పబ్లిక్ గా సిగరెట్ తాగిన బాలీవుడ్ నటుడుపై కేసు | Complaint against Shakti Kapoor for smoking in public | Sakshi
Sakshi News home page

పబ్లిక్ గా సిగరెట్ తాగిన బాలీవుడ్ నటుడుపై కేసు

Published Wed, Jun 4 2014 11:17 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

పబ్లిక్ గా సిగరెట్ తాగిన బాలీవుడ్ నటుడుపై కేసు - Sakshi

పబ్లిక్ గా సిగరెట్ తాగిన బాలీవుడ్ నటుడుపై కేసు

జైపూర్: పబ్లిక్ గా సిగరెట్ తాగిన బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ పై కేసు నమోదైంది. జైపూర్ లోని సంగనేర్ విమానాశ్రయంలో పబ్లిక్ గా సిగరెట్ తాగుతున్నట్టు ఓ దిన పత్రికలో వచ్చిన పోటో ఆధారంగా శక్తి కపూర్ పై ఓ న్యాయవాది నెమ్ సింగ్ ఫిర్యాదు చేశారు.

రాజస్థాన్ ధూమపాన నిషేధం చట్టంలోని 5/11 సెక్షన్ ప్రకారం శక్తి కపూర్ పై చర్య తీసుకోవాలని నెమ్ సింగ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళవారం చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ గిరీష్ కుమార్ ఓజాకు నెమ్ సింగ్ ఫిర్యాదు సమర్పించారు.

అయితే ఈ కేసు జూన్ 6 తేదిన విచారణకు రానుంది. ఓ దిన పత్రికలో వచ్చిన పోటోగ్రాఫ్ ఆధారంగా శక్తి కపూర్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై స్పందించడానికి ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎస్ఎన్ బోర్కర్ అందుబాటులోకి రాలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement