మిథాలీ మెరుపులు  | Mithali Raj, Smriti Mandhana Star as India Register Convincing Win | Sakshi
Sakshi News home page

మిథాలీ మెరుపులు 

Published Sat, Feb 17 2018 1:06 AM | Last Updated on Sat, Feb 17 2018 1:06 AM

Mithali Raj, Smriti Mandhana Star as India Register Convincing Win - Sakshi

మిథాలీ రాజ్‌

ఈస్ట్‌ లండన్‌: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళా క్రికెట్‌ జట్టు జోరు కొనసాగుతోంది. ఓపెనర్లు స్మృతి మంధాన (42 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), మిథాలీ రాజ్‌ (61 బంతుల్లో 76 నాటౌట్‌; 8 ఫోర్లు) అద్భుత ఆటతీరుతో శుక్రవారం ఇక్కడ జరిగిన రెండో టి20లో భారత్‌ 9 వికెట్లతో జయకేతనం ఎగురవేసింది. తొలుత దక్షిణాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్యూన్‌ లుస్‌ (33), డిక్లెర్క్‌ (26) మినహా మిగతావారు విఫలమయ్యారు.

స్పిన్నర్లు పూనమ్‌ యాదవ్‌ (2/18), అనూజ పాటిల్‌ (2/37) రాణించారు. అనంతరం ఛేదనలో భారత్‌ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఆడింది. ప్రొటీస్‌ జట్టులో ఏడుగురు బౌలింగ్‌ చేసినా మంధాన, మిథాలీలను నిలువరించలేకపోయారు. 14.2 ఓవర్లలో 106 పరుగులు చేశాక ఈ జోడీని డేనియల్స్‌ విడదీసింది. 20వ ఓవర్‌ మొదటి బంతిని బౌండరీకి తరలించిన మిథాలీ లాంఛనాన్ని పూర్తిచేసింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం భారత్‌ 2–0 ఆధిక్యంలో ఉంది. ఈ నెల 18, 21, 24 తేదీల్లో జరిగే మిగిలిన మ్యాచ్‌లు సోనీ టెన్‌–1, 3లలో ప్రత్యక్ష ప్రసారమవుతాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement