Rashmika Mandanna Reacts To School Girl Dancing On Pushpa Saami Saami Song - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: ‘శ్రీవల్లి’ హుక్‌ స్టెప్‌ ఫాలో అయిన చిన్నారి, పాప అడ్రస్‌ కావాలంటూ రష్మిక ట్వీట్‌

Published Wed, Sep 14 2022 8:42 PM | Last Updated on Thu, Sep 15 2022 9:43 AM

Rashmika Mandanna React On School Girl Dance Video On Ra Ra Sami Song - Sakshi

అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో హీరోయిన్‌గా నటించిన రష్మిక రేంజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఆమె పాన్‌ ఇండియా నటిగా మారిపోయింది. ఇక కలెక్షన్ల పరంగా పుష్ప బక్సాఫీసు వద్ద  సృష్టించిన సునామి అంతాఇంత కాదు. పుష్పకు ఈ రేంజ్‌లో గుర్తింపు రావడానికి ఇందులోని పాటలు కూడా ప్రధాన పాత్ర పోషించాయి.  ఇప్పటికీ ఈ పాటలు మారుమోగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రష్మిక రారా సామి పాట బాగా ఆకట్టుకుంది. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసి ఈ పాట రీల్స్‌యే దర్శనమిచ్చాయి.

చదవండి: మళ్లీ బుక్కైన తమన్‌.. ‘ఏంటమ్మా.. ఇది’ అంటూ మెగా ఫ్యాన్స్‌ ఫైర్‌

ఇక ఇందులో రారా సామి అంటూ రష్మిక నడుం వంచి వేసిన హుక్‌ స్టెప్‌ను ప్రతి ఒక్కరు ఫాలో అయ్యారు. తాజాగా ఇదే పాటకు ఓ చిన్నారి డాన్స్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. స్కూల్లో తన స్నేహితులతో కలిసి రారా సామి అంటూ ఈ చిన్నారి డాన్స్‌ చేస్తూ రష్మిక హుక్‌ స్టెప్‌ను అనుసరించింది. ఆ చిన్నారి డాన్స్‌కు ఫిదా అయిన ఓ నెటిజన్‌ ఈ వీడియోను తన ట్విటర్‌ అకౌంట్‌లో షేర్‌ చేశాడు. దీంతో వైరల్‌గా మారిన ఈ వీడియో రష్మిక కంటపడింది. ఇక ఈ ట్వీట్‌ను రష్మిక రీట్వీట్‌ చేస్తూ.. ‘షి మేడ్‌ మై డే. ఈ రోజుకు ఇది చాలు. ఈ క్యూటీని కలవాలనుకుంటున్నా. ఎలా?’ అంటూ పాప అడ్రస్‌ కావాలంటూ రష్మిక ఆరా తీసింది.   

చదవండి: రణ్‌వీర్‌ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్‌! అసలేం జరిగిందంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement