
శ్రీవారి ఆలయ నిబంధనలకు మంత్రి సవిత భద్రతా సిబ్బంది తూట్లు పొడిచారు.
సాక్షి, తిరుపతి: కూటమి సర్కార్ పాలనలో తిరుమల వెంకన్న స్వామికి ఘోర అపచారం జరిగింది. శ్రీవారి ఆలయ నిబంధనలకు మంత్రి సవిత భద్రతా సిబ్బంది తూట్లు పొడిచారు. వెంకటేశ్వరస్వామి దర్శనానికి మంత్రి సవిత రాగా, ఆలయ ఆవరణలోకి ఆమె భద్రతా సిబ్బంది షూతో వచ్చారు. పాదరక్షలతో ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టారు. మంత్రి సెక్యూరిటీపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ పర్యవేక్షణ లోపంపై కూడా భక్తులు మండిపడుతున్నారు.
కాగా, అక్టోబర్ నెలలో తిరుమల అన్న ప్రసాదంలో జెర్రి రావడంతో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అన్న ప్రసాదంలో జెర్రి రావడంతో అది తింటున్న భక్తుడు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. మాధవ నిలయం-2 అన్న ప్రసాద కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై సదరు భక్తులు.. అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల అన్న ప్రసాదం విషయంలో ప్రభుత్వం, టీటీడీ నిర్లక్ష్యం బట్టబయలైంది.
ఇదీ చదవండి: బీఆర్ నాయుడుపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు