‘నా కూతురు పెళ్లా.. ప్లీజ్‌ నన్నూ పిలవండే’ | Shakti Kapoor Has Epic Reply About Shraddha Kapoor Marriage | Sakshi
Sakshi News home page

కూతురు పెళ్లి వార్తలపై స్పందించిన శక్తికపూర్‌

Published Thu, Jul 11 2019 7:25 PM | Last Updated on Wed, Jul 17 2019 10:14 AM

Shakti Kapoor Has Epic Reply About Shraddha Kapoor Marriage - Sakshi

బాలీవుడ్‌ మీడియా గురువారం శ్రద్ధాకపూర్‌ పెళ్లి వార్తలతో మరోసారి బిజీగా మారింది. త్వరలోనే శ్రద్ధా కపూర్‌, తన బాయ్‌ఫ్రెండ్‌ రోషన్‌ శ్రేష్టను వివాహం చేసుకోబోతున్నారంటూ ఊదరగొట్టింది. అంతటితో ఊరుకోక ఈ విషయం గురించి శ్రద్ధ తండ్రి శక్తి కపూర్‌ను కూడా ప్రశ్నించింది. అయితే మీడియా అత్యుత్సాహానికి తగ్గట్టు శక్తి కపూర్‌ మాంచి సమాధానం ఇచ్చారు.

‘నిజంగానా.. నా కూతురు పెళ్లి చేసుకోబోతుందా.. ఎప్పుడు.. ఎక్కడా. తండ్రిగా నేను అక్కడ ఉండాలి కదా. కానీ ఈ పెళ్లి గురించి నాకేం తెలీదు.  ప్లీజ్‌ నా కూతురు పెళ్లికి నన్ను పిలవడం మర్చిపోకండే’ అంటూ వ్యగ్యంగా సమాధానమిచ్చారు. శ్రద్ధాకపూర్‌ పెళ్లి గురించి వస్తోన్న వార్తలన్ని అవాస్తవాలే అంటూ ఆయన కొట్టి పారేశారు. ముంబైకు చెందిన ఓ టాబ్లాయిడ్‌ ముందుగా ఈ వార్తల్ని ప్రచురించింది. శ్రద్ధా కపూర్‌, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచురించింది. దాంతో మిగతా చానెల్స్‌, వెబ్‌సైట్లు కూడా ఈ వార్తల్ని ప్రసారం చేశాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శ్రద్ధా కపూర్‌ ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌ త్రీడీ’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇక శ్రద్ధా కపూర్‌ నటించిన సాహో చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement