shakti kapoor,daughter shraddha-kapoor wedding rumours - Sakshi
Sakshi News home page

ఫొటోగ్రాఫర్‌తో హీరోయిన్‌ పెళ్లి?

Published Thu, Jan 28 2021 1:58 PM | Last Updated on Thu, Jan 28 2021 6:37 PM

Shakti Kapoor On Shraddha Kapoor Wedding Rumours - Sakshi

ఇష్టపడిన ప్రేయసి చేయి పట్టుకుని ఏడడుగులు నడిస్తే ఆ సంతోషం ఎలా ఉంటుందో వరుణ్‌ ధావన్‌ను అడిగితే చెప్తారు. ఈ మధ్యే తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేమికురాలు నటాషా దలాల్‌కు మూడు ముళ్లు వేసి ఓ ఇంటివాడయ్యాడు. అతడికి సినీలోకం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఫొటోగ్రాఫర్‌ రోహన్‌శ్రేష్ట కూడా ఈ కొత్తజంటకు విషెస్‌ చెప్తూ మీరు ఎంతో లక్కీ అని రాసుకొచ్చారు. దీనికి వరుణ్‌ధావన్‌ స్పందిస్తూ త్వరలోనే నువ్వు కూడా పెళ్లికి రెడీ అవుతున్నావని ఆశిస్తున్నానని చెప్పాడు. దీంతో అతడు, హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకునే ఛాన్స్‌ ఉందంటూ వార్తలు ఊపందుకున్నాయి. (చదవండి: దీపికను వెనక్కి నెట్టిన శ్రద్ధా.. మూడో స్థానంలోకి!)

ఈ క్రమంలో శ్రద్ధా పెళ్లి గురించి ఆయన తండ్రి, సీనియర్‌ నటుడు శక్తికపూర్‌ స్పందిస్తూ.. "నా కూతురు పెళ్లి గురించి బయట ఎలాంటి టాక్‌ నడుస్తుందో నాకు తెలీదు. కానీ ఆమె తీసుకునే ప్రతీ నిర్ణయానికి నేను మద్దతిస్తాను. అది ఆమె పెళ్లి విషయమైనా సరే! రోహన్‌ శ్రేష్టనే కాదు ఎవరిని తీసుకొచ్చినా పెళ్లికి నేను అంగీకరిస్తాను. రోహన్‌ చాలా మంచి అబ్బాయి. అతడు చిన్నప్పటి నుంచే మా ఇంటికి తరచూ వస్తుండేవాడు. ఇప్పటివరకైతే శ్రద్ధా తన పెళ్లి గురించి ఏమీ చెప్పలేదు. వాళ్లింకా బాల్య స్నేహితులే అనుకంటున్నాను. ప్రేమలో ఉన్నారనైతేనే భావించడం లేదు" అని చెప్పుకొచ్చారు. (చదవండి: కరోనా కష్టాలు చెప్పి బాధపడిన హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement