
పల్లెకెలె: శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్‌ను 21 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 9 వికెట్లకు 150 పరుగులు చేసింది. డిక్‌వెలా (36; 8 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో స్యామ్ కరన్ (3/17), ఆదిల్ రషీద్ (4/36) రాణించారు. ఇంగ్లండ్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. మోర్గాన్ (49 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు), స్టోక్స్ (24 బంతుల్లో 35 నాటౌట్; ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. సిరీస్‌లో నాలుగో వన్డే శనివారం జరుగుతుంది.