కేప్‌టౌన్: రెండో వన్డేతో సిరీస్ పోయింది. ఇప్పుడు ఆఖరి ఓటమితో పరువు పోయింది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ నాలుగు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలై సిరీస్‌ను 0–3తో చేజార్చుకుంది. మొదట దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 287 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ డికాక్ (124; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. డసెన్ (52; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 283 పరుగుల వద్ద ఆలౌటైంది.
ఓపెనర్ ధావన్ (61; 5 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లి (65; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. 32వ ఓవర్లో జట్టు స్కోరు 156 పరుగుల వద్ద కోహ్లి అవుట్ కావడంతోనే క్లీన్‌స్వీప్ ఖాయమైనప్పటికీ... దీపక్ చహర్ (34 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో గెలుపుబాట పట్టింది. 18 బంతుల్లో భారత్ విజయానికి 10 పరుగులు అవసరమైన దశలో 48వ ఓవర్ తొలి బంతికి చహర్‌ను ఎన్‌గిడి బోల్తా కొట్టించడంతో టీమిండియా ఓడిపోయేందుకు ఎక్కువసేపు పట్టలేదు.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) ధావన్ (బి) బుమ్రా 124; మలాన్ (సి) పంత్ (బి) చహర్ 1; బవుమా (రనౌట్) 8; మార్క్‌రమ్ (సి) సబ్–రుతురాజ్ (బి) చహర్ 15; డసెన్ (సి) శ్రేయస్ (బి) చహల్ 52; మిల్లర్ (సి) కోహ్లి (బి) ప్రసిధ్ కృష్ణ 39; ఫెలుక్‌వాయో (రనౌట్) 4; ప్రిటోరియస్ (సి) సూర్యకుమార్ (బి) ప్రసిధ్ కృష్ణ 20, కేశవ్ (సి) కోహ్లి (బి) బుమ్రా 6; మగాలా (సి) రాహుల్ (బి) ప్రసిధ్ కృష్ణ 0; ఎన్‌గిడి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 287.
వికెట్ల పతనం: 1–8, 2–34, 3–70, 4–214, 5–218, 6–228, 7–272, 8–282, 9–287, 10–287.
బౌలింగ్: దీపక్ చహర్ 8–0–53–2, బుమ్రా 10–0–52–2, ప్రసిధ్ కృష్ణ 9.5–0–59–3, జయంత్ యాదవ్ 10–0–53–0, చహల్ 9–0–47–1, శ్రేయస్ అయ్యర్ 3–0–21–0.
భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) మలాన్ (బి) ఎన్‌గిడి 9; ధావన్ (సి) డికాక్ (బి) ఫెలుక్‌వాయో 61; కోహ్లి (సి) బవుమా (బి) కేశవ్ 65; పంత్ (సి) మగాలా (బి) ఫెలుక్‌వాయో 0; శ్రేయస్ అయ్యర్ (సి) ఫెలుక్‌వాయో (బి) మగాలా 26; సూర్యకుమార్ (సి) బవుమా (బి) ప్రిటోరియస్ 39; దీపక్ చహర్ (సి) ప్రిటోరియస్ (బి) ఎన్‌గిడి 54; జయంత్ (సి) బవుమా (బి) ఎన్‌గిడి 2; బుమ్రా (సి) బవుమా (బి) ఫెలుక్‌వాయో 12; చహల్ (సి) మిల్లర్ (బి) ప్రిటోరియస్ 2; ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం ( 49.2 ఓవర్లలో ఆలౌట్) 283. వికెట్ల పతనం: 1–18, 2–116, 3–118, 4–156, 5–195, 6–210, 7–223, 8–278, 9–281, 10–283.
బౌలింగ్: ఎన్‌గిడి 10–0–58–3, ప్రిటోరియస్ 9.2–0– 54–2, మగాలా 10–0–69–1, కేశవ్ మహరాజ్ 10–0–39–1, ఫెలుక్‌వాయో 7–0–40–3, మార్క్‌రమ్ 3–0–21–0.
Comments
Please login to add a commentAdd a comment