Ashiqui 2
-
ఒకపుడు కాఫీ షాప్‌లో పనిచేసింది..ఒక్క సినిమాతో కలలరాణిగా.. ఎవరీ స్టార్ కిడ్?
యాక్టింగ్‌లోకి రాకముందు చాలామంది మోడల్‌గా లేదా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి ఒక్కో మెట్టూ ఎదుగుతూ స్టార్ ఇమేజ్ సంపాదించు కుంటారు. అదే అప్పటికే స్టార్లుగా, సూపర్ స్టార్లుగా పేరు సంపాదించిన వారి పిల్లలైతే ఎలాంటి ఇబ్బందీ లేకుండానే చాలా గ్రాండ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు. అలాంటి స్టార్ కిడ్స్ను అటు ఇండస్ట్రీ, ఇటు ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తారు. మరికొంతమంది . కానీ ప్రముఖ నటుడు కూతురు మాత్రం దీనికి భిన్నం. గ్లామరస్ షోబిజ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందు ఆమె ఏం చేసిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ నటుడు ఎవరు? ఆయన కూతురు ఎవరు? ఈ వివరాలన్నీ తెలియాలంటే మీరు స్టోరీ చదవాల్సిందే. బాలీవుడ్లో విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు శక్తి కపూర్. విలనిజాన్ని పండించడంలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు ఆయన. ఆయన ముద్దుల తనయ శ్రద్ధా కపూర్. 1987, మార్చిలో పుట్టింది. సూపర్ స్టార్ కుటుంబం నేపథ్యం, అందం, ప్రతిభ రెండూ ఉన్నప్పటికీ శ్రద్ధా తొలి చిత్రం (2010లో "తీన్ పట్టి" ) ఫ్లాప్ అయ్యింది. దాదాపు మూడేళ్ల తరువాత గానీ హీరోయిన్గా గుర్తింపు రాలేదు. కానీ 2013లో ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ భామ. ఆషికీ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఆషికీ 2 సినిమా ఆరోహి పాత్రతో ఒక్కసారిగా యూత్ కలల రాణిగా అవతరించింది. బాలీవుడ్లో టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరుగా నిలిచింది. ఒక్కో సినిమాకు సుమారు 5 కోట్ల రూపాయలదాకా తీసుకుంటుందని సమాచారం. పెళ్లికిచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూసి అతిథులు ఫిదా : ఫాదర్ ఐడియా అదిరింది! "ఏక్ విలన్,’’ "హైదర్", "ABCD", "బాఘీ", "హాఫ్-గర్ల్‌ఫ్రెండ్" “సాహో” (2019),చిచోరే, “స్ట్రీట్ డ్యాన్సర్” (2020),'తూ ఝూతీ మై మక్కార్' (2023) లాంటి పలు సినిమాల్లో నటించింది. అనేక అవార్డులు, ప్రశంసలను అందుకుంది. "లవ్ కా ది ఎండ్" చిత్రంలో ఉత్తమ నటిగా స్టార్‌డస్ట్ సెర్చ్‌లైట్ అవార్డును అందుకుంది. 2014లో మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీల మెకాఫీ జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. శ్రద్ధా మంచి గాయని కూడా శ్రద్ధా కపూర్ నటన మాత్రమేకాదు పాటలు పాటడంలో కూడా దిట్ట. దివంగత గాయని లతా మంగేష్కర్ , ఆశా భోంస్లేల నుంచి శ్రద్ధాకు వారసత్వంగా వచ్చిన ప్రతిభ ఇదని భావిస్తారు. శ్రద్దాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం, నటించడం అంటే ఆసక్తి ఉండేదట. సినిమా డైలాగులు రిహార్సల్ చేస్తూ బాలీవుడ్ పాటలకు అద్దం ముందు డ్యాన్స్ చేస్తూ ఉండేదట. అలాగే తండ్రితో పాటు వివిధ షూటింగ్ లొకేషన్లకు కూడా వెళ్లేది. అలా నటనపై ఆసక్తి ఉన్నప్నపటికీ సినిమాల్లోకి రాకముందే తన చదువును పూర్తి చేయాలని భావించింది. అందుకే పదహారేళ్ల వయసులో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చిత్రంలో ఆఫర్ వచ్చిన ఆఫర్‌ను తిరస్కరించింది. శ్రద్ధా బోస్టన్ విశ్వ విద్యాలయంలో సైకాలజీ చదువుతున్న క్రమంలో ఆమె అక్కడ కాఫీ షాప్‌లో కూడా పనిచేసిందని చెబుతారు. శ్రద్ధా ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు దాటిపోయింది. హారర్ కామెడీ , డ్యాన్స్ డ్రామా జానర్‌తో చిత్రాలతోపాటు, గాయనిగా కూడా తనను తాను నిరూపించుకుంటోంది. స్త్రీ-2 తోపాటు ప్రస్తుతం రెండు-మూడు సినిమాలున్నాయని, ఈ ప్రాజెక్ట్‌లు టైమ్ ట్రావెల్, పురాణాల ఆధారంగా ఉంటాయని ఇటీవల శ్రద్ధా కపూర్ ప్రకటించింది. సోషల్ మీడియా క్రేజ్ ఇన్‌స్టాలో 86.8 మిలియన్లు, ట్విటర్లో 14.3 మిలియన్ల ఫాలోయర్లుఉన్నారంటేనే సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్‌ను అర్థం చేసు కోవచ్చు. నటనతో పాటు అనేక పాపులర్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్న శ్రద్ధా ప్రస్తుత నికర విలువ దాదాపు రూ. 123 కోట్లుగా అంచనా. -
సహజీవనం నా జీవితాన్ని నాశనం చేసింది: ప్రముఖ నటి
బాలీవుడ్ నటి అను అగర్వాల్ గురించి చాలామందికి తెలియదు. టాలీవుడ్లో దొంగ దొంగది సినిమాలో అలరించింది. అయితే అనుకోని అంతకుముందే ఆషికి సినిమాతో బాలీవుడ్లో ఫేమ్ సాధించింది. ఆమె నటించిన ఆషికి సూపర్‌హిట్‌గా నిలిచింది. రోడ్డు ప్రమాదంతో కోమాలోకి వెళ్లిడంతో కెరీర్ బ్రేక్ పడింది. తాజాగా ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ వ్యక్తితో తాను సహజీవనం చేసినట్లు వెల్లడించింది. అయితే దానివల్ల తన వ్యక్తిగత జీవితం నాశమైందని తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అను అగర్వాల్ మాట్లాడుతూ..'నేను ఓ వ్యక్తితో సహజీవనం చేశా. అయితే అతని తల్లి కూడా మాతో నివసించింది. ఆమె కూడా నన్ను అంగీకరించింది. కానీ ఆమె స్నేహితులు నా గురించి చెడుగా చెప్పారు. అంతేకాకుండా పత్రికల్లో నా గురించి వ్రాసిన విషయాలను నమ్మారు. దీంతో నా జీవితం నాశనమైంది. ఆ సమయంలో నన్ను నేను రక్షించుకోవడానికి నాకు ఎలాంటి మార్గాలు లేవు. అప్పట్లో సోషల్ మీడియా కూడా లేదు. దీంతో నా వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయా'. అని అన్నారు. అను బాలీవుడ్ అరంగేట్రం: 1990లో తన తొలి బాలీవుడ్ చిత్రం ఆషికి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమాతో అను ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత నటించిన గజబ్ తమాషా, జనమ్ కుండ్లీ, కింగ్ అంకుల్, రిటర్న్ ఆఫ్ జ్యువెల్ థీఫ్ చిత్రాల్లో నటించింది. ఊహించని రోడ్డు ప్రమాదంతో సినిమాలకు దూరమైంది. 1999లో జరిగిన ఓ ప్రమాదం ఆమె జీవితాన్ని కుదిపేసింది. దాదాపు నెల రోజుల పాటు కోమాలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం అను అగర్వాల్ ఫౌండేషన్‌ను నడుపుతూ, యోగా క్లాసులు నిర్వహిస్తోంది. -
‘ఆషికీ 3’లో హీరోయిన్గా రష్మిక మందన్నా?
రష్మికా మందన్నా కెరీర్ మంచి జోరు మీద ఉంది. ఒకవైపు దక్షిణాది సినిమాలు సైన్ చేస్తూ మరోవైపు ఉత్తరాదిపై కూడా దృష్టి పెట్టారీ బ్యూటీ. ఇప్పటికే హిందీలో ‘గుడ్ బై’, ‘మిషన్ మజు్న’, ‘యానిమల్’ వంటి చిత్రాలు ఆమె లిస్ట్‌లో ఉన్నాయి. తాజాగా ఓ హిట్ సీక్వెల్ (ఆషికీ) లో హీరోయిన్గా రషి్మకా దాదాపు ఖరారు అయ్యారని సమాచారం. రాహుల్ రాయ్, అను అగర్వాల్ జంటగా రూపొందిన ‘ఆషికీ’ (1990) మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. చదవండి: అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ రిలీజ్.. రాముడి లుక్‌లో అదరగొట్టిన ప్రభాస్ ఆ తర్వాత పదమూడేళ్లకు ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా రూపొందిన ‘ఆషికీ 2’ (2013) కూడా హిట్టయింది. ఇప్పుడు ‘ఆషికీ 3’లో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తుండగా హీరోయిన్గా రషి్మకను ఓకే చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రష్మిక నటించే విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
రష్మికకు మరో భారీ ఆఫర్.. బాలీవుడ్‌లోనూ తగ్గేదేలే..!
హీరోయిన్ రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. వరుస ఆఫర్లతో కెరీర్లో దూసుకెళ్తోంది. సౌత్ ఇండియాలో ఇప్పటికే ఆమెకు భారీ డిమాండ్ ఉండగా.. బాలీవుడ్‌లోనూ ఆమె కోసం అక్కడి దర్శకనిర్మాతలు వరుస కడుతున్నారు. ఇప్పటికే ఈ భామ బాలీవుడ్లో నటించిన ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. మరో చిత్రం ‘యానిమల్’ చిత్రీకరణ కొనసాగుతోంది. తాజాగా ఈ నేషనల్ క్రష్‌ని మరో భారీ ఆఫర్ వరించినట్లు తెలుస్తోంది. అనురాగ్ బసు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆషికీ 3’లో రష్మికను హీరోయిన్గా తీసుకున్నట్లు సమాచారం. అయితే తాజాగా రష్మికకు మరో భారీ ఆఫర్ వరించినట్లు తెలుస్తోంది. ‘ఆషికీ 3’లో ఈ ముద్దుగుమ్మను హీరోయిన్గా తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మధ్యే కథ విన్న రష్మిక వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ విషయాన్ని త్వరలోనే చిత్రబృందం అధికారికంగా వెల్లడించనున్నారు. ఆషికీ 3 హీరో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి రష్మిక ఇటీవల ఓ యాడ్‌లో నటించింది. ఇద్దరి జోడీ బాగా సెట్ అయిందని బాలీవుడ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆషికీ-3’లో ఈ జంట నటిస్తే సినిమా హిట్ అవడం ఖాయమంటున్నారు. (చదవండి: విజయ్‌తో రష్మిక మందన్నా సెల్ఫీ వైరల్) ఇప్పటికే బాలీవుడ్లో ‘ఆషికీ’ సీక్వెల్స్‌కు మంచి ఆదరణ ఉంది. 1990లో రాహుల్ రాయ్, అను అగర్వాల్ జంటగా నటించిన ‘ఆషికీ’ అప్పట్లో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రానికి కొనసాగింపుగా 2013లో వచ్చిన ‘ఆషికీ 2’ సైతం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా జోడి ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ మంచి పేరు తెచ్చుకున్నారు. -
Palak Muchhal: హార్ట్ ఫౌండేషన్ ద్వారా ఎందరో పేద పిల్లలను ఆదుకుంటూ!
పాలక్ ముచ్చల్...అనే పేరు వినబడగానే తేనెలొలికే స్వరగానం తీయగా ధ్వనిస్తుంది. ‘ఏక్ థా టైగర్’ ‘అషికీ–2’ ‘యం.ఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’... మొదలైన సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడింది. హిందీలోనే కాదు ఎన్నో ప్రాంతీయ భాషల పాటలు పాడి అలరించింది పాలక్. సినిమా పాటలు మాత్రమే కాదు... గజల్స్, భజన్స్ ఆలాపనలో ‘ఆహా’ అనిపించింది. పాలక్ సింగర్ మాత్రమే కాదు...గీతరచయిత కూడా. ఎన్నో ప్లేలలో అద్భుతంగా నటించింది..... ఇదంతా ఒక ఎత్తయితే తన కళను సామాజికసేవకు ఉపయోగించడం మరో ఎత్తు. గుండెకు సంబంధించిన రుగ్మతలతో బాధ పడే చిన్నారుల కోసం ‘దిల్ సే దిల్ తక్’ పేరుతో దేశ, విదేశాల్లో ఎన్నో ఛారిటీ షోలు చేసింది పాలక్. గతంలోకి వెళితే... గుజరాత్ భూకంప (2001) బాధితుల కోసం నిధుల సేకరణలో చురుకైన పాత్ర పోషించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించిన పాలక్‌కు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎంత ఇష్టమో, సామాజిక సేవ అంటే కూడా అంతే ఇష్టం. ‘పాలక్ ముచ్చల్ హార్ట్ ఫౌండేషన్’ ద్వారా ఎందరో పేద పిల్లలను ఆదుకుంది పాలక్. సామాజికసేవలో చేస్తున్న కృషికి ఆమె పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు చేసుకుంది. చదవండి: Mehndi Health Benefits: గోరింటాకు పెట్టుకుంటే ఇన్ని ప్రయోజనాలా! లాసోన్ అనే రసాయనం వల్ల! View this post on Instagram A post shared by Palak Muchhal (@palakmuchhal3) -
'ఆ నిర్మాతతో సినిమా చేస్తే, రిలీజ్ కానివ్వను'
సినీ రంగంలో వివాదాలు సాధరణమే అయినా, బహిరంగంగా విమర్శలు చేసుకోవటం మాత్రం చాలా అరుదు. తాజాగా ఓ నిర్మాత, నటుడి మధ్య వచ్చిన వివాదం ట్వీట్టర్లో బెదిరింపుల వరకు వెళ్లింది. టాలీవుడ్లో అడపాదడపా సినిమాలు చేసే హీరో సచిన్ జోష్, బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్‌గా పేరున్న బండ్ల గణేష్‌కు పుట్టిన రోజు కానుకగా ఓ వార్నింగ్ ఇచ్చాడు. అతడితో ఎవరైనా సినిమా చేస్తే ఆ సినిమాను రిలీజ్ కానివ్వను జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చాడు. 'నా ప్రియమైన నమ్మకద్రోహికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. త్వరలోనే నిన్ను జైల్లో కలుస్తాను. అతనితో ఎవరైనా సినిమా చేస్తే రిలీజ్ కానివ్వను జాగ్రత్త' అంటూ ట్విట్టర్లో కామెంట్ చేశాడు. సచిన్ జోషి ఇంత ఘూటుగా పోస్ట్‌లు పెట్టినా.., బండ్ల గణేష్ మాత్రం స్పందించలేదు. ఒక సినిమా నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదం ఈ ఇద్దరు సెలబ్రిటీలను ఇలా బహిరంగంగా బెదిరింపులకు దిగేలా చేసింది. సచిన్ జోషి హీరోగా ఆషిఖీ 2 సినిమాను నీ జతగా నేనుండాలి పేరుతో రీమేక్ చేశాడు బండ్ల గణేష్. టెంపర్ సినిమా రిలీజ్ సమయంలో సచిన్ జోషి బండ్ల గణేష్‌కు ఆర్థికంగా సాయం చేశాడు. ఆ తరువాత ఈ ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా గణేష్ ఇబ్బంది పెడుతున్నాడంటూ సచిన్ కోర్టు నోటిసులు కూడా పంపాడు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే బండ్ల గణేష్ పుట్టిన రోజు సందర్భంగా తన కోపాన్ని ట్విట్టర్ వేదికగా చూపించాడు సచిన్ జోషి. Happy Birthday My Dearest Fraud @ganeshbandla Will soon visit you in jail#Bandlaganesh — Sachiin Joshi (@sachiinjoshi) March 10, 2016 #Bandlaganesh Whoever will make a film with @ganeshbandla be warned that I won't let it release — Sachiin Joshi (@sachiinjoshi) March 10, 2016 #Bandlaganesh Whoever will make a film with @ganeshbandla be warned that I won't let it release — Sachiin Joshi (@sachiinjoshi) March 10, 2016