్టిన అభిషేక్ పోరెల్. 0,4, 6, 4, 4, 1. రాహుల్ ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు.
తొలి ఓవర్లో ఒక్క పరుగు.. ఒక వికెట్
ఖలీల్ అహ్మద్ చెన్నై బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. తొలి నాలుగు బంతులను డాట్ చేసిన ఖలీల్... ఐదో బంతికి మెగర్క్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆఖరి బంతికి అభిషేక్ పోరెల్ ఒక పరుగు చేశాడు. ఢిల్లీ స్కోరు: 1-1 (1)
రుతు సారథ్యంలోనే
ఈ మ్యాచ్‌కు చెన్నై రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దూరమయ్యాడని.. అతడి స్థానంలో మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని నాయకుడిగా వ్యవహరిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే, గాయం నుంచి కోలుకున్న రుతు మైదానంలో అడుగుపెట్టడం గమనార్హం.
ఫాఫ్ లేడు
మరోవైపు.. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్.. తొలుత బ్యాటింగ్ చేయనున్నట్లు తెలిపాడు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ వికెట్ స్లోగా మారే అవకాశం ఉందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.
ఈ మ్యాచ్‌లో కూడా తాము ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. దురదృష్టవశాత్తూ ఫాఫ్ డుప్లెసిస్ ఫిట్‌గా లేడని.. అందుకే అతడి స్థానంలో సమీర్ రిజ్వీ తుదిజట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు.
తుదిజట్లు
చెన్నై
రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముకేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్
శివం దూబే, జేమీ ఓవర్టన్, షేక్ రషీద్, కమలేశ్ నాగర్‌కోటి
ఢిల్లీ
జేక్ ఫ్రేజర్-మెగర్క్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్
ముకేశ్ కుమార్, కరుణ్ నాయర్, దర్శన్ నాల్కండే, డొనోవాన్ ఫెరీరా, త్రిపురాణ విజయ్