
ధావన్ ఔట్.. రహానే ఇన్
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ లో ఇంగ్లండ్‌తో జరగనున్న చివరి వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
కోల్‌కతా: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ లో ఇంగ్లండ్‌తో జరగనున్న చివరి వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే వరుసగా రెండు విజయాలతో సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లి సేన ఈ మ్యాచ్‌లోనూ విజయాన్ని సాధించి సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఇరుజట్ల లోనూ స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గాయపడిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కు విశ్రాంతి ఇచ్చి అతడి స్థానంలో అజింక్యా రహానేకు అవకాశం ఇచ్చారు.
టీమిండియాలో ఛాన్స్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మనీష్ పాండేకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇంగ్లండ్ జట్టులో గాయపడిన ఓపెనర్ హేల్స్ స్థానంలో సామ్ బిల్లింగ్స్ ఆడనున్నాడు. భారత పర్యటన ఆరంభించినప్పటి నుంచి గెలుపనేది లేకుండా ఉన్న ఇంగ్లండ్ జట్టుకు కష్టాలు తప్పడంలేదు. ఇటీవల ఐదు టెస్టుల సిరీస్‌ను 0–4తో కోల్పోయిన ఇంగ్లండ్, ఇప్పుడు వన్డే సిరీస్‌లో వైట్‌వాష్ ముంగిట నిలిచింది. కనీసం ఈ ఒక్క మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలని ఇంగ్లండ్ టీమ్ బరిలోకి దిగుతుంది.