Virat Kohli Slammed For Chewing Gum During National Anthem: దక్షిణాఫ్రికాతో మూడో వన్డేకి ముందు భారత జాతీయ గీతాలాపన సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన పనికి భారత అభిమానులు తీవ్రంగా హర్ట్ అవుతున్నారు. ఆన్ ఫీల్డ్ ప్రవర్తన ఎలా ఉన్నా, దేశం పట్ల అమితమైన గౌరవం కలిగిన కోహ్లి.. మ్యాచ్ ఆరంభానికి ముందు జరిగిన జాతీయ గీతాలాపన సమయంలో చూయింగ్ గమ్ నములుతూ ఉదాసీనంగా కనిపించాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా కోహ్లి వింతగా ప్రవర్తించడంతో భారతీయులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Virat Kohli busy chewing something while National Anthem is playing. Ambassador of the nation.@BCCI pic.twitter.com/FiOA9roEkv
— Vaayumaindan (@bystanderever) January 23, 2022
ఆన్ ఫీల్డ్(బ్యాటింగ్ ఫామ్), ఆఫ్ ద ఫీల్డ్(కెప్టెన్సీ విషయంలో బీసీసీఐతో గొడవ) విషయాలు పక్కకు పెట్టి మరీ అతనిపై విరుచుకుపడుతున్నారు. జాతీయ గీతం ఆలపించేప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని ఫైరవుతున్నారు. కోహ్లి నుంచి ఇలాంటి అనుచిత ప్రవర్తన ఊహించలేదని కామెంట్లు చేస్తున్నారు. జాతీయ జట్టుకు ఆడడం ఇష్టం లేకపోతే తప్పుకోవాలని ధ్వజమెత్తుతున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం సోషల్‌మీడియాలో జోరుగా చర్చ సాగుతుంది.
కాగా, టీమిండియా కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాక కోహ్లి ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తుంది. ఎప్పుడూ కసిగా కనిపించే కోహ్లిలో ఆ ఫైర్ మిస్ అవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మైదానంలో, డ్రెసింగ్ రూమ్‌లో పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడు. కోహ్లి ఇలా మారడానికి బీసీసీఐ అతని పట్ల వ్యవహరిస్తున్న తీరే కారణమని అతని అభిమానులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. గంగూలీ, జై షాలు జట్టు నుంచి సైతం తప్పిస్తామని వార్నింగ్‌లు ఇచ్చారని, అందుకే కోహ్లి ఇలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాడని గుసగుసలాడుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్ కప్ 2021 అనంతరం పొట్టి ఫార్మాట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కోహ్లికి.. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదనే కారణంగా అతని వన్డే కెప్టెన్సీని కూడా లాక్కుంది. తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం అతనే స్వయంగా టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
చదవండి: ఇన్ని రోజులు కెప్టెన్‌గా ఉన్నావు కాబట్టి నడిచింది.. ఇకపై కుదరదు..!
Comments
Please login to add a commentAdd a comment