తనుశ్రీ- నానా వివాదం : శక్తికపూర్‌ షాకింగ్‌ కామెంట్స్‌ | Shakti Kapoor Laughs Off Tanushree Dutta Nana Patekar Controversy | Sakshi
Sakshi News home page

తనుశ్రీ- నానా వివాదం : శక్తికపూర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Published Wed, Oct 3 2018 10:51 AM | Last Updated on Wed, Oct 3 2018 12:16 PM

Shakti Kapoor Laughs Off Tanushree Dutta Nana Patekar Controversy - Sakshi

అప్పట్లో నేను చిన్నపిల్లాడిని..నాకేం తెలీదన్న శక్తికపూర్‌..

న్యూఢిల్లీ : తనుశ్రీ దత్తా-నానా పటేకర్‌ వివాదంపై బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శక్తికపూర్‌ స్పందించిన తీరు నవ్వులు పూయిస్తోంది. నానా పటేకర్‌ 2008లో ఓ డ్యాన్స్‌ సీక్వెన్స్‌ షూటింగ్‌ సందర్భంగా తనను లైంగికంగా వేధించారని తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. పలువురు హీరోయిన్లు, నటులు తనుశ్రీకి మద్దతుగా నిలవగా, మరికొందరు ఆమె చవకబారు ప్రచారం కోసమే నానాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

తాజాగా తనుశ్రీ వ్యాఖ్యలపై శక్తికపూర్‌ స్పందన కోరగా, ఇది పదేళ్ల కిందటి వివాదమని అప్పుడు తాను చిన్న పిల్లవాడినని, దీనిగురించి తనకేమీ తెలియదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బాలీవుడ్‌లో దిగ్గజాలు సైతం తనుశ్రీకి బాసటగా నిలుస్తున్న నేపథ్యంలో శక్తికపూర్‌ వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. కాగా సోనం కపూర్‌, ట్వింకిల్‌ ఖన్నా, ప్రియాంక చోప్రా, ఫర్హాన్‌ అక్తర్‌, సిమీ గరేవాల్‌, అనురాగ్‌ కశ్యప్‌, పూజా భట్‌, రవీనా టాండన్‌, కొయినా మిత్రా వంటి పలు నటీనటులు తనూశ్రీకి మద్దతు తెలపగా, అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌ వంటి నటులు ఈ వివాదంపై స్పందించేందుకు నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement