New Zealand vs India, 3rd ODI: న్యూజిలాండ్- టీమిండియా మధ్య మూడో వన్డేకు కూడా వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో ఫలితం తేలకుండానే ఈ మ్యాచ్ కూడా ముగిసిపోయింది. ఈ క్రమంలో మొదటి వన్డేలో గెలిచిన ఆతిథ్య కివీస్ సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకుంది. ఇక రెండో వన్డేలో కూడా వరణుడి ఆటంకం కారణంగా మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే.
వరుణుడి ఆటంకం.. కివీస్ గెలవాలంటే..!
ఇన్నింగ్స్ 18 ఓవర్ల తర్వాత వరుణుడు ఆటంకం కలిగించాడు. ఈ సమయానికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. న్యూజిలాండ్ గెలవాలంటే మరో 32 ఓవర్లలో 116 పరుగులు చేయాల్సి ఉంటుంది. కాన్వే (38), విలియమ్సన్ క్రీజ్‌లో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
తొలి వికెట్‌కు 97 పరుగులు జోడించాక న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి ఫిన్ అలెన్ (57) ఔటయ్యాడు.
గేర్ మార్చిన ఓపెనర్లు.. లక్ష్యం దిశగా సాగుతున్న కివీస్
ఆరంభంలో ఆచితూచి ఆడిన కివీస్ ఓపెనర్లు ఆతర్వాత క్రమంగా వేగం పెంచారు. ఫిన్ అలెన్ (53) హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడుతుండగా.. డెవాన్ కాన్వే (31) నిదానంగా ఆడుతున్నాడు. 16 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 93/0. ఆ జట్టు గెలవాలంటే 34 ఓవర్లలో మరో 127 పరుగులు చేయాల్సి ఉంది.
టార్గెట్ 220.. ఆచితూచి ఆడుతున్న కివీస్ ఓపెనర్లు
220 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందకు బరిలోకి దిగిన కివీస్ ఆచితూచి ఆడుతుంది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 28/0. డెవాన్ కాన్వే (7), ఫిన్ అలెన్ (16) క్రీజ్‌లో ఉన్నారు.
రాణించిన సుందర్, శ్రేయస్.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన టీమిండియా
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. శ్రేయస్ అయ్యర్ (49), వాషింగ్టన్ సుందర్ (51) ఓ మోస్తరుగా రాణించడంతో టీమిండియా 47.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, సౌథీ 2, ఫెర్గూసన్, సాంట్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
తొమ్మిదో వికెట్ డౌన్.. పోరాడుతున్న సుందర్
47వ ఓవర్ రెండో బంతికి అర్షదీప్ సింగ్ ఔటయ్యాడు. ఫలితంగా టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 46.1 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 213/9. సుందర్ (45) ఒక్కడు పోరాడుతున్నాడు.
ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా
44.3వ ఓవర్‌లో టీమిండియా 8వ వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి చహల్ (8) ఔటయ్యాడు. 45 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 206/8. సుందర్ (44), అర్షదీప్ సింగ్ (3) క్రీజ్లో ఉన్నారు.
ఏడో వికెట్ కోల్పోయిన భారత్
170 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన దీపక్ చహర్.. మిచెల్ బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
ఆరో వికెట్ డౌన్
149 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. సౌథీ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి దీపక్ హుడా (12) ఔటయ్యాడు. సుందర్, చాహర్ క్రీజ్‌లో ఉన్నారు.
కష్టాల్లో టీమిండియా.. 121 పరుగులకే సగం వికెట్లు డౌన్
121 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో చిక్కుకుంది. మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన శ్రేయస్ అయ్యర్ 49 పరుగుల వద్ద ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా క్రీజ్‌లో ఉన్నారు.
డేంజరెస్ సూర్యకుమార్ యాదవ్ ఔట్
25వ ఓవర్ తొలి బంతికి డేంజరెస్ సూర్యకుమార్ యాదవ్ (6) ఔటయ్యాడు. ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి స్కై పెవిలియన్ బాటపట్టాడు. 25 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 116/4. శ్రేయస్ అయ్యర్ (49), దీపక్ హుడా (1) క్రీజ్‌లో ఉన్నారు.
మళ్లీ నిరాశపర్చిన పంత్.. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతున్న పంత్, మరోసారి నిరాశపరిచాడు. 16 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి మిచెల్ బౌలింగ్‌లో ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 21 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 87/3. శ్రేయస్ అయ్యర్ (28), సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
13వ ఓవర్ ఆఖరి బంతికి టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో కెప్టెన్ శిఖర్ ధవన్ (28) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 13 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 55/2. శ్రేయస్ అయ్యర్ (12), రిషబ్ పంత్ క్రీజ్‌లో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. గిల్ ఔట్
8వ ఓవర్ నాలుగో బంతికి టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. పరుగులు చేసేందుకు బాగా ఇబ్బంది పడిన శుభ్‌మన్ గిల్ (22 బంతుల్లో 13) ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 43/1.
నత్త నడకన సాగుతున్న టీమిండియా బ్యాటింగ్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా.. ఆచితూచి బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్లలో శిఖర్ ధవన్ (25) ఓ మోస్తరుగా ఆడుతుండగా.. గిల్ (5) నిదానంగా ఆడుతున్నాడు. 8 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 31/0.
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే పార్క్ వేదికగా ఇవాళ (నవంబర్ 30) జరుగనున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా టాస్ ఆలస్యంగా వేశారు. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 7 గంటకు ప్రారంభమవుతుంది.
భారత తుది జట్టు..
శిఖర్ ధవన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, దీపక్ హూడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, చహల్
న్యూజిలాండ్ తుది జట్టు..
ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లోకీ ఫెర్గూసన్
Comments
Please login to add a commentAdd a comment