INDW VS AUSW, 3rd ODI: టీమిండియాను చిత్తు చేసిన ఆసీస్‌.. సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ | INDW VS AUSW 3rd ODI: Australia Beat Team India By 190 Runs | Sakshi
Sakshi News home page

INDW VS AUSW, 3rd ODI: టీమిండియాను చిత్తు చేసిన ఆసీస్‌.. సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌

Published Tue, Jan 2 2024 8:16 PM | Last Updated on Tue, Jan 2 2024 8:28 PM

INDW VS AUSW 3rd ODI: Australia Beat Team India By 190 Runs - Sakshi

వాంఖడే వేదికగా టీమిండియాతో ఇవాళ (జనవరి 2) జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 190 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్‌ 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. నామమాత్రంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసింది. 

ఓపెనర్‌ ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (119) సెంచరీతో కదంతొక్కడంతో ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టాని​కి 338 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. లిచ్‌ఫీల్డ్‌కు మరో ఓపెనర్‌ అలైసా హీలీ (82) కూడా సత్తా చాటింది. ఆఖర్లో ఆష్లే గార్డ్‌నర్‌ (30), అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (23), అలానా కింగ్‌ (26 నాటౌట్‌), జార్జియా వేర్హమ్‌ (11 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్‌ 3 వికెట్లతో రాణించగా.. అమన్‌జోత్‌ కౌర్‌ 2, పూజా వస్త్రాకర్‌, దీప్తి శర్మ తలో వికెట్‌ వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా.. జార్జియా వేర్హమ్‌ (3/23), మెగాన్‌ షట్‌ (2/23), అలానా కింగ్‌ (2/21), అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌  (2/9) ధాటికి 32.4 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్‌లో స్మృతి మంధన (29), రిచా ఘోష్‌ (19), జెమీమా రోడ్రిగెజ్‌ (25), దీప్తి శర్మ (25 నాటౌట్‌), పూజా వస్త్రాకర్‌ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. 

కాగా, ప్రస్తుత భారత పర్యటనలో ఆసీస్‌ తదుపరి టీ20 సిరీస్‌ ఆడనుంది. జనవరి 5, 7, 9 తేదీల్లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ నవీ ముంబై వేదికగా జరుగనున్నాయి. వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌.. ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement