Port Elizabeth
-
సోషల్ మీడియా తాజా సంచలనం
న్యూఢిల్లీ: ఇవానా క్యాంప్‌బెల్.. సోషల్ మీడియాలో తాజా సంచలనం. ఆరేళ్ల ఈ ఆఫ్రికా చిన్నారి తన డాన్స్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ముద్దుగా, బొద్దుగా ఉన్న ఈ పాప లయబ్ధంగా అలవోకగా చేస్తున్న నృత్యాలకు హాలీవుడ్ అగ్రతారల నుంచి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఆమె చేసిన డాన్స్ వీడియోను అమెరికాకు చెందిన ప్రముఖ గాయని లిజో జూన్ 8న తన అధికారిక ట్విటర్ పేజీలో షేర్ చేయడంతో ఇవానా రాత్రికి రాత్రి స్టార్ అయిపోయింది. హాలీవుడ్ నటులు క్రిస్ ఇవాన్స్, విల్‌స్మిత్ కూడా ఆమెకు అభిమానులుగా మారిపోయాయి. వీరు కూడా తమ వ్యక్తిగత సోషల్ మీడియా పేజీల్లో ఈ చిన్నారి వీడియోలు షేర్ చేయడంతో ఆమెకు ఆదరణ అమాంతంగా పెరిగిపోయింది. ఇవానా వీడియోలకు లక్షల్లో లైకులు, వ్యూస్ రావడంతో ఇంటర్నెట్ టాప్ ట్రెండింగ్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి. దక్షిణాఫ్రికాలోని పోర్ట్ ఎలిజబెత్ నగరానికి చెందిన ఇవానా మే 30న ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. అప్పుడే ఆమె సుమారు లక్షా 90 వేల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఆమె పెట్టిన 12 పోస్ట్‌లను లక్షలాది మంది వీక్షించారు. ఇవానా డాన్స్ సూపర్ అంటూ ప్రశంసలు వెల్లువలా కురుస్తున్నాయి. ఇవానా హావభావాలు అద్భుతమని తెగ పొగిడేస్తున్నారు. -
ఇలాంటి కసాయి తండ్రిని చూసుండరు..
పోర్ట్ ఎలిజెబెత్(దక్షిణాఫ్రికా) : తమ పిల్లలకు కష్టమొస్తే తల్లడిల్లి పోయే తండ్రులను చూసుంటారు.. తాము కష్టాలపాలైనా పిల్లలు సుఖంగా ఉంటే చాలనుకునే నాన్నలను చూసుంటారు.. కానీ ఈ తండ్రి అందుకు పూర్తి భిన్నం. కష్టాల నుంచి తప్పించుకోవడానికి ఆరు నెలల కూతురిని ఇంటిపై నుంచి విసిరేశాడు. అదృష్టం బాగుండి పాపను పోలీసులు కిందపడకుండా పట్టుకోవడంతో ఎలాంటి గాయాలు లేకుండా బతికి పోయింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని పోర్ట్ ఎలిజెబెత్ సమీపంలో ఉన్న క్వాడ్‌వేసి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల మేరకు.. క్వాడ్‌వేసి పట్టణంలోని జాయ్ స్లోవో టౌన్ షిప్లో అక్రమంగా నిర్మించిన 90 ఇళ్లను కూల్చాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయం అక్కడ ఉంటున్న వారికి తెలియడంతో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. తమ ఇళ్లను కూల్చొద్దంటూ నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టారు. రోడ్లపైకి వచ్చిన నిరసనకారలు టైర్లు కాల్చి, రహదారులను నిర్భందించి పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతలో ఓ వ్యక్తి తన కూతురిని తీసుకుని తాను ఉంటున్న ఇంటిపైకి ఎక్కాడు. పోలీసులు వెనక్కి వెళ్లకపోతే పాపను కింద పడేస్తానని బెదిరించాడు. అతడితో పోలీసులు జరిపిన చర్చలు విఫలమవడంతో తన కూతురిని కిందకు పడేశాడు. అదృష్టవశాత్తు కిందున్న పోలీసులు పాపను పట్టుకోవడంతో చిన్నారి క్షేమంగా బయటపడింది. కూతుర్ని ఇంటిపై నుంచి కిందకు పడేసిన కసాయి తండ్రిని హత్యాయత్నం కేసు కింద పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి కోసం పాపను బలి చేయాలనుకున్న ఆ తండ్రిపై నెటిజన్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. -
ఆస్ట్రేలియా మళ్లీ చిత్తు
నాలుగో వన్డే దక్షిణాఫ్రికాదే పోర్ట్ ఎలిజబెత్: వన్డే నంబర్‌వన్ జట్టు ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా మరో దెబ్బ వేసింది. వన్డే సిరీస్‌ను ఇప్పటికే గెలుచుకున్న సఫారీలు నాలుగో వన్డేలోనూ ఘన విజయం సాధించి తమ ఆధిక్యాన్ని 4-0కు పెంచుకున్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 36.4 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. మాథ్యూ వేడ్ (52), మిషెల్ మార్ష్ (50) అర్ధసెంచరీలు చేశారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కై ల్ అబాట్ 4 వికెట్లు తీయగా, షమ్సీకి 3 వికెట్లు దక్కారుు. ఎల్బీడబ్ల్యూ ద్వారా ఎక్కువ మందిని (6) అవుట్ చేసిన రికార్డును ఈ ఇన్నింగ్సలో దక్షిణాఫ్రికా సమం చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 35.3 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసింది. కెప్టెన్ డు ప్లెసిస్ (69) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య చివరి వన్డే కేప్‌టౌన్‌లో బుధవారం జరుగుతుంది. -
దక్షిణాఫ్రికా ఘనవిజయం
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు పోర్ట్ ఎలిజబెత్: వరుస విజయాలతో దూకుడు మీదున్న ఆస్ట్రేలియాకు దక్షిణాఫ్రికా బ్రేక్ వేసింది. ఆదివారం ముగిసిన రెండో టెస్టులో 231 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. నిర్ణయాత్మక మూడో టెస్టు మార్చి 1 నుంచి జరుగుతుంది. ఓవర్‌నైట్ స్కోరు 192/4తో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా... రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 270 పరుగులు చేశాక డిక్లేర్ చేసింది. ఆమ్లా (127 నాటౌట్) అజేయ సెంచరీతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని... దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాకు 448 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కంగారూలు రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకే ఆలౌటయ్యారు. ఓపెనర్లు రోజర్స్ (107), వార్నర్ (66) అద్భుతంగా ఆడి 126 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. అయితే స్టెయిన్ (4/55), ఫిలాండర్ (2/39) అద్భుతంగా బౌలింగ్ చేసి మరో రోజు మిగిలుండగానే ఆతిథ్య జట్టును గెలిపించారు. -
భారీ ఆధిక్యంలో దక్షిణాఫ్రికా
ఆసీస్ 246 ఆలౌట్ రెండో టెస్టు పోర్ట్ ఎలిజబెత్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా భారీ ఆధిక్యం సాధించింది. ఆమ్లా (126 బంతుల్లో 93 బ్యాటింగ్; 12 ఫోర్లు) రాణించడంతో శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. ఆమ్లాతో పాటు డికాక్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఓపెనర్లు స్మిత్ (14), ఎల్గర్ (16) విఫమైనా... డివిలియర్స్ (29), డుప్లెసిస్ (24) మూడో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. జాన్సన్, సిడిల్ చెరో రెండు వికెట్లు తీశారు. ప్రస్తుతం ప్రొటీస్ జట్టు 369 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు 112/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. దీంతో స్మిత్‌సేనకు 177 పరుగుల ఆధిక్యం దక్కింది. వార్నర్ (70) టాప్ స్కోరర్. స్టీవెన్ స్మిత్ (49) ఫర్వాలేదనిపించినా.. మిగతా వారు విఫలమయ్యారు. ఫిలాండర్, మోర్నీ మోర్కెల్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. -
దక్షిణాఫ్రికా ఆధిపత్యం
ఆసీస్‌తో రెండో టెస్టు డివిలియర్స్, డుమిని సెంచరీలు పోర్ట్ ఎలిజబెత్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. డివిలియర్స్ (232 బంతుల్లో 116; 14 ఫోర్లు, 1 సిక్సర్), డుమిని (231 బంతుల్లో 123; 14 ఫోర్లు) సెంచరీలతో చెలరేగడంతో శుక్రవారం రెండో రోజు సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 150.5 ఓవర్లలో 423 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో 4 వికెట్లకు 112 పరుగులు చేసి ఎదురీదుతోంది. వార్నర్ (67 బంతుల్లో 65 బ్యాటింగ్; 10 ఫోర్లు), లియోన్ (26 బంతుల్లో 12 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. పార్నెల్ (2/19), ఫిలాండర్ (2/26) ధాటికి కంగారూ జట్టు 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే వార్నర్, క్లార్క్ నాలుగో వికెట్‌కు 40 పరుగులు జోడించారు. ప్రస్తుతం క్లార్క్‌సేన ఇంకా 311 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 214/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో డివిలియర్స్, డుమిని నిలకడగా ఆడారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 149 పరుగులు జోడించి జట్టుకు భారీ స్కోరును ఖాయం చేశారు. అయితే లోయర్ ఆర్డర్ విఫలం కావడంతో ప్రొటీస్ జట్టు 74 పరుగుల తేడాతో చివరి ఐదు వికెట్లు చేజార్చుకుంది. లియోన్ 5 వికెట్లు తీశాడు. -
దక్షిణాఫ్రికాను ఆదుకున్న ఎల్గర్
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు పోర్ట్ ఎలిజబెత్: ఆస్ట్రేలియా చేతిలో తొలిటెస్టులో ఎదురైన ఓటమి భారం నుంచి దక్షిణాఫ్రికా తొందరగానే కోలుకుంది. గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో స్ఫూర్తిదాయక ఆటతీరు ప్రదర్శిస్తోంది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న స్మిత్‌సేన ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా.. ఎల్గర్ (193 బంతుల్లో 83; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), డుప్లెసిస్ (126 బంతుల్లో 55; 5 ఫోర్లు, 1 సిక్స్)ల పోరాటంతో కోలుకుంది. ఫలితంగా తొలిరోజు ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. యువ బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్‌కు టెస్టుల్లో తొలిసారిగా అవకాశమివ్వడంతోపాటు నాలుగు మార్పులతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే కెప్టెన్ స్మిత్ (9)ను హారిస్ అవుట్ చేయగా... తర్వాతి ఓవర్లో ఆమ్లా (0)ను జాన్సన్ పెవిలియన్‌కు పంపాడు. ఈ దశలో ఎల్గర్-డుప్లెసిస్ జోడి కంగారూల బౌలింగ్‌ను సహనంతో ఎదుర్కొంటూ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. మూడో వికెట్‌కు 112 పరుగులు జోడించాక డుప్లెసిస్‌ను లియాన్ ఔట్ చేశాడు. అనంతరం డివిలియర్స్‌తో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించిన ఎల్గర్నూ లియాన్ వెనక్కి పంపడం, డికాక్ (7)ను స్టీవెన్ స్మిత్ ఔట్ చేయడంతో చివర్లో ఆసీస్ ఆధిపత్యం ప్రదర్శించింది. క్రీజులో డివిలియర్స్ (51 బ్యాటింగ్), డుమిని (1 బ్యాటింగ్) ఉన్నారు.