యాక్టింగ్‌లోకి రాకముందు చాలామంది మోడల్‌గా లేదా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి ఒక్కో మెట్టూ ఎదుగుతూ స్టార్ ఇమేజ్ సంపాదించు కుంటారు. అదే అప్పటికే స్టార్లుగా, సూపర్ స్టార్లుగా పేరు సంపాదించిన వారి పిల్లలైతే ఎలాంటి ఇబ్బందీ లేకుండానే చాలా గ్రాండ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు. అలాంటి స్టార్ కిడ్స్‌ను అటు ఇండస్ట్రీ, ఇటు ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తారు. మరికొంతమంది . కానీ ప్రముఖ నటుడు కూతురు మాత్రం దీనికి భిన్నం. గ్లామరస్ షోబిజ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందు ఆమె ఏం చేసిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ నటుడు ఎవరు? ఆయన కూతురు ఎవరు? ఈ వివరాలన్నీ తెలియాలంటే మీరు స్టోరీ చదవాల్సిందే.
బాలీవుడ్‌లో విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు శక్తి కపూర్. విలనిజాన్ని పండించడంలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు ఆయన. ఆయన ముద్దుల తనయ శ్రద్ధా కపూర్. 1987, మార్చిలో పుట్టింది.
సూపర్ స్టార్ కుటుంబం నేపథ్యం, అందం, ప్రతిభ రెండూ ఉన్నప్పటికీ శ్రద్ధా తొలి చిత్రం (2010లో "తీన్ పట్టి" ) ఫ్లాప్ అయ్యింది. దాదాపు మూడేళ్ల తరువాత గానీ హీరోయిన్‌గా గుర్తింపు రాలేదు. కానీ 2013లో ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ భామ. ఆషికీ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఆషికీ 2 సినిమా ఆరోహి పాత్రతో ఒక్కసారిగా యూత్ కలల రాణిగా అవతరించింది. బాలీవుడ్‌లో టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరుగా నిలిచింది. ఒక్కో సినిమాకు సుమారు 5 కోట్ల రూపాయలదాకా తీసుకుంటుందని సమాచారం.
పెళ్లికిచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూసి అతిథులు ఫిదా : ఫాదర్ ఐడియా అదిరింది! |
"ఏక్ విలన్,’’ "హైదర్", "ABCD", "బాఘీ", "హాఫ్-గర్ల్‌ఫ్రెండ్" “సాహో” (2019),చిచోరే, “స్ట్రీట్ డ్యాన్సర్” (2020),'తూ ఝూతీ మై మక్కార్' (2023) లాంటి పలు సినిమాల్లో నటించింది. అనేక అవార్డులు, ప్రశంసలను అందుకుంది. "లవ్ కా ది ఎండ్" చిత్రంలో ఉత్తమ నటిగా స్టార్‌డస్ట్ సెర్చ్‌లైట్ అవార్డును అందుకుంది. 2014లో మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీల మెకాఫీ జాబితాలో 6వ స్థానంలో నిలిచింది.
శ్రద్ధా మంచి గాయని కూడా
శ్రద్ధా కపూర్ నటన మాత్రమేకాదు పాటలు పాటడంలో కూడా దిట్ట. దివంగత గాయని లతా మంగేష్కర్ , ఆశా భోంస్లేల నుంచి శ్రద్ధాకు వారసత్వంగా వచ్చిన ప్రతిభ ఇదని భావిస్తారు. శ్రద్దాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం, నటించడం అంటే ఆసక్తి ఉండేదట. సినిమా డైలాగులు రిహార్సల్ చేస్తూ బాలీవుడ్ పాటలకు అద్దం ముందు డ్యాన్స్ చేస్తూ ఉండేదట. అలాగే తండ్రితో పాటు వివిధ షూటింగ్ లొకేషన్‌లకు కూడా వెళ్లేది. అలా నటనపై ఆసక్తి ఉన్నప్నపటికీ సినిమాల్లోకి రాకముందే తన చదువును పూర్తి చేయాలని భావించింది. అందుకే పదహారేళ్ల వయసులో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చిత్రంలో ఆఫర్ వచ్చిన ఆఫర్‌ను తిరస్కరించింది. శ్రద్ధా బోస్టన్ విశ్వ విద్యాలయంలో సైకాలజీ చదువుతున్న క్రమంలో ఆమె అక్కడ కాఫీ షాప్‌లో కూడా పనిచేసిందని చెబుతారు.
శ్రద్ధా ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు దాటిపోయింది. హారర్ కామెడీ , డ్యాన్స్ డ్రామా జానర్‌తో చిత్రాలతోపాటు, గాయనిగా కూడా తనను తాను నిరూపించుకుంటోంది. స్త్రీ-2 తోపాటు ప్రస్తుతం రెండు-మూడు సినిమాలున్నాయని, ఈ ప్రాజెక్ట్‌లు టైమ్ ట్రావెల్, పురాణాల ఆధారంగా ఉంటాయని ఇటీవల శ్రద్ధా కపూర్ ప్రకటించింది.
సోషల్ మీడియా క్రేజ్
ఇన్‌స్టాలో 86.8 మిలియన్లు, ట్విటర్‌లో 14.3 మిలియన్ల ఫాలోయర్లుఉన్నారంటేనే సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్‌ను అర్థం చేసు కోవచ్చు. నటనతో పాటు అనేక పాపులర్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్న శ్రద్ధా ప్రస్తుత నికర విలువ దాదాపు రూ. 123 కోట్లుగా అంచనా.
Comments
Please login to add a commentAdd a comment