ఐర్లాండ్‌పై బంగ్లా గెలుపు  | Bangladesh Won by 6 Wickets in the ODI Against Ireland | Sakshi
Sakshi News home page

ఐర్లాండ్‌పై బంగ్లా గెలుపు 

Published Thu, May 16 2019 2:40 AM | Last Updated on Thu, May 16 2019 2:40 AM

Bangladesh Won by 6 Wickets in the ODI Against Ireland - Sakshi

డబ్లిన్‌: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో బుధవారం ఇక్కడ జరిగిన వన్డేలో బంగ్లాదేశ్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ (141 బంతుల్లో 130; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ బాదాడు. కెప్టెన్‌ పోర్టర్‌ఫీల్డ్‌ (106 బంతుల్లో 94; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకం చేజార్చుకున్నాడు. అబు జయేద్‌ (5/58) ఐదు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌ (53 బంతుల్లో 57; 9 ఫోర్లు), లిటన్‌ దాస్‌ (67 బంతుల్లో 76; 9 ఫోర్లు, సిక్స్‌), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ షకీబుల్‌ హసన్‌ (51 బంతుల్లో 50 రిటైర్డ్‌ హర్ట్‌; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలతో నిలకడగా ఆడటంతో బంగ్లా 43 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 294 పరుగులు చేసి గెలిచింది. ముష్ఫికర్‌ రహీమ్‌ (35), మహ్మదుల్లా (35 నాటౌట్‌) రాణించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement