వెస్టిండీస్‌ క్లీన్‌స్వీప్‌ | West Indies Won The 3rd ODI Against Afganisthan | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్‌ క్లీన్‌స్వీప్‌

Published Tue, Nov 12 2019 4:47 AM | Last Updated on Tue, Nov 12 2019 4:47 AM

West Indies Won The 3rd ODI Against Afganisthan - Sakshi

లక్నో: అఫ్గానిస్తాన్‌తోజరిగిన మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్‌ 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. సోమవారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో విండీస్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా అఫ్గాన్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. అస్గర్‌ అఫ్గాన్‌ (85 బంతుల్లో 86; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్‌ (59 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), మొహమ్మద్‌ నబీ (66 బంతుల్లో 50 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు. కీమో పాల్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం విండీస్‌ 48.4 ఓవర్లలో 5 వికెట్లకు 253 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షై హోప్‌ (145 బంతుల్లో 109 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా... రోస్టన్‌ ఛేజ్‌ (42 నాటౌట్‌), కింగ్‌ (39), పొలార్డ్‌ (32) రాణించారు. ఛేజ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఇదే మైదానంలో గురువారం నుంచి మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ప్రారంభమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement