పోర్ట్ ఎలిజెబెత్(దక్షిణాఫ్రికా) : తమ పిల్లలకు కష్టమొస్తే తల్లడిల్లి పోయే తండ్రులను చూసుంటారు.. తాము కష్టాలపాలైనా పిల్లలు సుఖంగా ఉంటే చాలనుకునే నాన్నలను చూసుంటారు.. కానీ ఈ తండ్రి అందుకు పూర్తి భిన్నం. కష్టాల నుంచి తప్పించుకోవడానికి ఆరు నెలల కూతురిని ఇంటిపై నుంచి విసిరేశాడు. అదృష్టం బాగుండి పాపను పోలీసులు కిందపడకుండా పట్టుకోవడంతో ఎలాంటి గాయాలు లేకుండా బతికి పోయింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని పోర్ట్ ఎలిజెబెత్ సమీపంలో ఉన్న క్వాడ్‌వేసి పట్టణంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిసిన వివరాల మేరకు.. క్వాడ్‌వేసి పట్టణంలోని జాయ్ స్లోవో టౌన్ షిప్‌లో అక్రమంగా నిర్మించిన 90 ఇళ్లను కూల్చాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయం అక్కడ ఉంటున్న వారికి తెలియడంతో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. తమ ఇళ్లను కూల్చొద్దంటూ నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టారు. రోడ్లపైకి వచ్చిన నిరసనకారలు టైర్లు కాల్చి, రహదారులను నిర్భందించి పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతలో ఓ వ్యక్తి తన కూతురిని తీసుకుని తాను ఉంటున్న ఇంటిపైకి ఎక్కాడు.
పోలీసులు వెనక్కి వెళ్లకపోతే పాపను కింద పడేస్తానని బెదిరించాడు. అతడితో పోలీసులు జరిపిన చర్చలు విఫలమవడంతో తన కూతురిని కిందకు పడేశాడు. అదృష్టవశాత్తు కిందున్న పోలీసులు పాపను పట్టుకోవడంతో చిన్నారి క్షేమంగా బయటపడింది. కూతుర్ని ఇంటిపై నుంచి కిందకు పడేసిన కసాయి తండ్రిని హత్యాయత్నం కేసు కింద పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి కోసం పాపను బలి చేయాలనుకున్న ఆ తండ్రిపై నెటిజన్లు కారాలు మిరియాలు నూరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment