బీఆర్‌ నాయుడుపై సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు | cybercrime case against tv5 chairman br naidu: Telangana | Sakshi
Sakshi News home page

బీఆర్‌ నాయుడుపై సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు

Published Fri, Dec 27 2024 5:21 AM | Last Updated on Fri, Dec 27 2024 5:21 AM

cybercrime case against tv5 chairman br naidu: Telangana

టీవీ5లో కోర్టు లైవ్‌ స్ట్రీమింగ్‌ వీడియోను ప్రదర్శించారన్న న్యాయవాది ఇమ్మానేని

సాక్షి, హైదరాబాద్‌: న్యాయస్థానాల్లో జరి గే వాదోపవాదాల లైవ్‌ స్ట్రీమింగ్‌ వీడియోను ప్రదర్శించడం చట్టవిరుద్ధమని తెలిసినా ప్రసారం చేశారని టీవీ 5 చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఎండీ రవీంద్రనాథ్‌తోపాటు యాంకర్‌ సింధూర శివపై న్యాయ వాది ఇమ్మానేని రామారావు నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం ఆ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ నెల 17న ఓ కార్యక్రమం ప్రసారం సందర్భంగా న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులు, న్యాయవాదులపై తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. న్యాయవ్యవస్థ, న్యాయవాదుల అస్తిత్వాన్ని కించపరిచేలా విద్వేషపూరితంగా, వ్యంగ్యంగా వ్యాఖ్యలు ప్రసారం చేశారని ఆరోపించారు.

ఉన్నత న్యాయస్థానం వెబ్‌సైట్‌లోకి చొరబడి వార్తాసంస్థల ముసుగులో న్యాయప్రక్రియ, వాదనలను కాపీరైట్‌ను ఉల్లంఘించి ప్రసారం చేశారని, న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా సింధూర శివ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారన్నారు. లైవ్‌ స్ట్రీమింగ్‌ను రికార్డు చేయొద్దని, సోషల్‌ మీడియాలో పోస్టు చేయొద్దని.. అలాంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు చెప్పినా ధిక్కరిస్తూ ప్రసారం చేశారని వెల్లడించారు. ఇది కోర్టు ధిక్కరణేకాక, సైబర్‌ క్రైమ్‌ కిందకు వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని, ధిక్కరణలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement