Ind vs NZ 3rd ODI: India Beat New Zealand by 90 Runs and Clean Sweeps the Series - Sakshi
Sakshi News home page

IND VS NZ 3rd ODI: కాన్వే సుడిగాలి శతకం వృధా.. కివీస్‌ను ఊడ్చేసిన టీమిండియా

Published Tue, Jan 24 2023 9:10 PM | Last Updated on Tue, Jan 24 2023 9:53 PM

IND VS NZ 3rd ODI: India Beat New Zealand By 90 Runs And Clean Sweeps The Series - Sakshi

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇండోర్‌ వేదికగా ఇవాళ (జనవరి 24) జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్‌ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, పర్యాటక జట్టును ఒక్క మ్యాచ్‌ కూడా గెలవనీయకుండా ఊడ్చేసింది. ఈ విజయంతో భారత్‌.. ఐసీసీ వన్డే టీమ్‌ ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానానికి ఎగబాకింది. ఇప్పటికే టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న భారత్‌.. వన్డేల్లోనూ ఈ ఘనత సాధించి అరుదైన రికార్డు నెలకొల్పింది. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఆఖర్లో హార్ధిక్‌ పాండ్యా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సైతం మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో భారత్‌ ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (100 బంతుల్లో 138; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) సుడిగాలి శతకం సైతం ఆదుకోలేకపోయింది. కాన్వే మినహా మిగతా వారెవ్వరూ భారీ స్కోర్లు చేయకపోవడంతో కివీస్‌ లక్ష్యానికి 91 పరుగుల దూరంలో నిలిచిపోయింది (41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌట్‌). హెన్రీ నికోల్స్‌ (42), మిచెల్‌ సాంట్నర్‌ (34) ఓ మోస్తరుగా రాణించారు. భారత బౌలర్లలో శార్ధూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలో 3 వికెట్లు పడగొట్టగా.. చహల్‌ 2, హార్ధిక్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement