Rashmika Mandanna Gets Another Big Offer In Bollywood - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: రష్మికకు తగ్గని క్రేజ్.. బాలీవుడ్‍లో భారీ ఆఫర్..!

Published Sun, Sep 18 2022 2:47 PM | Last Updated on Sun, Sep 18 2022 3:31 PM

Rashmika Mandanna  Gets Another Big Offer In Bollywood - Sakshi

హీరోయిన్ రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ‍్గడం లేదు.  వరుస ఆఫర‍్లతో  కెరీర్‍లో దూసుకెళ్తోంది.  సౌత్ ఇండియాలో ఇప్పటికే ఆమెకు భారీ డిమాండ్ ఉండగా.. బాలీవుడ్‌లోనూ ఆమె కోసం అక్కడి దర్శకనిర్మాతలు వరుస కడుతున‍్నారు.  ఇప్పటికే ఈ భామ బాలీవుడ్‌లో నటించిన  ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ రిలీజ్‌ అయ‍్యేందుకు రెడీ అయ్యాయి.  మరో చిత్రం ‘యానిమల్’  చిత్రీకరణ కొనసాగుతోంది.

తాజాగా ఈ నేషనల్‌ క్రష్‌ని మరో భారీ ఆఫర్‌ వరించినట్లు తెలుస్తోంది. అనురాగ్ బసు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆషికీ 3’లో రష్మికను హీరోయిన్‌గా తీసుకున్నట్లు సమాచారం.  అయితే తాజాగా రష్మికకు మరో భారీ ఆఫర్ వరించినట్లు తెలుస్తోంది. ‘ఆషికీ 3’లో ఈ ముద్దుగుమ్మను  హీరోయిన్‌గా తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మధ్యే కథ విన్న రష్మిక వెంటనే సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట.  ఈ విషయాన్ని  త్వరలోనే చిత్రబృందం అధికారికంగా వెల్లడించనున్నారు. 

ఆషికీ 3 హీరో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి రష్మిక  ఇటీవల ఓ యాడ్‌లో నటించింది. ఇద్దరి జోడీ బాగా సెట్ అయిందని  బాలీవుడ్  ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆషికీ-3’లో ఈ  జంట నటిస్తే సినిమా హిట్ అవడం ఖాయమంటున్నారు.

(చదవండి: విజయ్‌తో రష‍్మిక మందన్నా సెల్ఫీ వైరల్)

ఇప్పటికే బాలీవుడ్‌లో ‘ఆషికీ’ సీక్వెల్స్‌కు మంచి ఆదరణ ఉంది. 1990లో రాహుల్ రాయ్, అను అగర్వాల్ జంటగా నటించిన ‘ఆషికీ’ అప్పట్లో పెద్ద విజయాన‍్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రానికి కొనసాగింపుగా 2013లో వచ్చిన ‘ఆషికీ 2’ సైతం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా జోడి ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ మంచి పేరు తెచ్చుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement