అప్‌డేట్: కివీస్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నారు.
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ రికార్డు స్కోర్ దిశగా పయనిస్తుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (64 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (56 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు వేగంతో అర్ధశతకాలు పూర్తి చేసి సెంచరీల దిశగా సాగుతున్నారు.
వీరిద్దరి ధాటికి టీమిండియా 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 165 పరుగులు చేసింది. కాగా, 3 మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌ను భారత్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నామమాత్రంగా సాగుతున్న ఈ మ్యాచ్‌లోనూ భారత్ గెలిస్తే.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంటుంది.
న్యూజిలాండ్‌పై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం..
ఈ మ్యాచ్‌లో శతకాల దిశగా దూసుకెళ్తున్న రోహిత్-గిల్‌లు ఈ ఫీట్‌లు సాధించకముందే మరో రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. న్యూజిలాండ్‌పై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా రోహిత్-గిల్ జోడీ రికార్డుల్లోరకెక్కింది. వీరిద్దరు తొలి వికెట్‌కు అజేయమైన 204 పరుగులు జోడించారు.
ప్రస్తుతం రోహిత్ (99), గిల్ (98) క్రీజ్‌లో ఉన్నారు. గతంలో (2009లో) సెహ్వాగ్-గంభీర్ జోడీ పేరిట ఈ రికార్డు ఉండేది. వీరిద్దరు న్యూజిలాండ్‌పై తొలి వికెట్‌కు అజేయమైన 201 పరుగులు జోడించారు. వీరి తర్వాత లంక జోడీ జయసూర్య-ఉపుల్ తరంగ (201) మూడో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment