BAN VS IRE 3rd ODI: Bangladesh First Ever 10 Wicket Win In ODIs - Sakshi
Sakshi News home page

BAN VS IRE 3rd ODI: పసికూనలపై బంగ్లా టైగర్స్‌ ప్రతాపం.. ఈ స్థాయి విజయం తొలిసారి

Published Thu, Mar 23 2023 7:00 PM | Last Updated on Thu, Mar 23 2023 8:08 PM

BAN VS IRE 3rd ODI: Bangladesh First Ever 10 Wicket Win In ODIs - Sakshi

పసికూన ఐర్లాండ్‌పై బంగ్లాదేశ్‌ టైగర్స్‌ ప్రతాపం చూపించారు. సిల్హెట్‌ వేదికగా ఇవాళ (మార్చి 23) జరిగిన మూడో వన్డేలో బంగ్లా టైగర్స్‌ 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించారు. తద్వారా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను బంగ్లాదేశ్‌ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ విజయం బంగ్లాదేశ్‌ ఊహించిందే అయినప్పటికీ ఈ స్థాయి విజయం మాత్రం ఊహించి ఉండదు. వన్డే క్రికెట్‌ చరిత్రలో తొలిసారి బంగ్లాదేశ్‌ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌.. బంగ్లా పేసర్లు హసన్‌ మహమూద్‌ (8.1-1-32-5), తస్కిన్‌ అహ్మద్‌ (10-1-26-3), ఎబాదత్‌ హొస్సేన్‌ (6-0-29-2) ధాటికి 28.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలగా, అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.

లిటన్‌ దాస్‌ (38 బంతుల్లో 50; 10 ఫోర్లు) అజేయమైన అర్ధసెంచరీతో రాణించగా.. కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ (41 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. అంతకుముందు ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు బంగ్లా పేసర్ల ఖాతాలోకే వెళ్లగా.. ఇలా జరగడం బంగ్లా వన్డే హిస్టరీలో ఇదే తొలిసారి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement