shakti kapoor
-
ఏడు పదుల వయసులోనూ ఎంతో చలాకీగా, ఫిట్‌గా శక్తికపూర్..!
72 ఏళ్ల శక్తి కపూర్ తన ఫిట్నెస్ రహాస్యాన్ని ఇటీవల తెలియచేశాడు. రోజుకు 35 వేల అడుగులు నడవడం తన ఆరోగ్య రహస్యం అన్నాడు. నడక వల్ల ఉపయోగాలు అందరికీ తెలిసినా.. 70 ఏళ్ల తర్వాత కూడా నడక మంచిదేనని వైద్యులు అంటున్నారు. రోజూ 7 వేలతో మొదలుపెట్టి కనీసం 10 వేల వరకూ నడిస్తే మంచిది అంటున్నారు. నడవని వారు గుండెకు చేటు తెచ్చుకుంటారని హెచ్చరిస్తున్నారు. మీరెంత నడుస్తున్నారు?వందలాది సినిమాల్లో నటించిన శక్తి కపూర్ 72 ఏళ్ల వయసులో కూడా చలాకీగా, ఫిట్‌గా ఉంటారు. ఇటీవల ఒక టీవీ షోలో మీ ఫిట్నెస్ రహస్యం ఏమిటని అడిగితే ‘రోజూ కనీసం 35000 అడుగులు నడవడమే‘ అని చెప్పాడు. మధ్యలో కొన్ని రోజులు మానేశాను... తిరిగి మొదలుపెట్టాను అని చెప్పాడు. నటన అంటే రకరకాల పాత్రలు చేయాలి. పరిగెత్తడం, డాన్స్.. ఇలాంటివి ఉంటాయి. అవన్నీ చేయాలంటే ఫిట్నెస్ చాలా ముఖ్యం. చాలామంది రకరకాల వ్యాయామం చేస్తారు. అయితే శక్తికపూర్ నడకే తన ఫిట్‌నెస్‌కు కారణం అని తెలియచేశాడు.నడక మంచిదిఈ విషయం గురించి ఢిల్లీలోని సికె బిర్లా హాస్పిటల్‌కు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ నరేంద్ర సింఘ్లా ఏమన్నారంటే ‘రోజుకు 35 వేల అడుగులు నడవడం ఎవరికైనా మంచిది... ముఖ్యంగా వయసు మళ్లిన వారి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇన్ని అడుగులు నడవడం వల్ల 2000 నుంచి 2500 కేలరీలు బర్న్ అవుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. కాళ్ల కండరాలు బలపడతాయి. క్రమం తప్పకుండా నడవడం వల్ల పెద్ద వయసు వారిలో రక్తప్రసరణ క్రమబద్దీకరణ జరిగి బ్లడ్‌ప్రెషర్ తగ్గుతుంది. దానివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా నడక బరువును అదుపు చేస్తుంది. వయసు మళ్లాక బరువు పెరిగితే స్థూలకాయం వల్ల వచ్చే సమస్యలు తోడవుతాయి. వాటిని నివారించాలన్నా బరువు పెరగకుండా చూసుకోవాలన్నా వయసు పెరిగే కొద్దీ నడకను పెంచాలి’ అన్నారాయన.మానసిక ఆరోగ్యానికి...ఎక్కువ అడుగులు నడవడం వల్ల మానసిక ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు అంటున్నారు. నడక మెదడుకు స్పష్టతనిచ్చి ఎంచుకున్న పనిపై ఏకాగ్రతను కలిగిస్తుందని వారు అంటున్నారు. అయితే 70 ఏళ్లు దాటాక 35 వేల అడుగుల నడక చాలామందికి సాధ్యం కాకపోవచ్చు.ముందు నుంచి అలవాటు లేకపోతే. కాని 7000 అడుగుల నుంచి శక్తి, ఓపికను బట్టి 10 వేల అడుగుల వరకూ నడవాలని వారు అంటున్నారు. నడకకు అనువైన షూస్, పోష్చర్, తగినంత నీరు తాగి బయలుదేరడం... ఈ జాగ్రత్తలతో క్రమం తప్పకుండా నడిస్తే ఆరోగ్యం ఓ భాగ్యంలా తోడు ఉంటుందని అంటున్నారు వారు. నడవడమే బాకీ. -
తుపాకుల వీడియో తీగ లాగితే... ఫ్యాక్టరీయే బయటపడింది!
ఈ ఫొటోలో కని్పస్తున్న మహిళ ఏం చేస్తోందో తెలుసా? పిస్టళ్లను చక్కగా నలుగు పెట్టి మరీ కడుగుతోంది! సబ్బు వేసి బాగా తోమాలంటూ నేపథ్యంలో ఒక వ్యక్తి సూచనలిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలైంది. దాంతో మధ్యప్రదేశ్ పోలీసులు అప్రమత్తమై తీగ లాగితే ఏకంగా అక్రమ తుపాకుల ఫ్యాక్టరీయే వెలుగులోకి వచి్చంది. ఈ వీడియోలోను గణేశ్‌పుర అనే ఊళ్లో తీసినట్టు సైబర్ క్రైం పోలీసులు తేల్చారు. అక్కడికి చేరుకుని ఆరా తీస్తుండటంతో ఆయుధాల తయారీదారు శక్తి కపూర్ అలియాస్ చోటూ, అతడి తండ్రి బిహారీలాల్ అలెర్టయ్యారు. తుపాకులు, విడిభాగాలు, ఇతర సామగ్రిని గోనెసంచీలో వేసుకుని బైక్ మీద ఉడాయించారు. విధి వక్రించి వీరిని వెదుకుతున్న పోలీసు వ్యాన్కే ఎదురుపడ్డారు! దాన్ని తప్పించబోయి బైక్ కిందపడటంతో దొరికిపోయారు. గోనె సంచీలో చూడగా ఓ డబుల్ బ్యారెల్ గన్, రెండు పిస్టళ్లు, తుపాకుల తయారీ సామగ్రి కనిపించాయి. వీడియోలో విని్పంచిన గొంతు చోటూదని, తుపాకులు శుభ్రం చేస్తూ కని్పంచింది అతడి భార్య అని గుర్తించారు. ఈ యవ్వారం ఎప్పట్నుంచి సాగుతోంది, తుపాకుల తయారీకి సామగ్రి ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఫ్యాక్టరీని ఎప్పటి నుంచి నడుపుతున్నారు వంటివన్నీ వారినుంచి పోలీసులు ఆరా తీస్తున్నారు. – భోపాల్ -
ఒకపుడు కాఫీ షాప్‌లో పనిచేసింది..ఒక్క సినిమాతో కలలరాణిగా.. ఎవరీ స్టార్ కిడ్?
యాక్టింగ్‌లోకి రాకముందు చాలామంది మోడల్‌గా లేదా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి ఒక్కో మెట్టూ ఎదుగుతూ స్టార్ ఇమేజ్ సంపాదించు కుంటారు. అదే అప్పటికే స్టార్లుగా, సూపర్ స్టార్లుగా పేరు సంపాదించిన వారి పిల్లలైతే ఎలాంటి ఇబ్బందీ లేకుండానే చాలా గ్రాండ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు. అలాంటి స్టార్ కిడ్స్ను అటు ఇండస్ట్రీ, ఇటు ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తారు. మరికొంతమంది . కానీ ప్రముఖ నటుడు కూతురు మాత్రం దీనికి భిన్నం. గ్లామరస్ షోబిజ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందు ఆమె ఏం చేసిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ నటుడు ఎవరు? ఆయన కూతురు ఎవరు? ఈ వివరాలన్నీ తెలియాలంటే మీరు స్టోరీ చదవాల్సిందే. బాలీవుడ్లో విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు శక్తి కపూర్. విలనిజాన్ని పండించడంలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు ఆయన. ఆయన ముద్దుల తనయ శ్రద్ధా కపూర్. 1987, మార్చిలో పుట్టింది. సూపర్ స్టార్ కుటుంబం నేపథ్యం, అందం, ప్రతిభ రెండూ ఉన్నప్పటికీ శ్రద్ధా తొలి చిత్రం (2010లో "తీన్ పట్టి" ) ఫ్లాప్ అయ్యింది. దాదాపు మూడేళ్ల తరువాత గానీ హీరోయిన్గా గుర్తింపు రాలేదు. కానీ 2013లో ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ భామ. ఆషికీ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఆషికీ 2 సినిమా ఆరోహి పాత్రతో ఒక్కసారిగా యూత్ కలల రాణిగా అవతరించింది. బాలీవుడ్లో టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరుగా నిలిచింది. ఒక్కో సినిమాకు సుమారు 5 కోట్ల రూపాయలదాకా తీసుకుంటుందని సమాచారం. పెళ్లికిచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూసి అతిథులు ఫిదా : ఫాదర్ ఐడియా అదిరింది! "ఏక్ విలన్,’’ "హైదర్", "ABCD", "బాఘీ", "హాఫ్-గర్ల్‌ఫ్రెండ్" “సాహో” (2019),చిచోరే, “స్ట్రీట్ డ్యాన్సర్” (2020),'తూ ఝూతీ మై మక్కార్' (2023) లాంటి పలు సినిమాల్లో నటించింది. అనేక అవార్డులు, ప్రశంసలను అందుకుంది. "లవ్ కా ది ఎండ్" చిత్రంలో ఉత్తమ నటిగా స్టార్‌డస్ట్ సెర్చ్‌లైట్ అవార్డును అందుకుంది. 2014లో మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీల మెకాఫీ జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. శ్రద్ధా మంచి గాయని కూడా శ్రద్ధా కపూర్ నటన మాత్రమేకాదు పాటలు పాటడంలో కూడా దిట్ట. దివంగత గాయని లతా మంగేష్కర్ , ఆశా భోంస్లేల నుంచి శ్రద్ధాకు వారసత్వంగా వచ్చిన ప్రతిభ ఇదని భావిస్తారు. శ్రద్దాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం, నటించడం అంటే ఆసక్తి ఉండేదట. సినిమా డైలాగులు రిహార్సల్ చేస్తూ బాలీవుడ్ పాటలకు అద్దం ముందు డ్యాన్స్ చేస్తూ ఉండేదట. అలాగే తండ్రితో పాటు వివిధ షూటింగ్ లొకేషన్లకు కూడా వెళ్లేది. అలా నటనపై ఆసక్తి ఉన్నప్నపటికీ సినిమాల్లోకి రాకముందే తన చదువును పూర్తి చేయాలని భావించింది. అందుకే పదహారేళ్ల వయసులో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చిత్రంలో ఆఫర్ వచ్చిన ఆఫర్‌ను తిరస్కరించింది. శ్రద్ధా బోస్టన్ విశ్వ విద్యాలయంలో సైకాలజీ చదువుతున్న క్రమంలో ఆమె అక్కడ కాఫీ షాప్‌లో కూడా పనిచేసిందని చెబుతారు. శ్రద్ధా ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు దాటిపోయింది. హారర్ కామెడీ , డ్యాన్స్ డ్రామా జానర్‌తో చిత్రాలతోపాటు, గాయనిగా కూడా తనను తాను నిరూపించుకుంటోంది. స్త్రీ-2 తోపాటు ప్రస్తుతం రెండు-మూడు సినిమాలున్నాయని, ఈ ప్రాజెక్ట్‌లు టైమ్ ట్రావెల్, పురాణాల ఆధారంగా ఉంటాయని ఇటీవల శ్రద్ధా కపూర్ ప్రకటించింది. సోషల్ మీడియా క్రేజ్ ఇన్‌స్టాలో 86.8 మిలియన్లు, ట్విటర్లో 14.3 మిలియన్ల ఫాలోయర్లుఉన్నారంటేనే సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్‌ను అర్థం చేసు కోవచ్చు. నటనతో పాటు అనేక పాపులర్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్న శ్రద్ధా ప్రస్తుత నికర విలువ దాదాపు రూ. 123 కోట్లుగా అంచనా. -
ఆ మూడు చెంప దెబ్బల వల్ల బాలీవుడ్ వదిలేద్దామనుకున్నా: శక్తి కపూర్
బాలీవుడ్ ప్రముఖ నటుడు శక్తి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 80, 90లలో ఆయన హింది చిత్రాల్లో విలన్‌గా, కమెడియన్‌గా నటించి స్టార్ నటుడిగా గుర్తింపు పొందారు. ఇక వారసురాలిగా శ్రద్ధా కపూర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా బి-టౌన్లో గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే తనదైన నటన, కామెడీతో విలక్షణ నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన శక్తి కపూర్ ఒకానోక సమయంలో పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు. కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేస్తున్న లెజెండరి కమెడియన్స్ ఆఫ్ ఇండియన్ సినిమా షోకు శక్తి కపూర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయనతో పాటు మరో హాస్యనటులు అస్రానీ, పెంటల్, టీకు తల్సానియా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శక్తి కపూర్ మాట్లాడుతూ.. ఓ సినిమా షూటింగ్ సమయంలో తాను మూడు చెంప దెబ్బలు తిన్నానని, దానివల్ల తాను పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘నా మొదటి కామెడీ చిత్రం సత్తె పే సత్తా. ఇందులో పెంటల్‌తో కలిసి పని చేశాను. అది చాలా మంచి చిత్రం. అందులో నటించాలని ఓ కామెడీ పాత్ర కోసం రాజ్ సిప్పీ నన్ను సంప్రదించినప్పుడు నా విలన్ పాత్రలకు ప్రశంసలు లభిస్తున్నట్లు అనిపించింది. అందుకు తగ్గట్లే ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత మావాలి అనే సినిమా చేశాను. సినిమాలో మొదటి షాట్ తీస్తున్నప్పుడు ఖాదర్‌ఖాన్ నా చెంప మీద కొట్టాడు. దాంతో నేను నేలపై పడ్డాను. రెండో షాట్లో అరుణా ఇరానీ చెంప మీద కొట్టింది. మళ్లీ నేలపై పడ్డాను. మూడోసారి కూడా అదే జరిగింది. దాంతో నా కెరీర్ ముగిసింది అనుకున్నా’ అంటూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘మూడుసార్లు చెంప దెబ్బలకు నెలపై పడ్డ నేను.. నా కెరీర్ ముగిసిపోయిందని ఆందోళన పడ్డాను. ఈ సినిమాకు కె.బాపయ్య దర్శకత్వం వహించారు. అందులో ఖాదర్ ఖాన్ కూడా నటించారు. ఇక షూటింగ్ గ్యాప్‌లో ఖాదర్ ఖాన్ వద్దకు వెళ్లి.. మీకు దండం పెడతా(కాళ్లు మొక్కుతా అని బతిమాలను). నాకు సాయంత్రం టిక్కెట్ బుక్ చేయండి. నేను వెళ్లిపోతా. ఈ సినిమా నేను చేయలేను. నా కెరీర్ కూడా ముగిసిపోయింది. నాకు ఇంకా పెళ్లి కూడా కాదు’ అని అన్నాను. అయితే అదంతా గమనించిన యాక్షన్ డైరెక్టర్ వీరు దేవగన్ నా దగ్గరకి వచ్చి.. ‘ఈ చెంప దెబ్బ మీకు మరింత పాపులారిటిని తెచ్చి పెడుతుంది. మీరు ఏమాత్రం ఆలోచించకుండ ఈ సినిమా చేయండి’ అని సలహా ఇచ్చారు. ఆయన అడ్వైస్తో నేను ఇండస్ట్రీలో కొనసాగను’’ అంటూ శక్తి కపూర్ చెప్పుకొచ్చారు. చదవండి: ఆసక్తిగా సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష టైటిల్ గ్లింప్స్, ఎన్టీఆర్ వాయిస్ అదుర్స్ అభిమానిగానే చిరంజీవికి ఆనాడు విజ్ఞప్తి చేశా: వర్మ క్లారిటీ -
రోహన్‌తో శ్రద్ధా కపూర్ ప్రేమ వ్యవహరం, స్పందించిన శక్తి కపూర్
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టతో ఆమె ప్రేమ లోకంలో విహరిస్తున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గత మార్చిలో శ్రద్ధా కజిన్ వివాహా వేడుకకు రోహన్ హాజరు కావడం, ఆ వేడుకలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు బి-టౌన్లో ఎక్కడ చూసిన వీరిద్దరూ జంటగా కనిపించడం, విందులు వినోదాలకు జంటగా హాజరు కావడంతో నిజంగానే వీరు ప్రమలో మునిగితెలుతున్నారని అందరూ ఫిక్స్ అయ్యారు. అంతేకాదు ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతోందనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. చదవండి: భర్త రాజ్‌కుంద్రాకు శిల్పా విడాకులు ఇవ్వబోతోందా?! ఇదిలా ఉండగా రోహన్, శ్రద్ధాల ప్రేమ, పెళ్లి పుకార్లపై ఆమె తండ్రి, నటుడు శక్తికపూర్లు స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘రోహన్ ఫ్యామిలీ ఫ్రెండ్. అతడి తండ్రి రాకేష్ శ్రేష్ట్ నాకు ఎన్నో ఏళ్లుగా పరిచయం. తరచూ మేము ఫ్యామిలీ మీటింగ్స్‌లో కలుసుకుంటూనే ఉంటాం. రోహన్ ఎప్పుడూ మా ఇంటికి వస్తుంటాడు. కానీ శ్రద్ధాను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు అతడు నా దగ్గర ప్రస్తావించలేదు. ఇదంత పక్కన పెడితే ఈ రోజుల్లో పిల్లలు సొంతంగా నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఒకవేళ శ్రద్ధా తన జీవిత భాగస్వామని తానే చూసుకున్నానని చెప్పినా ఒప్పుకునేందుకు సిద్దంగా ఉన్నాను. తన ఇష్టాన్ని గౌరవిస్తాను. అయినా నేనేందుకు తిరస్కరిస్తా?. అయితే ప్రస్తుతం శ్రద్ధా తన కేరీర్‌పై ఫోకస్ పెడుతోంది. చదవండి: పీకల్లోతు కష్టాల్లోకి బాలీవుడ్.. నార్త్ ఆడియెన్స్ కు ఏమైంది? అయితే పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో చాలా ముఖ్యమైనది. కానీ ప్రస్తుత కాలంలో కొందరూ సొంతంగా నిర్ణయాలు తీసుకోని పెళ్లి చేసుకుంటున్నారు, ఆ తర్వాత సులువుగా విడిపోతున్నారు. అలాంటివి చూసినప్పుడు నాకు కాస్తా కంగారుగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ‘శ్రద్ధా, సిద్దాంత్ కపూర్(శక్తికపూర్ కుమారుడు, శ్రద్దా సోదరుడు) ఇష్టాలను నేనేప్పుడు కాదనను. తన నటిస్తానని చెప్పినప్పుడు నేను నిరాకరించానని అన్నారు. అలా నేను ఎందుకు చేస్తాను. ఓ తండ్రిగా నా కూతురు షైన్ అవుతుంటే గర్వపడతాను కదా. తనని నేను ‘గోల్డ్ గర్ల్’ అని ముద్దుగా పిలుచుకుంటాను’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇటీవల శ్రద్దా కపూర్ కజిన్ ప్రియాంక శర్మ కూడా శ్రద్ధా, రోహన్‌ల ప్రేమ, పెళ్లీపై హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి తానేమి మట్లాడలేనని, త్వరలోనే మీకే తెలుస్తుందంటూ ఆమె చెప్పకనే చెప్పింది. అదే విధంగా ఇలాంటి ఏమైన ఉంటే, వారు పెళ్లి చేసుకుంటే మీకు కూడా పిలుపు అందుతుంది కదా అంటూ ఆమె స్పష్టం చేసింది. (చదవండి: శ్రద్ధా కపూర్ పెళ్లి; వాళ్లకు ఇష్టమైతే నేను సిద్ధమే!) -
సాహో హీరోయిన్ పెళ్లి! : 'తనిష్టమే నా ఇష్టం'
ఇష్టపడిన ప్రేయసి చేయి పట్టుకుని ఏడడుగులు నడిస్తే ఆ సంతోషం ఎలా ఉంటుందో వరుణ్ ధావన్‌ను అడిగితే చెప్తారు. ఈ మధ్యే తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేమికురాలు నటాషా దలాల్‌కు మూడు ముళ్లు వేసి ఓ ఇంటివాడయ్యాడు. అతడికి సినీలోకం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఫొటోగ్రాఫర్ రోహన్శ్రేష్ట కూడా ఈ కొత్తజంటకు విషెస్ చెప్తూ మీరు ఎంతో లక్కీ అని రాసుకొచ్చారు. దీనికి వరుణ్‌ధావన్ స్పందిస్తూ త్వరలోనే నువ్వు కూడా పెళ్లికి రెడీ అవుతున్నావని ఆశిస్తున్నానని చెప్పాడు. దీంతో అతడు, హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందంటూ వార్తలు ఊపందుకున్నాయి. (చదవండి: దీపికను వెనక్కి నెట్టిన శ్రద్ధా.. మూడో స్థానంలోకి!) ఈ క్రమంలో శ్రద్ధా పెళ్లి గురించి ఆయన తండ్రి, సీనియర్ నటుడు శక్తికపూర్ స్పందిస్తూ.. "నా కూతురు పెళ్లి గురించి బయట ఎలాంటి టాక్ నడుస్తుందో నాకు తెలీదు. కానీ ఆమె తీసుకునే ప్రతీ నిర్ణయానికి నేను మద్దతిస్తాను. అది ఆమె పెళ్లి విషయమైనా సరే! రోహన్ శ్రేష్టనే కాదు ఎవరిని తీసుకొచ్చినా పెళ్లికి నేను అంగీకరిస్తాను. రోహన్ చాలా మంచి అబ్బాయి. అతడు చిన్నప్పటి నుంచే మా ఇంటికి తరచూ వస్తుండేవాడు. ఇప్పటివరకైతే శ్రద్ధా తన పెళ్లి గురించి ఏమీ చెప్పలేదు. వాళ్లింకా బాల్య స్నేహితులే అనుకంటున్నాను. ప్రేమలో ఉన్నారనైతేనే భావించడం లేదు" అని చెప్పుకొచ్చారు. (చదవండి: కరోనా కష్టాలు చెప్పి బాధపడిన హీరోయిన్) -
‘నేను వెళ్లను.. కుమార్తెను పంపను’
కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ అన్ని రంగాలను ప్రభావితం చేసింది. దాదాపు రెండున్నర నెలలుగా జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నెల ప్రారంభం నుంచి లాక్డౌన్ సడలింపులు ఇస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి షూటింగ్‌లకు అనుమతిచ్చింది. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ తాజా పరిస్థితులపై స్పందిస్తూ.. ‘ఇలాంటి పరిస్థితుల్లో నేను బయటకి వెళ్లి పని చేయాలని భావించడం లేదు. అలానే నా కుమార్తె శ్రద్ధా కపూర్‌ని కూడా షూటింగ్స్‌కి పంపను’ అన్నారు. (లాక్డౌన్లో సీక్రెట్‌గా హీరోయిన్ పెళ్లి) అంతేకాక ‘కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు. రానున్న రోజుల్లో వైరస్ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. పని కన్నా ప్రాణాలే ముఖ్యం. షూటింగ్స్ ఇప్పుడు ప్రారంభమైతే పరిస్థితులు దారుణంగా మారతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకొంత కాలం సినిమా షూటింగ్స్ చేయకపోవడమే మంచిదని నా స్నేహితులకి చెప్పాను. ఆస్పత్రి బిల్లులు కట్టడం కంటే.. మరి కొంత కాలం ఆగడం మంచిది’ అని శక్తి కపూర్ పేర్కొన్నారు. -
మందు కోసం నటుడు ఏం చేశాడో తెలుసా?
-
మందు కోసం నటుడి ముందుచూపు!
మందు బాటిల్ తెచ్చుకునేందుకు ఖాళీ చేతులతో వెళతారు. లేదంటే ఓ సంచి పట్టుకుని వెళ్తారు. కానీ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ మాత్రం పెద్ద డ్రమ్ములాంటిదే తలకెత్తుకున్నాడు. ఇంతకీ ఎందుకో చదివేసేయండి. లాక్డౌన్ వల్ల అందరి మనసులోనూ గూడుకట్టుకున్న కరోనా భయాన్ని కాస్త తొలగించి అభిమానులను కాసేపు హాయిగా నవ్వించేందుకు ప్రయత్నించాడు నటుడు శక్తి కపూర్. అందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశాడు. ఇందులో అతడు ఓ డ్రమ్ము సైజులో ఉన్న చెత్త బుట్టను తలపై ఎత్తుకుని బాహుబలిలా ప్రభాస్‌లా ఒక్కో అడుగు ముందుకేస్తూ గేటు వైపు నడిచాడు. (ఇంట గెలిచి రచ్చ గెలిచింది) ఇంతలో ఓ వ్యక్తి 'హలో భాయ్.. ఎక్కడికి వెళుతున్నారు?' అని అడగ్గా.. శక్తి కపూర్ 'మందు కోసం' అని సమాధానమిచ్చాడు. దీంతో అతను ఆ సొసైటీ(అపార్ట్మెంట్ వాసులు)కోసం కూడా తీస్కురా అంటూ జోకు పేల్చాడు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. కాగా శక్తి కపూర్ ఇప్పటివరకు 700 సినిమాల్లో నటించాడు. బిగ్‌బాస్ 5వ సీజన్లోనూ నటించాడు. అతడి భార్య శివంగి కొల్లాపూర్. వీరిద్దరికీ సిద్ధాంత్, శ్రద్ధా కపూర్ సంతానం. వీరిద్దరూ సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి తమ ప్రతిభ చాటుకుంటున్నారు. (నీ అలవాటు గురించి నీకు తెలుసా.. సారీ!) -
ఇంట గెలిచి రచ్చ గెలిచింది
కొందరు ఇంట గెలుస్తారు. కొందరు రచ్చ గెలుస్తారు. కొందరే ఇంట గెలిచి రచ్చ గెలుస్తారు. శ్రద్ధా కపూర్ బాలీవుడ్‌ను గెలిచింది. అందంతో నటనతో గెలిచింది. అందుకే దక్షణాది భాషల వారికి ఫేవరెట్‌గా నిలిచింది.సాహో తర్వాత పెద్ద సినిమాల నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. 2005. ఇండియా టీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో శక్తి కపూర్ పట్టుబట్టాడు. సినిమా అవకాశాల కోసం ఔత్సాహిక నటి వేషంలో ఉన్న టీవీ యాంకర్‌ను లైంగిక అవసరం తీర్చమని అతడు అడిగే వీడియో దేశమంతా సంచలనం రేపింది. శక్తికపూర్ భయభ్రాంతం అయ్యాడు. గగ్గోలు పెట్టాడు. ఇండియా టీవీ వారిని నానా తిట్లు తిట్టాడు. అతడు పదే పదే చెప్పిన మాట ఒక్కటే ‘మీరు చేసిన ఈ పనికి నేను నా కూతురికి ఎలా ముఖం చూపించాలి. అది నన్ను చంపేస్తుంది’ అని. ఆ కూతురే శ్రద్ధా కపూర్ అప్పటికి ఆమె వయసు 20 సంవత్సరాలు. తండ్రి అంటే ఆమెకు చాలా ఇష్టం. ‘అందాజ్ అప్నా అప్నా’లో అతడు వేసిన పాత్ర ‘క్రైమ్ మాస్టర్ గోగో’ను గుర్తు చేసుకుంటూ తండ్రిని ‘గోగో’ అని పిలుస్తూ ఉంటుంది. అలాంటి తప్పిదం/లేదా అతని చుట్టూ అల్లిన ట్రాప్ వల్ల శ్రద్ధా కపూర్ కుటుంబం బజారున పడింది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే వెతుక్కోవాలని పెద్దలు అంటారు. తండ్రి కోల్పోయిన చోటే తాను గెలిచి చూపించాలని శ్రద్ధా కపూర్ అనుకుంది. చూపించింది కూడా. శ్రద్ధాకపూర్, వరుణ్ ధావన్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. శక్తి కపూర్ అప్పట్లో డేవిడ్ ధావన్ సినిమాల్లో ఎక్కువగా నటించేవాడు. అలా శక్తికపూర్ కూతురు శ్రద్ధా, డేవిడ్ ధావన్ కొడుకు వరుణ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరూ షూటింగులు చూడ్డానికి వెళ్లేవారు. కాని ఇద్దరికీ సినిమా రంగంలో వస్తున్నట్టు అప్పటికి తెలియదు. శ్రద్ధాకపూర్ సైకాలజిస్ట్ కావాలనుకుంది. ముంబైలో అమెరికన్ స్కూల్లో ఇంటర్ చదువుతున్నప్పుడు 96 శాతం మార్కులు తెచ్చుకుంది. అప్పుడే కాలేజ్‌లో నాటకం వేసింది శ్రద్ధా. ఆ వేడుకకు హాజరైన సల్మాన్ ఖాన్ ఆమె నటన చూసి హీరోయిన్ వేషం ఆఫర్ చేశాడు. కాని ‘నాకు చదువుకోవాలని ఉంది’ అని చెప్పి అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీకి వెళ్లిపోయింది. అక్కడ చదువుకుంటూ ఉన్నప్పుడే శక్తికపూర్ ఉదంతం చోటు చేసుకుంది. శక్తికపూర్ పంజాబీ. అతని స్వస్థలం న్యూఢిల్లీ. శక్తికపూర్ భార్య ‘శివాంగని కొల్హాపురి’ పండిత వంశం నుంచి వచ్చింది. ఆమె తండ్రి పండరినాథ్ కొల్హాపురి శాస్త్రీయ గాయకుడు. చెల్లెలు పద్మిని కొల్హాపురి నటి. గాయని లతా మంగేష్కర్ వీరికి పండరినాథ్ వైపు నుంచి దగ్గరి బంధువు అవుతుంది. అయితే శ్రద్ధాకపూర్ తండ్రి వైపు నుంచి కంటే తల్లివైపు బంధువులతోనే బాల్యం నుంచి గడిపింది. తనను తాను ఒక మరాఠి స్త్రీగానే భావిస్తుంది. శక్తికపూర్ చేసిన తప్పు తన కుటుంబాన్ని, బంధువర్గాన్ని అసౌకర్యంలో పడేసిందని ఆమె భావించింది. సైకాలజిస్ట్ కావాలనుకున్న శ్రద్ధాకపూర్ నటి అవుదామని తీర్మానించుకుంది. బాలీవుడ్లో ఒక రివాజు ఉంది. మనకున్న పలుకుబడి అంతా కెమెరా ముందు వరకూ తీసుకెళ్లి నిలబెడుతుందికానీ కెమెరా ముందు ప్రతిభ మాత్రం మనమే చూపాలి. అది చాలా బాగా ఉండాలి. లేకుంటే వెనక్కు పంపించేస్తారు. శ్రద్ధాకపూర్ ఎంతైనా ఒక హీరో కూతురు కాదు. విలన్ కూతురు. అందునా చెడ్డ పేరు మూటగట్టుకున్న విలన్ కూతురు. ఆమె జీరో నుంచి మొదలుకావాల్సిందే. అలాగే అయ్యింది. చాలా ఆఫీసులకు ఆడిషన్స్ ఇవ్వడానికి తిరిగింది. చివరకు ఆమెకు ఒక ఉమన్ డైరెక్టరే బాసటగా నిలిచింది. టీవీ రంగంలో పేరు తెచ్చుకుని బాలీవుడ్లో సినిమాలు తీస్తున్న లీనా యాదవ్ తన ‘తీన్ పత్తీ’ సినిమాలో శ్రద్ధాను సైన్ చేసింది. కాని ఆ సినిమా ఫ్లాప్. కొందరు మాత్రం ఈ అమ్మాయి ఎవరో బాగా చేసింది అని ఒకరిద్దరికి చెప్పారు. దాంతో యశ్‌రాజ్ ఫిల్మ్వారు పిలిపించి మూడు సినిమాలకు సైన్ చేయించారు. తొలి సినిమాగా ‘లవ్ కా ది ఎండ్’ సినిమాలో హీరోయిన్ వేషం ఇచ్చారు. కాని ఆ సినిమా కూడా ఫ్లాప్. రెండు సినిమాల ఫ్లాప్ తర్వాత ఒక హీరోయిన్ పరిస్థితి కష్టమే అవుతుంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ వారు ఆ తర్వాత ‘ఔరంగజేబ్’ (అర్జున్ కపూర్ హీరో) సినిమాలో వేషం ఆఫర్ చేశారు. కాని ఇక్కడే శ్రద్ధా కపూర్ ఒక మలుపు తిరిగే నిర్ణయం తీసుకుంది. ఔరంగజేబ్ ఆఫర్ సమయంలోనే మహేష్ భట్ కాంపౌండ్ నుంచి ‘ఆషికీ2’ ఆఫర్ వచ్చింది ఆమెకు. ఇదో లేక అదో. కాని శ్రద్ధా యశ్రాజ్వారికి సర్దిచెప్పి ‘ఆషికీ2’ చేసింది. ప్రియుడి కోసం తన జీవితాన్ని పణంగా పెట్టే గాయని పాత్రలో శ్రద్ధా నటన జనానికి నచ్చింది. ఆ సినిమా పాటలు ఇంకా నచ్చాయి. సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో శ్రద్ధా కపూర్ రాత్రికి రాత్రి స్టార్డమ్కు చేరుకుంది. 18 కోట్లతో తీసిన ‘ఆషికీ 2’ 175 కోట్లను వసూలు చేసిందంటే ఆ క్రేజ్ తాలూకు వాటా శ్రద్ధా కపూర్‌కు కూడా దక్కింది. అయితే శ్రద్ధా కపూర్‌కు డాన్స్ అంటే ఆసక్తి ఉంది. మంచి డాన్స్ సినిమా చేయాలనే ఆమె కోరికను రెమో డిసూజా దర్శకత్వంలో వచ్చిన ‘ఏబిసిడి2’ తీర్చింది. ప్రభుదేవా నటించిన ఆ సినిమాలో శ్రద్ధాకపూర్ తన ప్రతిభ చాటి తాను డాన్సింగ్ స్టార్ కూడా అని నిరూపించుకుంది. ఆ తర్వాత ‘భాగీ’, ‘రాక్ఆన్’ సినిమాలన్నీ ఆమె కెరీన్కు మేలు చేస్తూ వచ్చాయి. సౌత్‌లో హిట్ అయిన ‘ఓకే బంగారం’ రీమేక్ ‘ఓకే జాను’లో శ్రద్ధా హీరోయిన్గా నటించిది. దావుద్ ఇబ్రాహీమ్ చెల్లెలు హసీనా పార్కర్ బయోపిక్ ‘హసినా పార్కర్’లో నటించడంతో తన భుజాల మీద ఒక సినిమాను నిలబెట్టగలననే నమ్మకం బాలీవుడ్‌కు కల్పించింది. ‘స్త్రీ’ సినిమా సూపర్ హిట్ కావడం, ‘సాహో’ వంటి భారీ సినిమాలో నటించడంతో శ్రద్ధాకపూర్ బాలీవుడ్ తార నుంచి భారతీయ తారగా ఎదిగింది. శ్రద్ధాకపూర్‌కు ఇంగ్లిష్ భాష మీద మంచి పట్టు ఉంది. దేశదేశాల వారు ఇంగ్లిష్ భాషను ఎలా మాట్లాడతారో నకలు దింపుతుంది. ఆమెకు నాలుగు పశువులను పెట్టుకొని, సొంతగా కూరగాయలు పండించుకుంటూ విశ్రాంతిగా ఉండాలని కోరిక. ఆ పని భవిష్యత్తులో చేస్తానని కూడా చెబుతుంది. రోజూ డైరీ రాయడం, తన ఆలోచనలను రాస్తూ వెళ్లడం టీనేజ్ నుంచి చేస్తూనే ఉంది. శ్రద్ధా కపూర్ తన తాత నుంచి తల్లి నుంచి వారసత్వంగా సంగీతాన్ని పొందింది. చాలా సినిమాలలో పాటలు పాడింది. శ్రద్ధాకపూర్ ఇవాళ బాలీవుడ్లో గౌరవపూర్వకంగా తలిచే పేరు అయ్యింది. తండ్రి శక్తికపూర్ ఆమెను చూసి గర్వపడుతున్నాడు. శ్రద్ధా కపూర్ ప్రచండకాంతిలో అతడి మరక కనపడకుండా పోయింది. శ్రద్ధాకపూర్ రాబోయే రోజులలో ప్రేక్షకులు తల ఎత్తి చూసే పనులు తప్పక చేస్తుంది. చేయాలని ఆశిద్దాం. – సాక్షి ఫీచర్స్ డెస్క్ -
‘నా కూతురు పెళ్లా.. ప్లీజ్ నన్నూ పిలవండే’
బాలీవుడ్ మీడియా గురువారం శ్రద్ధాకపూర్ పెళ్లి వార్తలతో మరోసారి బిజీగా మారింది. త్వరలోనే శ్రద్ధా కపూర్, తన బాయ్‌ఫ్రెండ్ రోషన్ శ్రేష్టను వివాహం చేసుకోబోతున్నారంటూ ఊదరగొట్టింది. అంతటితో ఊరుకోక ఈ విషయం గురించి శ్రద్ధ తండ్రి శక్తి కపూర్‌ను కూడా ప్రశ్నించింది. అయితే మీడియా అత్యుత్సాహానికి తగ్గట్టు శక్తి కపూర్ మాంచి సమాధానం ఇచ్చారు. ‘నిజంగానా.. నా కూతురు పెళ్లి చేసుకోబోతుందా.. ఎప్పుడు.. ఎక్కడా. తండ్రిగా నేను అక్కడ ఉండాలి కదా. కానీ ఈ పెళ్లి గురించి నాకేం తెలీదు. ప్లీజ్ నా కూతురు పెళ్లికి నన్ను పిలవడం మర్చిపోకండే’ అంటూ వ్యగ్యంగా సమాధానమిచ్చారు. శ్రద్ధాకపూర్ పెళ్లి గురించి వస్తోన్న వార్తలన్ని అవాస్తవాలే అంటూ ఆయన కొట్టి పారేశారు. ముంబైకు చెందిన ఓ టాబ్లాయిడ్ ముందుగా ఈ వార్తల్ని ప్రచురించింది. శ్రద్ధా కపూర్, ఆమె బాయ్‌ఫ్రెండ్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచురించింది. దాంతో మిగతా చానెల్స్, వెబ్సైట్లు కూడా ఈ వార్తల్ని ప్రసారం చేశాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శ్రద్ధా కపూర్ ‘స్ట్రీట్ డ్యాన్సర్ త్రీడీ’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇక శ్రద్ధా కపూర్ నటించిన సాహో చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. -
తనుశ్రీ- నానా వివాదం : శక్తికపూర్ షాకింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ : తనుశ్రీ దత్తా-నానా పటేకర్ వివాదంపై బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తికపూర్ స్పందించిన తీరు నవ్వులు పూయిస్తోంది. నానా పటేకర్ 2008లో ఓ డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ సందర్భంగా తనను లైంగికంగా వేధించారని తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. పలువురు హీరోయిన్లు, నటులు తనుశ్రీకి మద్దతుగా నిలవగా, మరికొందరు ఆమె చవకబారు ప్రచారం కోసమే నానాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా తనుశ్రీ వ్యాఖ్యలపై శక్తికపూర్ స్పందన కోరగా, ఇది పదేళ్ల కిందటి వివాదమని అప్పుడు తాను చిన్న పిల్లవాడినని, దీనిగురించి తనకేమీ తెలియదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బాలీవుడ్లో దిగ్గజాలు సైతం తనుశ్రీకి బాసటగా నిలుస్తున్న నేపథ్యంలో శక్తికపూర్ వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. కాగా సోనం కపూర్, ట్వింకిల్ ఖన్నా, ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్, సిమీ గరేవాల్, అనురాగ్ కశ్యప్, పూజా భట్, రవీనా టాండన్, కొయినా మిత్రా వంటి పలు నటీనటులు తనూశ్రీకి మద్దతు తెలపగా, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి నటులు ఈ వివాదంపై స్పందించేందుకు నిరాకరించారు. -
‘తొందరేం లేదు.. ఆమె తండ్రి చాలా రిచ్’
ముంబయి: ప్రపంచం ఆమె కాళ్ల ముందుంది. ఆమె సినీ కెరీర్ ఇప్పుడే వేగం పుంజుకుంటోంది. తనకు తొందరేం లేదు. ఆమె తండ్రి కూడా చాలా రిచ్’ అంటూ ప్రముఖ బాలీవుడ్ నటుడు శక్తికపూర్ తన కూతురు శ్రద్ధ కపూర్ గురించి అన్నారు. 2010లో టీన్ పట్టి అనే చిత్రంలో చిన్న పాత్ర ద్వారా తెరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత ‘లవ్ కా ది ఎండ్’, అనంతరం ఆష్కి 2 వంటి బ్లాక్ బస్టర్ చిత్రం, ఏక్ విలన్, హైదర్, భాగీ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఇటీవల 2017లో ఓకే జాను అంటూ ముందుకొచ్చింది. 2016లో మ్యూజికల్ డ్రామా రాక్ ఆన్ 2 అనే చిత్రంలో నటించినప్పటికీ అదే సమయంలో పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఈ చిత్రంపై సరిగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. పైగా అంతకు ముందు నటించిన చిత్రాల్లో ఆష్కీ 2, ఏక్ విలన్, భాగీ తప్ప పెద్దగా హిట్ చిత్రాలు లేవు. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి శక్తికపూర్ ఓ మీడియా సంస్థతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ‘నాలాగే నా కూతురు కూడా రిస్క్‌లు చేయదు. కూల్‌గా ఉంటుంది. సినిమాల మధ్య గ్యాప్ వచ్చిన తను ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ఎందుకంటే ఆమె తండ్రి (శక్తికపూర్) చాలా ధనవంతుడు. ప్రపంచం ఆమె కాళ్ల ముందే ఉంది. హర్రీబర్రీ అవ్వాల్సిన పనిలేదు. దేనినైనా తేలికగా తీసుకోవచ్చు’ అని చెప్పారు. -
శ్రద్ధా, పర్హాన్ లకు ఏమైంది?
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ప్రముఖ నటుడు ఫర్హాన్ అక్తర్ లపై వచ్చిన తాజా పుకార్లపై, శ్రద్ధ తండ్రి, సీనియర్ నటుడు శక్తి కపూర్ స్పందించారు. ఫర్హాన్ ఇంటినుంచి తన కూతురిని బయటకు లాక్కొచ్చేశాడన్నవార్తలను రూమర్లని కొట్టిపారేశాడు. ఇది పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ఇదే విషయంలోతనను ఫోన్ లో కూడా ప్రశ్నించారని.. ఇలాంటి వదంతులను నమ్మొద్దని పేర్కొన్నారు. తాను 35 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమలోఉన్న తను అలా ప్రవర్తించనని శక్తి స్పష్టం చేశారు. అయితే బాలీవుడ్ మూవీ ఆషికి తో యూత్ లో యమ క్రేజ్ సంపాదించిన శ్రద్ధా కపూర్, ఫర్హాన్ అక్తర్ లపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడ్డంలేదు. రాక్ 2 సినిమా మొదలు శ్రద్ధా, అక్తర్‌ల ప్రేమ వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ భాగ్ మిల్కా భాగ్ నటుడితో పీకల్లోతు ప్రేమలో పడిన శ్రద్ధాకపూర్, ఏకంగా అతని నివాసానికే తన మకాం కూడా మార్చేసిందన్నది బీ టౌన్ టాక్. ఈ విషయం తెలుసుకున్న శక్తికపూర్ ఆమెను బలవంతంగా బయటకు లాక్కొచ్చేశారని వార్తలు చెలరేగాయి. వీరిద్దరి ప్రేమ వ్యవహారం నచ్చక పోవడం వల్లే ఈ సంఘటన జరిగిందన్న వాదనలు వినిపించాయి. కాగా మరో హీరోయిన్, వాజిర్ మూవీలో కలిసి నటించిన అదితిరావు, ఫర్హాన్ అక్తర్ సంబంధాలపై అప్పట్లో బాలీవుడ్ గుప్పుమంది. మరోవైపు సహజీవన వార్తలను శ్రద్ధా-ఫర్హాన్ ఇప్పటికే ఖండించిన సంగతి తెలిసిందే. -
సెప్టెంబర్ 3 నపుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న శక్తి కపూర్ (యాక్టర్), వివేక్ ఒబెరాయ్ (యాక్టర్) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఇది చంద్రుడికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల వీరి కల్పన శక్తి వెలుగులోకి వస్తుంది. గత సంవత్సరం మొదలు పెట్టిన ప్రాజెక్టుల నుంచి లాభాలు ఆర్జిస్తారు. గత సంవత్సరం రాసిన పోటీపరీక్షలలో విజేతలై ఈ సంవత్సరం జాబ్‌లో చేరే అవకాశం ఉంది. సంప్రదింపులు, ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. యోగ, ఆరోగ్య విషయాలపై ఆసక్తి నెలకొంటుంది. వీరు పుట్టిన తేదీ 3. ఇది బృహస్పతికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల ఎంతో విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. విజయాలు వరిస్తాయి. కొత్త స్నేహాలు, కొత్త బంధుత్వాలు ఏర్పడి, వాటి వల్ల లబ్ధి పొందుతారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పని చేసే వారికి మంచి సలహాదారులుగా గుర్తింపు వస్తుంది. సమాజంలో గౌరవం, మీ మాటకు విలువ ఏర్పడతాయి. విద్యార్థులకు వారు కోరుకున్న కోర్సులలో సీట్లు వ స్తాయి. అయితే చంద్రుని ప్రభావం వల్ల ఆలోచనలలో నిలకడ లేక గందరగోళం నెలకొనవచ్చు. చంద్ర, గురుల పరస్పర ద్వైదీభావం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. లక్కీ నంబర్స్: 2,4, 5,6,7; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, ఎల్లో, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: సోమ, శుక్ర, శనివారాలు. సూచనలు: రోజూ రాత్రిపూట వెన్నెలలో విహరించడం, నవగ్రహాభిషేకం, దత్తస్తవం పఠించడం, గురువులను, పండితులను గౌరవించడం, అనాథ శరణాలయాల్లో పాయసం దానం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
శ్రద్ధాకపూర్.. ఫస్ట్ కార్...
వినడానికి కాస్త వింతగా ఉన్నా... ఇది నిజం. బాలీవుడ్ క్యూట్ గాళ్ శ్రద్ధాకపూర్ రీసెంట్గా తన తొలి కారు కొనుగోలు చేసిందట. అదీ ఖరీదైన లగ్జరీ కారు ఎస్యూవీ. ఇంతకుముందు ఓ జర్మన్ కారును అమ్మడు నడిపినా... అది సొంతది కాదట. వాళ్ల నాన్న, ప్రముఖ నటుడు శక్తికపూర్ గిఫ్ట్ అదని ఓ ముంబై పత్రిక కథనం. వరుస హిట్స్‌తో మాంచి ఊపు మీదున్న ఈ చిన్నది... ఇప్పటి వరకు కారు కొనకపోవడం ఏంటబ్బా.. అని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కొంటున్నారు. కొత్త కారులో కుటుంబమంతా ఓ హ్యాపీ రైడ్‌కు వెళ్లిందట. -
పబ్లిక్ గా సిగరెట్ తాగిన బాలీవుడ్ నటుడుపై కేసు
జైపూర్: పబ్లిక్ గా సిగరెట్ తాగిన బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ పై కేసు నమోదైంది. జైపూర్ లోని సంగనేర్ విమానాశ్రయంలో పబ్లిక్ గా సిగరెట్ తాగుతున్నట్టు ఓ దిన పత్రికలో వచ్చిన పోటో ఆధారంగా శక్తి కపూర్ పై ఓ న్యాయవాది నెమ్ సింగ్ ఫిర్యాదు చేశారు. రాజస్థాన్ ధూమపాన నిషేధం చట్టంలోని 5/11 సెక్షన్ ప్రకారం శక్తి కపూర్ పై చర్య తీసుకోవాలని నెమ్ సింగ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళవారం చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ గిరీష్ కుమార్ ఓజాకు నెమ్ సింగ్ ఫిర్యాదు సమర్పించారు. అయితే ఈ కేసు జూన్ 6 తేదిన విచారణకు రానుంది. ఓ దిన పత్రికలో వచ్చిన పోటోగ్రాఫ్ ఆధారంగా శక్తి కపూర్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై స్పందించడానికి ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎస్ఎన్ బోర్కర్ అందుబాటులోకి రాలేదు. -
పాలీవుడ్‌కి శక్తి కపూర్!
హిందీ చిత్రసీమలో అగ్రశ్రేణి ప్రతినాయకుల జాబితాలో కచ్చితంగా ఉండే పేరు... శక్తి కపూర్. ఆయనలో ఎంత గొప్ప విలన్ ఉన్నాడో, అంతే గొప్ప కమెడియన్ కూడా ఉన్నాడు. నాలుగు దశాబ్దాల కెరీర్లో ఉత్తర, దక్షిణాది భాషల్లో వందలాది సినిమాలకు పైగా చేశారు శక్తి. ఈ ఏడాది పాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు. పాలీవుడ్ అంటే.. పంజాబీ పరిశ్రమ. జస్వీందర్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ‘మేరేజ్ డా గారేజ్’ అనే చిత్రంలో శక్తి కపూర్ కీలక పాత్ర చేస్తున్నారు. జైలు నుంచి విడుదలయ్యే ఇద్దరు ఖైదీలు ‘మేరేజ్ డా గారేజ్’ అనే వ్యాపారం ప్రారంభిస్తారని, ఓ ప్రేమజంట పెళ్లికి వీళ్లెలా సహాయపడతారనేది ప్రధాన ఇతివృత్తం అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో చాలా పాత్రలు ఉంటాయని, అన్నిటికీ సమాన ప్రాధాన్యం ఉంటుందని, శక్తికపూర్ పాత్ర కామెడీ టచ్‌తో సాగుతుందని పేర్కొన్నారు.