తనుశ్రీ దత్తా.. మీటూ ఉద్యమం జోరుగా నడిచిన సమయంలో బాగా వినిపించిన పేరు. ప్రముఖ నటుడు నానా పటేకర్ తనను శారీరకంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలు చేసిందీ బాలీవుడ్ హీరోయిన్. ఆమె గొంతు విప్పిన తర్వాతే పలువురు నటీమణులు కూడా బయటకు వచ్చిన తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. కానీ మీటూ తర్వాత నుంచి తనకు సినిమా అవకాశాలు రాకుండా వేధిస్తున్నారని పలుమార్లు వాపోయింది తనుశ్రీ.
తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన పోస్ట్ చేసింది. 'నాకేదైనా అయితే అందుకు నానా పటేకర్, అతడి బాలీవుడ్ మాఫియా ఫ్రెండ్సే కారణం. బాలీవుడ్ మాఫియా అంటే ఎవరెవరా అనుకుంటున్నారా? సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పుడు ఎవరి పేర్లైతే బయటకు వచ్చాయో వాళ్లందరూ బాలీవుడ్ మాఫియాలో ఉన్నవారే. దయచేసి వారి సినిమాలు చూడకండి, వారిని పూర్తిగా బహిష్కరించండి. ప్రతీకారంతో వారిని వెంబడించండి. నా గురించి విషప్రచారం చేసినవారిని వదిలిపెట్టకండి. ఈ న్యాయస్థానం నా విషయంలో విఫలమైనా ప్రజల మీద నాకు నమ్మకముంది. జైహింద్, బై..మళ్లీ కలుద్దాం' అని రాసుకొచ్చింది.
చదవండి: నా గురువుకి నేను సాయం చేయడమేంటి?
విజయ్, రష్మిక డేటింగ్‌పై ప్రశ్న.. హింట్ ఇచ్చిన అనన్య పాండే
Comments
Please login to add a commentAdd a comment