What If I Fall.. Virat Kohli Interesting Perspective Post Goes Viral - Sakshi
Sakshi News home page

Virat Kohli: తన ఫామ్‌పై వస్తున్న విమర్శలకు అదిరిపోయే రిప్లై ఇచ్చిన కోహ్లి

Published Sat, Jul 16 2022 3:57 PM | Last Updated on Sat, Jul 16 2022 5:06 PM

What If I Fall.. Virat Kohli Interesting Perspective Post Goes Viral - Sakshi

కెరీర్‌లో దుర్భర దశను ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. తన ఫామ్‌పై వస్తున్న విమర్శలకు అదిరిపోయే రేంజ్‌లో కౌంటరిచ్చాడు. తనపై అవాక్కులు చవాక్కులు పేలే వాళ్లకి రన్‌ మెషీన్‌ తనదైన స్టైల్లో  సమాధానం చెప్పాడు. ​డార్లింగ్‌.. నేను కింద పడితే ఏంటి.. నువ్వు పైకి ఎగిరితే ఏంటి..? అంటూ తనను టార్గెట్‌ చేసిన వారికి చురకత్తిలాంటి సూక్తితో బదులిచ్చాడు. ఈ కోట్‌ను కోహ్లి తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయగా, ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. 

కాగా, విరాట్‌ కోహ్లి 2019 నవంబర్‌ 22 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో మూడంకెల స్కోర్‌ చేసింది లేదు. అంతకుముందు కెరీర్‌లో 70 శతకాలు బాదిన రన్‌ మెషీన్‌.. ఈ మధ్యకాలంలో ఒక్క శతకం కూడా చేయలేకపోయాడు. దీంతో అతనిపై ముప్పేట దాడి మొదలైంది. చాలామంది వ్యతిరేకులు కోహ్లిని టీమిండియా నుంచి తప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లి ఇన్‌స్టా వేదికగా విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేశాడు. తన ఫామ్‌పై ఎవ్వరూ నోటికి వచ్చినట్లు మాట్లాడవద్దని పరోక్ష సందేశాన్ని పంపాడు.

ఇదిలా ఉంటే, కోహ్లి ఫామ్‌పై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు విమర్శలు గుప్పిస్తుంటే.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌శర్మ మాత్రం కింగ్‌ కోహ్లికి మద్దతుగా నిలిచాడు. కోహ్లిని కార్నర్‌ చేస్తున్న వారికి హిట్‌మ్యాన్‌ తనదైన శైలిలో బదులిస్తున్నాడు. తాజాగా పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ కూడా కోహ్లికి అండగా నిలబడాలని నిర్ణయించుకున్నాడు. కోహ్లి తన ఫామ్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హార్ట్ టచింగ్ ట్వీట్‌ను పోస్టు చేశాడు.
చదవండి: Kohli poor form: విరాట్‌ కోహ్లికి ఏమైంది..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement