
ఆసియా కప్‌లో అయిన గాయంతో కొన్నాళ్లు ఆటకు దూరమై... వివాదాస్పద వ్యాఖ్యలతో ఏకంగా ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలో సస్పెన్షన్‌కు గురై... ప్రపంచ కప్ ముందు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన హార్దిక్ పాండ్యా ఇప్పుడిక ఊరట పొందొచ్చు. న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో అవసరమైన సమయంలో అతడి ప్రదర్శనే ఇందుకు కారణం. విలియమ్సన్ వంటి ఆటగాడి క్యాచ్‌ను అద్భుతం అనదగ్గ రీతిలో అందుకుని తొలుత ఫీల్డింగ్‌లో మెరిసిన పాండ్యా... బౌలింగ్‌లోనూ తన విలువ చాటాడు.
ఓ వైపు పరుగులు నిరోధిస్తూనే, ఇన్నింగ్స్ కీలక దశలో నికోల్స్ వికెట్ పడగొట్టి కివీస్ స్కోరు మరీ పెరగకుండా చూశాడు. ఆ వెంటనే సాన్‌ట్నర్‌ను ఔట్ చేసి మ్యాచ్‌ను ఓ విధంగా మలుపుతిప్పాడు. ఓ ఎండ్‌లో పాండ్యా ఇలా పరోక్షంగా ఒత్తిడి తేవడంతో... రాస్ టేలర్ ఆత్మరక్షణలో పడ్డాడు. మ్యాచ్ అనంతరం కోహ్లి సైతం ఈ ప్రదర్శనను పొగడటం కచ్చితంగా పాండ్యాను స్థిమిత పరిచి ఉంటుంది.