పోర్ట్ ఆఫ్‌స్పెయిన్: విండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో భారత జట్టు నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో 137 పరుగులకే విండీస్ జట్టు కుప్పకూలింది. దీంతో టీమిండియా 119 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
విండీస్ లక్ష్యం 35 ఓవర్లలో 257 పరుగులు
వర్షం అంతరాయం కారణంగా వెస్టిండీస్- ఇండియా మూడో వన్డేలో 36 ఓవర్లలో 225/3 వికెట్ల వద్ద భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది. డక్‌వర్త లూయిస్ పద్ధతిలో వెస్టిండీస్ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 257 పరుగులుగా నిర్దేశించారు. టీమిండియా బ్యాట్స్‌మన్‌లలో శుభమన్ గిల్ 98 బంతుల్లో 98 పరుగులతో నాటౌట్ నిలిచాడు. వర్షం కారణంగా భారత ఇన్నింగ్స్‌ను ముగించడంతో గిల్ తృటిలో సెంచరీని కోల్పోయాడు.
అనుకున్నదే అయ్యింది.. వర్షం మొదలైంది
వాతావరణ శాఖ హెచ్చరికలే నిజమయ్యాయి. వారు చెప్పినట్లుగానే మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. 24 ఓవర్లు పూర్తయ్యాక వర్షం మొదలుకావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఈ సమయానికి టీమిండియా స్కోర్ 115/1. క్రీజ్‌లో గిల్ (51), శ్రేయస్ (2) ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
23వ ఓవర్‌లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. హేడెన్ వాల్ష్ బౌలింగ్‌లో పూరన్‌కు క్యాచ్ ఇచ్చి ధవన్ (74 బంతుల్లో 58; 7 ఫోర్లు) ఔటయ్యాడు. 23 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 113/1. గిల్‌కు (51) జతగా శ్రేయస్ క్రీజ్‌లోకి వచ్చాడు.
గిల్ హాఫ్ సెంచరీ
మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 60 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ సాయంతో గిల్ వన్డేల్లో ఈ ఫీట్‌ను రెండోసారి చేశాడు. 22 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 112/0. ధవన్ 73 బంతుల్లో 58 పరుగలతో క్రీజ్‌లో ఉన్నాడు.
ధవన్ ఫిఫ్టి.. 100 దాటిన టీమిండియా స్కోర్
ఓపెనర్లు ధవన్ (54), గిల్ (44)లు టీమిండియాకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 20 ఓవర్లలో అజేయమైన 101 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ధవన్ వన్డేల్లో 37వ ఫిఫ్టి సాధించాడు. ఈ సిరీస్‌లో ధవన్‌కు ఇది రెండో హాఫ్ సెంచరీ.
డ్రింక్స్ విరామం సమయానికి టీమిండియా స్కోర్ 87/0
తొలి 10 ఓవర్లు నిదానంగా ఆడిన భారత్.. ఆతర్వాత కాస్త వేగం పెంచింది. ఓపెనర్లు ధవన్ 57 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 48 పరుగులు, గిల్ 46 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 36 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. డ్రింక్స్ విరామం సమయానికి (17 ఓవర్లు) భారత్ వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది.
గేర్ మార్చని ఓపెనర్లు
ఇన్నింగ్స్ ఆరంభం నుంచి నిదానంగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు 11 ఓవర్లు దాటినా గేర్ మార్చడం లేదు. ధవన్ 34 బంతులు ఆడి 23 పరుగులు చేయగా.. గిల్ 32 బంతులను ఎదుర్కొని అన్నే పరుగులు సాధించాడు. 11 ఓవర్లు దాటినా టీమిండియా 50 పరుగుల మార్కును (47/0) చేరుకోలేదు.
ఆచితూచి ఆడుతున్న ఓపెనర్లు.. 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 17/0
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిదానంగా బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (8), శిఖర్ ధవన్ (9) ఆచితూచి ఆడుతున్నారు. 5 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండయా స్కోర్ 17/0.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను టీమిండియా ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఓ మార్పు చేసింది. ఆవేశ్ ఖాన్ స్థానంలో ప్రసిధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు విండీస్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. రోవ్‌మన్ పావెల్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్ స్థానాల్లో జేసన్ హోల్డర్, కీమో పాల్, కీచీ క్యార్టీ జట్టులో చేరారు.
భారత్: శిఖర్ ధవన్(కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్(వికెట్ కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిధ్ కృష్ణ
వెస్టిండీస్: షెయ్ హోప్(వికెట్ కీపర్), బ్రాండన్ కింగ్, కీచీ క్యార్టీ, షమ్రా బ్రూక్స్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్(కెప్టెన్), జేసన్ హోల్డర్, కీమో పాల్, అకేల్ హోసేన్, జేడెన్ సీల్స్, హేడెన్ వాల్ష్
Comments
Please login to add a commentAdd a comment