'ఆ నిర్మాతతో సినిమా చేస్తే, రిలీజ్ కానివ్వను' | sachiin joshi warned star producer bandla ganesh | Sakshi
Sakshi News home page

'ఆ నిర్మాతతో సినిమా చేస్తే, రిలీజ్ కానివ్వను'

Published Fri, Mar 11 2016 1:37 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM

'ఆ నిర్మాతతో సినిమా చేస్తే, రిలీజ్ కానివ్వను'

'ఆ నిర్మాతతో సినిమా చేస్తే, రిలీజ్ కానివ్వను'

సినీ రంగంలో వివాదాలు సాధరణమే అయినా, బహిరంగంగా విమర్శలు చేసుకోవటం మాత్రం చాలా అరుదు. తాజాగా ఓ నిర్మాత, నటుడి మధ్య వచ్చిన వివాదం ట్వీట్టర్లో బెదిరింపుల వరకు వెళ్లింది. టాలీవుడ్లో అడపాదడపా సినిమాలు చేసే హీరో సచిన్ జోష్, బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్గా పేరున్న బండ్ల గణేష్కు పుట్టిన రోజు కానుకగా ఓ వార్నింగ్ ఇచ్చాడు. అతడితో ఎవరైనా సినిమా చేస్తే ఆ సినిమాను రిలీజ్ కానివ్వను జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

'నా ప్రియమైన నమ్మకద్రోహికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. త్వరలోనే నిన్ను జైల్లో కలుస్తాను. అతనితో ఎవరైనా సినిమా చేస్తే రిలీజ్ కానివ్వను జాగ్రత్త' అంటూ ట్విట్టర్లో కామెంట్ చేశాడు. సచిన్ జోషి ఇంత ఘూటుగా పోస్ట్లు పెట్టినా.., బండ్ల గణేష్ మాత్రం స్పందించలేదు. ఒక సినిమా నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదం ఈ ఇద్దరు సెలబ్రిటీలను ఇలా బహిరంగంగా బెదిరింపులకు దిగేలా చేసింది.

సచిన్ జోషి హీరోగా ఆషిఖీ 2 సినిమాను నీ జతగా నేనుండాలి పేరుతో రీమేక్ చేశాడు బండ్ల గణేష్. టెంపర్ సినిమా రిలీజ్ సమయంలో సచిన్ జోషి బండ్ల గణేష్కు ఆర్థికంగా సాయం చేశాడు. ఆ తరువాత ఈ ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా గణేష్ ఇబ్బంది పెడుతున్నాడంటూ సచిన్ కోర్టు నోటిసులు కూడా పంపాడు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే బండ్ల గణేష్ పుట్టిన రోజు సందర్భంగా తన కోపాన్ని ట్విట్టర్ వేదికగా చూపించాడు సచిన్ జోషి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement