
బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. సెయింట్ కిట్స్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. 295 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ 5 వికెట్లు కోల్పోయి 47.4 ఓవర్లలో చేధించింది.
కరేబియన్ బ్యాటర్లలో షర్ఫెన్ రూథర్‌ఫర్డ్(113) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ షాయ్ హోప్(86) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లలో టాంజిమ్ హసన్, నహిద్ రానా, రిహద్ హోస్సేన్, మెహది హసన్ మిరాజ్, సౌమ్య సర్కార్ తలా వికెట్ సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్(74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. టాంజిద్ హసన్(60), మహ్మదుల్లా(50), జకీర్ అలీ(48) రాణించారు. విండీస్ బౌలర్లలో షెపర్డ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అల్జారీ జోషఫ్ రెండు, సీల్స్ ఒక్క వికెట్ సాధించారు.
చదవండి: IND vs AUS: ట్రావిస్ హెడ్, సిరాజ్‌లకు షాక్ ఇవ్వనున్న ఐసీసీ!?
Comments
Please login to add a commentAdd a comment