
మౌంట్ మాంగనీ: భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ధోని గాయం కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో బరిలోకి దిగలేదు. సోమవారం తొడ కండరాల గాయంతో అతను ఆటకు దూరంగా ఉన్నాడు. తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ వచ్చిన ధోని ఇప్పటి వరకు గాయంతో కేవలం ఐదు మ్యాచ్‌ల్లోనే గైర్హాజరీ అయ్యాడు. వెస్టిండీస్‌లో ఆరేళ్ల క్రితం (2013) చివరిసారిగా ఇలా గాయంతో ఆటకు దూరమయ్యాడు. అప్పుడు మూడు వన్డేలు ఆడలేకపోయాడు. అంతకుముందు 2007లో వైరల్ జ్వరం వల్ల ఐర్లాండ్, దక్షిణాఫ్రికాలతో జరిగిన మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు అర్ధసెంచరీలతో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అందుకున్న ఈ భారత మాజీ కెప్టెన్... కివీస్ పర్యటనలోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. రెండో వన్డేలో 33 బంతుల్లో 48 పరుగులు చేసి భారత్ భారీ స్కోరులో భాగమయ్యాడు.
కివీస్ జట్టులో రెండు మార్పులు
భారత్‌తో సిరీస్ కోల్పోయిన కివీస్ చివరి రెండు వన్డేలకు జట్టులో రెండు మార్పులు చేసింది. ఆల్‌రౌండర్ నీషమ్, లెగ్ స్పిన్నర్ టాడ్ ఆస్టల్‌లను జట్టులోకి తీసుకుంది. బ్రేస్‌వెల్ స్థానంలో నీషమ్, స్పిన్నర్ ఇష్ సోధి స్థానంలో ఆస్టల్ వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment