సోషల్‌ మీడియా తాజా సంచలనం | Social Media Latest Sensation Ivanah Campbell | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా తాజా సంచలనం

Published Wed, Jun 12 2019 6:41 PM | Last Updated on Wed, Jun 12 2019 6:52 PM

Social Media Latest Sensation Ivanah Campbell - Sakshi

న్యూఢిల్లీ: ఇవానా క్యాంప్‌బెల్‌.. సోషల్‌ మీడియాలో తాజా సంచలనం. ఆరేళ్ల ఈ ఆఫ్రికా చిన్నారి తన డాన్స్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ముద్దుగా, బొద్దుగా ఉన్న ఈ పాప లయబ్ధంగా అలవోకగా చేస్తున్న నృత్యాలకు హాలీవుడ్‌ అగ్రతారల నుంచి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఆమె చేసిన డాన్స్‌ వీడియోను అమెరికాకు చెందిన ప్రముఖ గాయని లిజో జూన్‌ 8న తన అధికారిక ట్విటర్‌ పేజీలో షేర్‌ చేయడంతో ఇవానా రాత్రికి రాత్రి స్టార్‌ అయిపోయింది.

హాలీవుడ్‌ నటులు క్రిస్‌ ఇవాన్స్‌, విల్‌స్మిత్‌ కూడా ఆమెకు అభిమానులుగా మారిపోయాయి. వీరు కూడా తమ వ్యక్తిగత సోషల్‌ మీడియా పేజీల్లో ఈ చిన్నారి వీడియోలు షేర్‌ చేయడంతో ఆమెకు ఆదరణ అమాంతంగా పెరిగిపోయింది. ఇవానా వీడియోలకు లక్షల్లో లైకులు, వ్యూస్‌ రావడంతో ఇంటర్నెట్‌ టాప్‌ ట్రెండింగ్‌ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి.

దక్షిణాఫ్రికాలోని పోర్ట్‌ ఎలిజబెత్‌ నగరానికి చెందిన ఇవానా మే 30న ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. అప్పుడే ఆమె సుమారు లక్షా 90 వేల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఆమె పెట్టిన 12 పోస్ట్‌లను లక్షలాది మంది వీక్షించారు. ఇవానా డాన్స్‌ సూపర్‌ అంటూ ప్రశంసలు వెల్లువలా కురుస్తున్నాయి. ఇవానా హావభావాలు అద్భుతమని తెగ పొగిడేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement