భారీ ఆధిక్యంలో దక్షిణాఫ్రికా
ఆసీస్ 246 ఆలౌట్ రెండో టెస్టు
పోర్ట్ ఎలిజబెత్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా భారీ ఆధిక్యం సాధించింది. ఆమ్లా (126 బంతుల్లో 93 బ్యాటింగ్; 12 ఫోర్లు) రాణించడంతో శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది.
ఆమ్లాతో పాటు డికాక్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఓపెనర్లు స్మిత్ (14), ఎల్గర్ (16) విఫమైనా... డివిలియర్స్ (29), డుప్లెసిస్ (24) మూడో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. జాన్సన్, సిడిల్ చెరో రెండు వికెట్లు తీశారు. ప్రస్తుతం ప్రొటీస్ జట్టు 369 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అంతకుముందు 112/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. దీంతో స్మిత్‌సేనకు 177 పరుగుల ఆధిక్యం దక్కింది. వార్నర్ (70) టాప్ స్కోరర్. స్టీవెన్ స్మిత్ (49) ఫర్వాలేదనిపించినా.. మిగతా వారు విఫలమయ్యారు. ఫిలాండర్, మోర్నీ మోర్కెల్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.