ఆఫ్ఘనిస్తాన్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను శ్రీలంక 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ కోల్పోయిన లంకేయులు, ఆతర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని సిరీస్‌ను చేజిక్కించుకున్నారు. హంబన్‌తోట వేదికగా ఇవాళ (జూన్ 7) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో లంక బౌలర్ల ధాటికి ఆఫ్ఘన్ బ్యాటర్లు తలవంచారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. చమీర (4/63), హసరంగ (3/7), లహీరు కుమార (2/29), తీక్షణ (1/16) చెలరేగడంతో 22.2 ఓవర్లలోనే 116 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో నబీ (23) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక.. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (51), దిముత్ కరుణరత్నే (56 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో కేవలం 16 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ తరుపు ముక్క రషీద్ ఖాన్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. బ్యాటింగ్‌లో 8 బంతులు ఆడి కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన రషీద్.. 4 ఓవర్లు బౌల్ చేసి వికెట్ లేకుండా 21 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా, ఈ సిరీస్ అనంతరం ఆఫ్ఘనిస్తాన్.. బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. అక్కడ వీరు ఓ టెస్ట్, 3 వన్డేలు, 2 టీ20లు ఆడనున్నారు.
చదవండి: WTC Final: ఏం ప్రాక్టీస్ చేశారని గెలవడానికి .. గెలుపు ఆస్ట్రేలియాదే..!
Comments
Please login to add a commentAdd a comment