Update: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో మిథాలీ సేన ప్రయాణం ముగిసింది. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో కనీసం సెమీస్ కూడా చేరకుండానే మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించింది.
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు అదరగొట్టింది. సెమీస్‌కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మిథాలీ సేన భారీ స్కోరు సాధించింది. కాగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో ఓపెనర్లు స్మృతి మంధాన(71), షఫాలీ వర్మ(53) శుభారంభం అందించగా.. కెప్టెన్ మిథాలీ రాజ్(68) సైతం అర్ధ సెంచరీతో మెరిసింది. ఇక , వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ 48 పరుగులతో రాణించింది.
దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ప్రత్యర్థికి గట్టి సవాల్ విసిరింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నీం ఇస్మాయిల్‌కు రెండు, అయబోంగా ఖాకు ఒకటి, ట్రియాన్‌కు ఒకటి, మసబాట క్లాస్‌కు రెండు వికెట్లు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment