
పోష్‌స్ట్రూమ్: దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఎల్గర్ (199; 15 ఫోర్లు, 3 సిక్సర్లు), హాషీమ్ ఆమ్లా (137; 17 ఫోర్లు, 1 సిక్స్) బంగ్లాదేశ్ బౌలర్లతో ఆటాడుకున్నారు. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ఎల్గర్ పరుగు తేడాతో ‘డబుల్ సెంచరీ’ని చేజార్చుకున్నాడు. కానీ... ఓవరాల్‌గా 199 పరుగుల వద్ద ఔటైన పదో బ్యాట్స్‌మన్‌గా టెస్టు చరిత్రలో నిలిచాడు. దక్షిణాఫ్రికా తరఫున తొలి బ్యాట్స్‌మన్ అయ్యాడు. ఓవర్‌నైట్ స్కోరు 298/1తో రెండో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 146 ఓవర్లలో 496/3 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఎల్గర్, ఆమ్లా రెండో వికెట్‌కు 215 పరుగులు జోడించారు. బవుమా (31 నాటౌట్), డు ప్లెసిస్ (26 నాటౌట్) అజేయంగా నిలిచారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఆట నిలిచే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.