క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన కోహ్లి సేనపై ప్రశంసలు కురిపించారు. సచిన్ తన మనసులోని మాటలను ఆసీస్ మాజీ బౌలర్ బ్రెట్ లీకి ఇచ్చిన ఇంటార్య్వూలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక దశాబ్దం(1990) పాటు ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
అదే విధంగా టీమిండియా కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని సచిన్ అన్నారు. మాస్టర్ బ్లాస్టర్ అన్న ఈ మాటలతో మన ఆటగాళ్లకు మరింత ప్రొత్సాహాం లభించింది. ‘ అతి చిన్న వయసులో(16) ఇండియా తరపున ఆడే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తానని సచిన్ పేర్కొన్నారు. ‘నాకు క్రికెట్ ఆక్సిజన్‌తో సమానం. అది లేని జీవితాన్ని ఊహించుకోలేను. ఫ్యూచర్‌లోను క్రికెట్‌ను కొనసాగిస్తాను’ అని క్రికెట్ దిగ్గజం తెలిపారు.
అంతేకాక నన్ను ఆదరించిన అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని సచిన్ అన్నారు. సఫారీ గడ్డపై టీమిండియా జట్టు మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. జనవరి 5వ తేదీ నుంచి మొదటి టెస్టు ప్రారంభం కానుంది. బ్రెట్ లీ ‘అప్ ఇన్ ది గ్రిల్’ అనే తన యూట్యూబ్ షో కోసం చేసిన ఇంటార్య్వూలో సచిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment