దక్షిణాఫ్రికా ఘనవిజయం | south africa won second test match with australia team | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా ఘనవిజయం

Published Mon, Feb 24 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM

దక్షిణాఫ్రికా ఘనవిజయం

దక్షిణాఫ్రికా ఘనవిజయం

ఆస్ట్రేలియాతో రెండో టెస్టు
 పోర్ట్ ఎలిజబెత్: వరుస విజయాలతో దూకుడు మీదున్న ఆస్ట్రేలియాకు దక్షిణాఫ్రికా బ్రేక్ వేసింది. ఆదివారం ముగిసిన రెండో టెస్టులో 231 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. నిర్ణయాత్మక మూడో టెస్టు మార్చి 1 నుంచి జరుగుతుంది.
 
 ఓవర్‌నైట్ స్కోరు 192/4తో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా... రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 270 పరుగులు చేశాక డిక్లేర్ చేసింది. ఆమ్లా (127 నాటౌట్) అజేయ సెంచరీతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని... దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాకు 448 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కంగారూలు రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకే ఆలౌటయ్యారు. ఓపెనర్లు రోజర్స్ (107), వార్నర్ (66) అద్భుతంగా ఆడి 126 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. అయితే స్టెయిన్ (4/55), ఫిలాండర్ (2/39) అద్భుతంగా బౌలింగ్ చేసి మరో రోజు మిగిలుండగానే ఆతిథ్య జట్టును గెలిపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement