నాలుగో వన్డే దక్షిణాఫ్రికాదే
పోర్ట్ ఎలిజబెత్: వన్డే నంబర్‌వన్ జట్టు ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా మరో దెబ్బ వేసింది. వన్డే సిరీస్‌ను ఇప్పటికే గెలుచుకున్న సఫారీలు నాలుగో వన్డేలోనూ ఘన విజయం సాధించి తమ ఆధిక్యాన్ని 4-0కు పెంచుకున్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 36.4 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. మాథ్యూ వేడ్ (52), మిషెల్ మార్ష్ (50) అర్ధసెంచరీలు చేశారు.
‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కై ల్ అబాట్ 4 వికెట్లు తీయగా, షమ్సీకి 3 వికెట్లు దక్కారుు. ఎల్బీడబ్ల్యూ ద్వారా ఎక్కువ మందిని (6) అవుట్ చేసిన రికార్డును ఈ ఇన్నింగ్‌సలో దక్షిణాఫ్రికా సమం చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 35.3 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసింది. కెప్టెన్ డు ప్లెసిస్ (69) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య చివరి వన్డే కేప్‌టౌన్‌లో బుధవారం జరుగుతుంది.
ఆస్ట్రేలియా మళ్లీ చిత్తు
Published Mon, Oct 10 2016 1:13 AM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
Advertisement
Advertisement