సౌతాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ సాయి సుదర్శన్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో (32.2వ ఓవర్) మిడాఫ్ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న సాయి.. పక్షిలా ముందుకు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. బ్యాటర్ క్లాసెన్ (21) సహా ఈ క్యాచ్‌ను చూసిన వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కామెంటేటర్లు ఈ క్యాచ్‌ను క్యాచ్ ఆఫ్ ద సిరీస్‌గా అభివర్ణించారు. క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
Catch of the series - Sai Sudharsan 🫡🔥pic.twitter.com/tKr2Vrj3tq
— Johns. (@CricCrazyJohns) December 21, 2023
కాగా, భారత్ నిర్ధేశించిన 297 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఓటమి దిశగా సాగుతుంది. 38 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 192/7గా ఉంది. సౌతాఫ్రికా గెలవాలంటే 72 బంతుల్లో 105 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి. రీజా హెండ్రిక్స్ (19), జార్జీ (81), డస్సెన్ (2), మార్క్రమ్ (36), క్లాసెన్ (21), మిల్లర్ (10), ముల్దర్ (1) ఔట్ కాగా.. కేశవ్ మహారాజ్ (9), హెండ్రిక్స్ (0) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో సుందర్, అర్ష్‌దీప్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, అక్షర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ (108) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూతో పాటు తిలక్ వర్మ (52) కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో రింకూ సింగ్ (38) తనదైన స్టయిల్‌లో మెరుపులు మెరిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment