‘రారా సామి’పాటకి స్కూల్‌ గర్ల్‌ స్టెప్పులు..రష్మిక ‘క్యూట్‌’ రియాక్షన్‌ | School Girl Dance For Pushpa Movie Saami Saami Song, Rashmika Reaction Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

School Girl Saami Saami Song Dance: ‘రారా సామి’పాటకి స్కూల్‌ గర్ల్‌ స్టెప్పులు..రష్మిక ‘క్యూట్‌’ రియాక్షన్‌

Published Tue, Oct 3 2023 2:25 PM | Last Updated on Tue, Oct 3 2023 2:53 PM

School Girl Dance For Saami Saami Song, Rashmika Cute Reaction - Sakshi

అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా కలిసి నటించిన పుష్ప చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘రారా సామి’పాటకు రష్మిక వేసిన స్టెప్పులు బాగా వైరల్‌ అయ్యాయి. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ పాటే మోగేది. చాలా మంది రీల్స్‌ చేసి.. ఈ పాటను వైరల్‌ చేశారు. పలువురు హీరోయిన్లు కూడా ఈ పాటకు స్టెప్పులేశారు.

సినిమా విడుదలై రెండేళ్లు కావోస్తున్న ‘రారా సామి’ క్రేజ్‌ మాత్రం తగ్గట్లేదు. తాజాగా ఈ పాటకు దాదాపు ఐదేళ్లు వయసు ఉన్న చిన్నారి చిందులేసి అలరించింది. మహారాష్ట్రకు చెందిన ఆ చిన్నారి.. స్కూల్‌ కల్చరల్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా రారా సామి పాటకు డ్యాన్స్‌ చేసింది. ఆమెతో పాటు మిగతా విద్యార్థులు కూడా స్టెప్పులేసి అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. దీనిని రష్మిక ఎక్స్‌(ట్విటర్‌)లో షేర్‌ చేస్తూ.., ‘సో క్యూట్’ అంటూ అని క్యాప్షన్‌ ఇచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement