Virat Kohli Message: టీ20 ప్రపంచకప్-2021లో దాయాది పాకిస్తాన్ చేతిలో కనీవినీ ఎరుగని ఓటమి.. కనీసం సెమీస్ కూడా చేరకుండానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమణ.. అప్పటి టీమిండయా సారథి విరాట్ కోహ్లికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. తాజాగా ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు ఇలాంటి ఘటనే ఎదురైంది. మెగా ఈవెంట్‌లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది.
దక్షిణాఫ్రికాతో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పట్టుదలగా పోరాడినా ఫలితం లేకపోవడంతో రిక్తహస్తాలతో వెనుదిరిగింది. ముఖ్యంగా హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శన వృథాగా మిగిలిపోవడంతో అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. అయితే, గెలుపు కోసం వారు పోరాడిన తీరు మాత్రం అందరినీ ఆకట్టుకుంది.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి సైతం మిథాలీ సేనకు మద్దతుగా నిలిచాడు. ఈ మేరకు.. ‘‘గెలుపే లక్ష్యంగా ముందుకు సాగారు. కానీ అలా జరుగలేదు. మెగా టోర్నీ నుంచి నిష్క్రమించడం అమితంగా బాధిస్తుంది. అయినా, మీరు గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డారు. మిమ్మల్ని చూసి మేమంతా గర్వపడుతున్నాం’’ అని ట్విటర్ వేదికగా తన స్పందన తెలియజేశాడు. ఓటమిని తట్టుకోవడం కష్టమేనని , అయితే గెలిచేందుకు చివరి వరకు పోరాడటం గొప్ప విషయం అని పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా.. ఐపీఎల్-2022 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో తలపడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్(88), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (41 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్ ఆడినా 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
A spectacular run-chase by @PunjabKingsIPL in a high-scoring thriller sums up a Super Sunday 😍#TATAIPL #PBKSvRCB pic.twitter.com/7x90qu4YjI
— IndianPremierLeague (@IPL) March 27, 2022
చదవండి: IPL 2022 MI Vs DC: 6,1,6,4,1,6.. ముంబై చేసిన అతి పెద్ద తప్పిదం అదే.. అందుకే ఓడిపోయింది!
Always tough to bow out of a tournament you aim to win but our women's team can hold their heads high. You gave it your all and we are proud of you. 🙏🏻🇮🇳
— Virat Kohli (@imVkohli) March 28, 2022
Comments
Please login to add a commentAdd a comment