marriage Rumors
-
పెళ్లి కోసం అబ్బాయిని తీసుకెళ్లినా.. ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు: అంజలి
తెలుగు బ్యూటీ అంజలి పెళ్లిపై చాలా రూమర్స్ వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. మొదట్లో ఓ తమిళ హీరోతో పెళ్లి అని పుకార్లు వచ్చాయి. దానిపై అంజలి వివరణ ఇచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు ఎలాంటి రూమర్స్ రాలేదు. మళ్లీ ఆమె సినిమాలతో బీజీ అయిన తర్వాత ప్రముఖ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుందనే ప్రచారం జరిగింది. అంతేకాదు త్వరలోనే సినిమాలకు పుల్‌స్టాప్ పెట్టి అమెరికాలో సెటిల్ అవుతుందనే ప్రచారమూ జరిగింది. అయితే వీటిని అంజలి ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. అయినా కూడా ఈ మ్యారేజ్ రూమర్స్ వస్తునే ఉన్నాయి. తాజాగా అంజలి తన పెళ్లిపై వస్తున్న పుకార్లపై స్పందించింది. ‘ఇప్పటికే సోషల్ మీడియా నాకు మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసింది(నవ్వూతూ..). మొదట్లో ఇలాంటి రూమర్స్ వస్తే ఇంట్లో వాళ్లు కంగారు పడేవాళ్లు. కానీ ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ మధ్య నేను పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయ్యాననే పుకారు వచ్చింది. అమెరికాలోనే ఉన్న మా అక్క నాకు కాల్ చేసి..‘పెళ్లి అయిందటగా’ అని అడిగింది. ఏమో మరి నాకే తెలియదు అని చెప్పా(నవ్వుతూ..). నా పెళ్లిపై వచ్చిన రూమర్స్ కారణంగా..నేను ఒక అబ్బాయిని తీసుకెళ్లి ఇతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పినా.. ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు. పెళ్లి అయితే కచ్చితంగా చేసుకుంటా. కానీ ఇప్పుడు కాదు. ప్రస్తుతం నేను సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. పెళ్లి చేసుకుంటే.. పర్సనల్ లైఫ్‌కి కూడా టైమ్ కేటాయించాలి. అందుకే కొంచెం టైమ్ తీసుకొని పెళ్లి చేసుకుంటా. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాను’ అని అంజలి చెప్పుకొచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదలకు సిద్ధంగా ఉంది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. నేహా శెట్టి మరో హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మే 31న విడుదల కాబోతుంది. -
ప్రముఖ యాంకర్‌తో హైపర్ ఆది పెళ్లి ఫిక్స్!
బుల్లితెరలో ప్రసారం అవుతున్న కామెడీ షోలకు స్క్రిప్ట్ రైటర్‌గా పని చేసిన హైపర్ ఆది రానురానూ అదే షోలో టీమ్‌కు లీడర్ అయ్యే స్థాయికి ఎదిగాడు. ఆపై తిరుగులేని పంచులతో మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. తద్వారా వచ్చిన పాపులారిటీతో పలు షోలు చేస్తూ బిజీబిజీగా మారాడు. దీంతో తన కామెడీ టైమింగ్ పంచ్‌లతో సపరేట్ ఫ్యాన్ బేస్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అలా బుల్లితెరపైనే కాకుండా బిగ్ స్క్రీన్‌పైనా కూడా పలు సినిమాల్లో కమెడియన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ మధ్యే విడుదలైన ధనుష్ 'సార్' సినిమాలో కూడా ఆది మెప్పించాడు. (ఇదీ చదవండి: TFCC Election Live Update: టాలీవుడ్ లో ఉత్కంఠ.. గెలుపెవరిది?) తాజాగా అతడు పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అవ్వాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం ఊపందుకుంది. దీంతో అతడికి కాబోయే భార్య ఎవరా? అని అభిమానులు కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ యూట్యూబ్ యాంకర్‌తో ఆది ప్రేమలో ఉన్నారట. ఆమెతో ఆదికి చాలా కాలం నుంచే పరిచయం ఉందట. ఒక రకంగా ఆది ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలో అతనికి ఆమె ఎంతో సాయంగా నిలిచిందట. అలా స్నేహంగా మొదలైన వారి బంధం ప్రేమ వరకు వచ్చిందట. (ఇదీ చదవండి: TFCC Election: సంతోషపడాలో, సిగ్గు పడాలో తెలియట్లేదు..తమ్మారెడ్డి) తాజాగా వీరి ప్రేమ గురించి ఇంట్లో తెలిపితే ఇద్దరి పెద్దలు కూడా అంగీకరించారట. ఇంకేముంది త్వరలోనే ఒక మంచి ముహూర్తం ఏర్పాటు చేసి ఆ అమ్మాయితో నిశ్చితార్థం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. త్వరలో ఆ ఆమ్మాయి పేరుతో పాటు.. పెళ్లి విషయాన్ని అధికారికంగా ఆదినే వెల్లడించాలనే ప్లాన్‌లో ఉన్నారట. -
పెళ్లెప్పుడంటే! వడివేలు స్టైల్లో విషయం చెప్పేసిన కీర్తి.. ఎంతైనా మహానటి కదా!
నటి కీర్తీసురేశ్ పెళ్లిపై సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. సినీ కుటుంబం నుంచి వచ్చిన నటి ఈ బ్యూటీ. తల్లి మేనక నటి. తండ్రి సురేశ్ నిర్మాత. వీరి వారసత్వంతో ముందుగా మలయాళంలో నటిగా రంగప్రవేశం చేసిన కీర్తీ ఆ తరువాత ఇదు ఎన్న మాయం చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయ్యింది. అయితే ఇక్కడ తొలి చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత శివకార్తికేయన్‌తో నటించిన రజనీ మురుగన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత కీర్తీసురేశ్‌కు నటిగా వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. తెలుగులో మహానటి చిత్రంతో సావిత్రిగా జీవించి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డునే గెలుచుకుంది. కీర్తీ సురేశ్ ఏ తరహా పాత్రనైనా అవలీలగా నటించి శభాష్ అనిపించుకుంటుంది. ప్రస్తుతం తమిళంలో ఉదయనిధిస్టాలిన్‌కు జంటగా నటించిన మామన్నన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. జయంరవితో నటిస్తున్న సైరన్ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా చాలా మంది హీరోయిన్లు ఉన్నా, నటి కీర్తీసురేశ్ పెళ్లి గురించే ఎక్కువగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఓ పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకోబోతోందని, తల్లిదండ్రులు సంబంధం చూశారు అనీ రకరకాల ప్రచారం వైరల్ అవుతోంది. ఇది ఒక రకంగా ఆమెకు ఫ్రీ పబ్లిసిటీనే అవుతోందని చెప్పవచ్చు. కాగా ఈ భామ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈమెకు ఫాలోవర్స్ అధికమే. ఇటీవల తన ఇన్‌స్ట్రాగామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. అప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ఓ అభిమాని అడగ్గా నటుడు వడివేలు రెండు చేతులను జేబులో పెట్టుకుని ఏముందీ? ఏమీలేదు అనే విధంగా ఒక కార్టూన్ పోస్ట్ చేసి ఇప్పట్లో పెళ్లి ప్రస్తావనే లేదు అని తేల్చి చెప్పింది. -
7/G బృందావన్ కాలనీ హీరోయిన్‌తో ఎస్పీ చరణ్ పెళ్లా?, ఫొటో వైరల్
గాన గాంధర్వుడు, దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తన పాటలతో ఎంతోమందిని అలరించారు. తెలుగుతో పాటు ఎన్నో భారతీయ భాషల్లో ఆయన 40వేలకు పైగా పాటలు పాడారు. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని రీతిలో 2020లో ఆయన కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక ఆయన తనయుడు ఎస్పీ చరణ్ కూడా మంచి గాయకుడనే విషయం తెలిసిందే. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు చరణ్. చదవండి: ‘మీకు ఉన్నా.. తనకు ఇష్టం లేదు’.. ఆ వార్తలపై రష్మిక స్పందన దర్శకుడిగా, నిర్మాతగా, సింగర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చరణ్ స్వరం తన తండ్రి బాలును గుర్తుచేస్తుంటుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. ఇదిలా ఉంటే చరణ్‌కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఓ హీరోయిన్‌తో చరణ్ మరోసారి ఏడడుగులు వెయ్యబోతున్నాడంటూ ఒక్కసారిగా తమిళ మీడియాల్లో వార్తలు గుప్పుమన్నాయి. ఈ రూమర్లకు అతడు పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్టే ఆజ్యం పోసింది. ఇటీవల చరణ్ 7/G బృందావన కాలనీ హీరోయిన్‌తో సోనియా అగర్వాల్‌తో క్లోజ్‌గా దిగిన ఫొటోను షేర్ చేశాడు. అంతేకాదు దీనికి ‘ఏదో కొత్తగా జరగబోతుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాసేపట్లోనే ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో సోనియాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించడమే కాదు వీరిద్దరి పెళ్లంటూ ప్రచారం కూడా మొదలెట్టారు. ఇది కాస్తా వైరల్ కావడంతో చరణ్ మరో పోస్ట్ పెట్టి ఇండియన్ వెబ్‌సిరీస్, ఫిలింప్రొడక్షన్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ జత చేశాడు. అయితే ఈ ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టాలనుకున్న చరణ్ నెటిజన్ల నుంచి మరిన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. రెండో పోస్ట్‌లో చరణ్, సోనియాలతో పాటు నటి అంజలి మరో నటుడు కూడా ఉన్నాడు. చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం అయితే ‘ముందుగా ఈ ఫొటో ఎందుకు పెట్టలేదని, సోనియాతో ఉన్న ఫొటోనే జూమ్ చేసి ప్రత్యేకం ఎందుకు పోస్ట్ చేశారు’ అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా గత కొద్ది రోజులుగా సోనియా అగర్వాల్ రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చరణ్ ఆమెతో దిగిన ఫొటోను పోస్ట్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ సైతం సోనియా పెళ్లి చేసుకొబోయేది ఎస్పీబీ చరణా? అని అభిప్రాయ పడుతున్నారు. కాగా ఎస్పీ చరణ్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) View this post on Instagram A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) -
త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న యంగ్ హీరో!
యంగ్ హీరో రాజ్ తరుణ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. షార్ట్ ఫిలింలో నటించి.. దర్శకుల దృష్టిని ఆకర్షించిన అతడు ‘ఉయ్యాల జంపాల’ మూవీతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత ‘సినిమా చూపిస్తా మావ’ ‘కుమారి 21F’తో వరుస హిట్లు అందుకున్న ఈ కుర్ర హీరో అదే జోరును కొనసాగించలేకపోయాడు. క్రమంగా సినిమాలు తగ్గించి ఖచ్చితంగా హిట్ కొట్టాలని భావించి ‘పవర్ ప్లే’, ‘ఓరేయ్ బుజ్జి’ సినిమాలు చేశాడు. పవర్ ప్లే మూవీ పాజిటివ్ టాక్ వచ్చినప్పటికి ఆ సినిమా అనుకున్న విజయం సాధించలేకపోయింది. ఇక ఓటీటీలో విడుదలైన ఓరేయ్ బుజ్జి కూడా పెద్దగా గుర్తింపు పొందలేదు. ఇదిలా ఉండగా ఈ మధ్య యువ హీరోలంతా వరుసగా పెళ్లి పీటలెక్కి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక వారందరి బాటలో తాజాగా రాజ్ తరుణ్ కూడా అడుగులు వేసేందుకు సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా ఇటీవల హైదరాబాద్‌లో సొంత ఇంటిని కొనుగొలు చేసిన రాజ్ తరుణ్, త్వరలో పెళ్లి చేసుకోని లైఫ్‌లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాడని సన్నిహిత వర్గాల సమాచారం. దానికి తగ్గట్లు అతడు త్వరలోనే పెళ్లికి సిద్దమవుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే గతంలో రాజ్ తరుణ్ విజయవాడకు చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు స్ఫష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెతో ఈ కుర్ర హీరో ఏడడుగులు వేయనున్నాడేమోనని అందరు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. ఇందులో ఎంతవరకు నిజమో తెలియాలంటే అతడు స్పందించే వరకు వేచి చూడాల్సింది. కాగా గతంలో కూడా రాజ్ తరుణ్ ఓ యాంకర్‌తో ప్రేమలో ఉన్నాడని, ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఈ యంగ్ హీరో కొట్టిపారేశాడు. చదవండి: NTR 30: మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్! సమంత గుడ్‌న్యూస్ చెప్పబోతోందా.. ఆ ఫోటోతో జోరుగా ప్రచారం! -
హైపర్ ఆది పెళ్లి ఆరోజే.. ఆమెనే పెళ్లాడతాడట!
కామెడీ టీమ్‌కు స్క్రిప్ట్ రైటర్‌గా పని చేసిన హైపర్ ఆది రానురానూ అదే టీమ్‌కు లీడర్ అయ్యే స్థాయికి ఎదిగాడు. తిరుగులేని పంచులతో మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. తద్వారా వచ్చిన పాపులారిటీతో పలు షోలు చేస్తూ బిజీబిజీగా మారాడు. తాజాగా అతడు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అతడికి కాబోయే భార్య ఎవరా? అని అభిమానులు కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నిజానికి హైపర్ ఆది.. ముందు సుధీర్, రష్మిల పెళ్లి అయిన తర్వాతే తాను పెళ్లిపీటలెక్కుతానని గతంలో పలుమార్లు మీడియాతో చెప్పాడు. కానీ వాళ్లు పెళ్లి ఊసే ఎత్తకపోవడంతో తనే ముందు వివాహానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆది కోసం పెళ్లికూతురును వెతికే పనిలో పడ్డారట అతడి ఇంటి సభ్యులు. అతను కూడా తల్లిదండ్రులు తీసుకొచ్చే అమ్మాయినే అర్ధాంగిగా చేసుకుంటానని చెప్తున్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా పెళ్లి డేట్ కూడా ప్రకటించేశాడట హైపర్ ఆది. వచ్చే ఏడాది తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తానని అంటున్నాడట. అది కూడా తన సొంత జిల్లా ప్రకాశానికి చెందిన అమ్మాయితోనే ఏడడుగులు నడుస్తానని తేల్చి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ పెళ్లి వార్తలు ఎంతవరకు నిజమో త్వరలోనే తెలియనుంది. చదవండి: స్టార్ హీరో సినిమా: థియేటర్లో, ఓటీటీలో ఒకేసారి! నటుడి కొడుకు కోసం చిరంజీవి ఖరీదైన గోల్డ్ చైన్! -
కీర్తి సురేష్ ఎవరితోనూ ప్రేమలో లేదు..
‘వై దిస్ కొలవెరి’ అనుకుంటున్నారట అనిరుద్ రవిచంద్రన్. చంపాలనుకునేంత కచ్చి ఎందుకు? అనేది అర్థం. ధనుష్, శ్రుతీహాసన్ జంటగా నటించిన ‘త్రీ’ సినిమా కోసం సంగీత దర్శకుడు అనిరుద్ స్వరపరచిన ఈ పాట చాలా పాపులర్. ఇప్పుడు అనిరుద్‌కి కూడా చాలామంది మీద చంపాలనేంత కాకపోయినా కచ్చిగా మాత్రం ఉందట. దానికి కారణం కీర్తీ సురేశ్‌కి, అతనికి పెళ్లి అని వార్త రావడమే! ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్త గుప్పుమంది. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలతో వార్త ప్రచారంలోకొచ్చింది. ఈ వార్త నిజమేనా? అని కీర్తీ సురేశ్ తల్లి, నటి మేనకను సంప్రదించగా, ‘ఆల్రెడీ మలయాళ మీడియాతో ఈ విషయం గురించి కీర్తి తండ్రి స్పష్టం చేశారు’ అన్నారామె. ‘ఇది వదంతి. ఏ మాత్రం నిజం లేదు’ అని కీర్తి తండ్రి సురేశ్ పేర్కొన్నారు. ‘కీర్తి ఎవరితోనూ ప్రేమలో లేదు. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనే’ అని కూడా అక్కడి మీడియాతో సురేశ్ అన్నారు. ఇక, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మహేశ్‌బాబు సరసన ‘సర్కారువారి పాట’, రజనీకాంత్ ‘అన్నాత్తే’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు కీర్తీ సురేశ్. చదవండి: కీర్తి సురేశ్ కన్నా నేను అందంగా ఉన్నానట! -
అతన్ని పెళ్లి చేసుకోవట్లేదు: నటి
బాలీవుడ్ నటి, డ్యాన్సర్ మలైకా అరోరా తన పెళ్లిపై వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టారు. జూమ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అర్జున్ కపూర్‌తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రస్తుతానికి వివాహం చేసుకునే ఆలోచన లేదు’ అని స్పష్టం చేశారు. వీరిద్దరూ ఏ క్షణమైనా పెళ్లి చేసుకుంటారని నిరంతరం వస్తున్న పుకార్లను ఆమె కొట్టిపారేశారు. తన కొడుకు అర్హాన్ భవిష్యత్తును గూర్చి ప్రస్తావిస్తూ.. ‘అతనికి సినిమాలు చూడటం, వాటిని అనుసరించడమంటే ఇష్టమని, దానికి అతను పెరిగిన వాతావరణం ఒక కారణం’ అని చెప్పుకొచ్చారు. అయితే అర్హాన్ భవిష్యత్తులో ఏమవుతాడో అనే దానిపై అతనికి స్పష్టత తేదని, ప్రస్తుతానికి తాను కచ్చితంగా చెప్పలేనని అన్నారు. అర్బాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత వయసులో తనకన్నా చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేయడంతో తనపై తరచూ వస్తున్న ఆన్లైన్ ట్రోల్స్‌పై ఆమె స్పందించారు. ‘ట్రోల్స్ నన్ను ఎప్పుడూ బాధించలేదు. ట్రోల్స్ బాధించకుండా ఓ రక్షణ కవచం ఏర్పాటు చేసుకున్నాను. అదే ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షిస్తుంది’ అన్నారు. ట్రోల్స్ సృష్టించే వారు పూర్తిగా వేరే జాతి అని, గందరగోళానికి ప్రయత్నిస్తారని ఆమె వ్యాఖ్యానించారు. -
‘నా కూతురు పెళ్లా.. ప్లీజ్ నన్నూ పిలవండే’
బాలీవుడ్ మీడియా గురువారం శ్రద్ధాకపూర్ పెళ్లి వార్తలతో మరోసారి బిజీగా మారింది. త్వరలోనే శ్రద్ధా కపూర్, తన బాయ్‌ఫ్రెండ్ రోషన్ శ్రేష్టను వివాహం చేసుకోబోతున్నారంటూ ఊదరగొట్టింది. అంతటితో ఊరుకోక ఈ విషయం గురించి శ్రద్ధ తండ్రి శక్తి కపూర్‌ను కూడా ప్రశ్నించింది. అయితే మీడియా అత్యుత్సాహానికి తగ్గట్టు శక్తి కపూర్ మాంచి సమాధానం ఇచ్చారు. ‘నిజంగానా.. నా కూతురు పెళ్లి చేసుకోబోతుందా.. ఎప్పుడు.. ఎక్కడా. తండ్రిగా నేను అక్కడ ఉండాలి కదా. కానీ ఈ పెళ్లి గురించి నాకేం తెలీదు. ప్లీజ్ నా కూతురు పెళ్లికి నన్ను పిలవడం మర్చిపోకండే’ అంటూ వ్యగ్యంగా సమాధానమిచ్చారు. శ్రద్ధాకపూర్ పెళ్లి గురించి వస్తోన్న వార్తలన్ని అవాస్తవాలే అంటూ ఆయన కొట్టి పారేశారు. ముంబైకు చెందిన ఓ టాబ్లాయిడ్ ముందుగా ఈ వార్తల్ని ప్రచురించింది. శ్రద్ధా కపూర్, ఆమె బాయ్‌ఫ్రెండ్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచురించింది. దాంతో మిగతా చానెల్స్, వెబ్సైట్లు కూడా ఈ వార్తల్ని ప్రసారం చేశాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శ్రద్ధా కపూర్ ‘స్ట్రీట్ డ్యాన్సర్ త్రీడీ’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇక శ్రద్ధా కపూర్ నటించిన సాహో చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. -
పైలెట్‌తో స్వాతి పెళ్లి
‘అష్టా చమ్మా’ సినిమాలో ‘మహేశ్ మహేశ్...’ అంటూ కలవరించే మహేశ్ అభిమానిగా కనిపిస్తారు ‘కలర్స్’ స్వాతి. కానీ ప్రస్తుతం ఆమె కలవరిస్తున్న పేరు వికాస్ అట. కొంటె చూపుతో ఓ కొంటె చూపుతో అంటూ వికాస్ అనే పైలెట్ స్వాతి మనసుని దోచేశారట. ఇక్కడున్న ఫొటోని చూసి పెళ్లి ఆల్రెడీ అయిపోయింది అనుకుంటే పొరబడ్డట్టే. ఇది సినిమాలోని పెళ్లి ఫొటోనే. నిజమైన పెళ్లి మరో 15రోజుల్లో జరగనుంది. ‘అష్టా చమ్మా, సుబ్రమణ్యపురం, కార్తికేయ వంటి సినిమాలతో తెలుగులో హీరోయిన్గా పాపులారిటీ సంపాదించక ముందు చిన్ని తెరపై ‘కలర్స్’ స్వాతిగా బోలెడంత పాపులార్టీ సంపాదించుకున్నారామె. ఈ మధ్య సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చారు. పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టారు. త్వరలోనే వధువు కానున్నారు. కేరళకు చెందిన వికాస్ అనే పైలెట్‌తో ఈ నెలాఖరున మూడు ముళ్లు వేయించుకోనున్నారు. స్వాతి వివాహ విషయమై ఆమె కుటుంబ సభ్యులను ‘సాక్షి’ సంప్రదించగా – ‘‘కేరళకు చెందిన వికాస్ అనే పైలెట్‌తో స్వాతి పెళ్లి కుదిరింది. పెళ్లి వేడుక ఈ నెల 30న కేవలం ఇరు కుటుంబ సభ్యులు, దగ్గర చుట్టాలు, క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య హైదరాబాద్‌లో జరగనుంది’’ అన్నారు. మలేషియన్ ఎయిర్ లైన్స్‌లో పని చేసే వికాస్, స్వాతిది లవ్, అరేంజ్డ్ మ్యారెజ్ అట. పెళ్లి జరిగిన రెండు రోజులకే కేరళలోని కొచ్చిలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం. ఎందుకంటే వికాస్ మలయాళీ. ఇదిలా ఉంటే.. స్వాతి అధికారికంగా కాబోయే భర్త ఫొటోను బయటపెట్టలేదు కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో సోమవారం నెట్లో హల్చల్ చేసింది. -
కలర్స్ స్వాతి పెళ్లి పీటలెక్కనుందా?
కలర్స్ స్వాతి ఈ పేరు అందరికీ సుపరిచితమే. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన కలర్స్ స్వాతి తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కలర్స్ స్వాతికి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. కలర్స్ స్వాతి త్వరలో పెళ్లి పీటలెక్కనుందని, తాను చేసుకోబోయే భర్త పేరు వికాస్ అంటూ.. అతనొక పైలట్ అని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కలర్ స్వాతి ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. అష్టాచమ్మా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, గోల్కొండ హైస్కూల్, స్వామిరారా సినిమాలతో గుర్తింపును పొందారు. -
పాండ్యాతో పెళ్లి.. కన్ఫ్యూజ్ చేసిన ఈషా
యువ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నటి ఈషా గుప్తాతో గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు కథనాలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. హాట్ బ్యూటీతో కలిసి పాండ్యా.. రెస్టారెంట్లు, పార్టీలు, ఈవెంట్లకు హాజరవుతున్నాడంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఈ తరుణంలో త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు ఇప్పుడు ఓ కథనం వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంపై పింక్విల్లా వెబ్సైట్ ప్రతినిధి ఈషాను సంప్రదించగా.. ఆమె గందరగోళమైన స్టేట్మెంట్ను ఇచ్చి వదిలేశారు. ‘నేను తొందర పడదల్చుకోవటం లేదు. వివాహానికి సమయం వచ్చినప్పుడు తెలియజేస్తా. ఇంతకు మించి ఏం చెప్పదల్చుకోలేదు’ అంటూ పేర్కొన్నారు. అయితే పాండ్యాతో డేటింగ్ చేస్తున్న మాట నిజమేనన్న ప్రశ్నకు మాత్రం ఆమె నవ్వి ఊరుకోవటం విశేషం. గతంలో నటి ఎల్లీ అవ్రమ్‌తో ఓపెన్ రొమాన్స్ కొనసాగించిన పాండ్యా.. తర్వాత ఇషాను ఓ పార్టీలో పరిచయం చేసుకుని డేటింగ్ మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే హెరా పెరీ-3, టోటల్ ధమాల్, పల్టాన్ చిత్రాలతో ఈషా బాలీవుడ్లో బిజీగా ఉండగా.. మరోవైపు పాండ్యా ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు. -
పెళ్లి కోసమే షాపింగ్ చేస్తోందా?
ప్రేమపక్షులు దీపికా, రణ్‌వీర్‌లు త్వరలో ఒక్కటి కాబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం ఈ అమ్మడు, తన సన్నిహితులతో కలిసి బెంగళూర్‌లో షాపింగ్ చేస్తోందని, ఇది పెళ్లి కోసమే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. దీపిక పుట్టినరోజైన జనవరి 5న రణ్వీర్తో నిశ్చితార్థం జరిగినట్టు రూమర్స్ వస్తున్నాయి. దీపిక తల్లిదండ్రులు కూడా రణ్వీర్ కుటుంబ సభ్యులను ముంబైలో కలిసి పెళ్లి తేదీల కోసం చర్చించినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా ఈ జోడీ అన్ని పార్టీలకు, ఫంక్షన్లకు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండటం అందరికి తెలిసిందే. అయితే ఈ వ్యవహారాలన్నింటిపై ఇప్పటివరకు ఈ జంట స్పందిచలేదు. ప్రస్తుతం దీపిక వెన్నునొప్పి కారణంగా సినిమా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చారు. రణ్వీర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్నసింబా (టెంపర్ రీమేక్) పనుల్లో బిజీగా ఉన్నాడు. -
బుమ్రాతో పెళ్లి : స్పందించిన రాశీఖన్నా
సాక్షి, హైదరాబాద్ : భారత్‌లో క్రికెట్, సినిమాలది విడదీయలేని బంధం. క్రికెటర్లు, ఫిలిం స్టార్స్ మధ్య ప్రేమాయణాలు మనకు చాలా కామన్. అయితే ప్రస్తుతం క్రికెటర్ బుమ్రా, సినీ నటి రాశీఖన్నా పెళ్లి చేసుకుంటారన్న పుకార్లు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ రాశీఖన్నా, ఇటీవల తొలి ప్రేమ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే. గతంలో తొలిప్రేమ సినిమా ప్రమోషన్ సందర్భంగా రాశీ మీడియాతో మాట్లాడుతూ క్రికెటర్ బూమ్రా అంటే తనకు ఇష్టమని చెప్పిందనే వార్తలు వచ్చాయి. దీంతో నెటిజన్లు ‘బుమ్రాకు రాశీ ఖన్నా బౌల్డ్’ అంటూ.. వాళ్ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్త రాశీ వరకు చేరడంతో దీనిపై ఓ టీవీ కార్యక్రమంలో క్లారిటీ ఇచ్చింది. బూమ్రా తనకు ఒక క్రికెటర్‌గా మాత్రమే తెలుసని, వ్యక్తిగతంగా తెలియదని చెప్పింది. అసలు బూమ్రా ఆడిన మ్యాచ్‌లు కూడా తాను చూడలేదని, ఇలాంటి రూమర్లు ఎలా పుట్టుకొస్తాయోనని అసహనం వ్యక్తం చేసింది. -
ఇప్పట్లో ఆ ఆలోచనే లేదు!
చిన్న గ్యాప్ తరువాత నటి అంజలి మరోసారి వార్తల్లోకెక్కారు. తమిళం, తెలుగు భాషల్లో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న నటి ఈ అచ్చ తెలుగు అమ్మాయి. ఆ మధ్య పిన్నితో మనస్పర్థలు, దర్శకుడు కళంజంతో వివాదాలు అంటూ కోలీవుడ్‌లో కలకలం సృష్టించిన అంజలి కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్నారు. అలాంటిది తాజాగా ఈ అమ్మడి పేరు మీడియాలో చర్చనీయంశంగా మారింది. నటుడు జయ్‌తో ప్రేమ కలాపాలు అంటూ చాలా కాలంగానే ప్రచారం జరుగుతోంది. ఇటీవల జయ్ స్వయంగా దోసెలు వేసి అంజలికి పెట్టడం, వాటిని ఆమె కమ్మగా ఆరగించడం వం టి దృశ్యాలు మీడియాలో హల్చల్ చేశాయి. దీంతో మరోసారి ఈ సినీ జంట ప్రేమ వ్యవహారం హాట్‌హాట్‌గా మారింది. చిన్న గ్యాప్ తరువాత అంజిలి తమిళంలో నటిస్తున్న చిత్రం బెలూన్. ఇందులో జయ్ కథా నాయకుడు. ఈ చిత్రంలో నటి అంజలికి సంబందించిన సన్నివేశాలు పూర్తి కావడంతో తను చిత్ర యూనిట్‌కు గుడ్‌బై చెప్పేశారు. దీంతో ఐ లవ్ యూ అంజలి అంటూ జయ్, సంతోషకరమైన సమయం మళ్లీ వస్తుంది అని అంజలి ఒకరికొకరు ట్వీట్ చేసుకోవడం వారి మధ్య ప్రేమకు అద్దం పడుతుందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నటి అం జలికి పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయని, త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని అంజలి ఖండించా రు. తనకిప్పుడే పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఇం కా తను చెబుతూ ఒకే సారి పలు చిత్రాల్లో నటిం చాలనే ఆశ తనకు లేదని, నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించాలని కోరుకుంటున్నానని అన్నారు. చిత్రంలో తన పాత్ర గురించి అందరూ చెప్పుకోవా లన్నారు. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలు ఉన్నాయని, అందువల్ల తన దృష్టి అంతా నటనపైనే సారిస్తున్నట్లు తెలిపారు.పెళ్లి చేసుకునే ఆలోచన ఇప్పట్లో లేదని, అలాంటిదేదైనా ఉంటే కచ్చితంగా అందరికీ చెబుతా నని అన్నారు. ప్రస్తుతం తన సోదరుడికి వధువును వెతికే పనిలో ఉన్నట్లు అంజలి చెప్పారు . -
అనుష్క అప్సెట్ అయిందా!
టాలీవుడ్ స్వీటీ అనుష్క ఇప్పుడు భారీ సినిమాలతో చాలా బిజీగా ఉంది. ‘బాహుబలి-2’, ’సింగం-3’, ’ఓమ్ నమో వెంకటేశాయ’, ’భాగమతి’ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్న అనుష్క చుట్టూ వెబ్ మీడియాలో చాలా రుమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అనుష్క టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాతతో ప్రేమాయణం సాగిస్తున్నట్టు తాజాగా వందతులు వస్తున్నాయి. ఆ నిర్మాతను త్వరలోనే అనుష్క పెళ్లి కూడా చేసుకోబోతున్నదంటూ టాలీవుడ్లో రుమర్లు షికారు చేస్తున్నాయి. అనుష్క పెళ్లి విషయంలో రుమర్లు రావడం ఇదే కొత్త కాదు. గతంలోనూ ఓ యంగ్ హీరోను ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్టు వదంతులు ప్రచారం అయ్యాయి. దీంతో అనుష్కనే స్వయంగా వివరణ ఇచ్చింది. తాను రహస్యంగా పెళ్లి చేసుకోబోనని, తన పెళ్లి గురించి అందరికీ చెప్పి చేసుకుంటానని ఆ మధ్య చెప్పింది. అయినా, తాజాగా ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న రుమర్లు అనుష్కను బాధించాయట. ఈ కథనాలపై ఆమె తన సన్నిహితుల వద్ద అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. అయినా.. ఈ 35 ఏళ్ల జేజమ్మ ఇలాంటి రుమర్లు పట్టించుకోకుండా ఫుల్ జోష్‌లో ఉన్న తన కెరీర్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందని సన్నిహితులు చెప్తున్నారు. -
నేను చెప్పే వరకు ఆ ప్రచారాలు నమ్మొద్దు
నేను చెప్పే వరకు నా ప్రేమ, పెళ్లి వంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దంటున్నారు నటి అనుష్క. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం అది ఒక్క అనుష్కతోనే సాధ్యమన్నంతగా పేరు సంపాదించుకున్న నటి ఈ యోగా సుందరి. అలా అరుంధతితో మొదలైన ఈమె హవా తాజా చిత్రాలు రుద్రమదేవి, బాహుబలి వరకు అప్రాహతంగా సాగుతోంది. ప్రస్తుతం వంద కోట్లు దాటిన బడ్జెట్లతో చారిత్రాత్మక కథాంశాలతో నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రాలు త్వరలో వరుసగా తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇవి రెండూ అనుష్క సినీ జీవితంలో స్థిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలని చెప్పవచ్చు. ఈ సందర్భంగా అనుష్కతో ముచ్చట్లు. ప్రశ్న : మీ యోగాకు ఇప్పుడు బహుళ ప్రాచుర్యం పొందడం గురించి మీ స్పందన? జవాబు : చిన్న దిద్దుబాటు. నా యోగా కాదు. మన యోగా. ఇకపోతే నేను నటినని చెప్పుకోవడానికి ఎంత గర్వపడుతున్నానో, ఒక యోగా టీచర్ అని చెప్పుకోవడానికి అంత గొప్పగా భావిస్తున్నాను. యోగా మన భారతదేశం ఆధ్యాత్మిక సొత్తు. దాన్ని రక్షించుకోవాలి. యోగాకిప్పుడు ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వడం సంతోషం. ప్రశ్న : మిమ్మల్ని నమ్మి వంద కోట్లకుపైగా బడ్జెట్ చిత్ర నిర్మాణాలు సాగుతున్నాయి. దీనికి మీరు ఎలా ఫీలవుతున్నారు? జ: పలు కోట్ల బడ్జెట్, బ్రంహ్మాడ చిత్రం లాంటివేవీ నేను చూడను. నన్ను నమ్మి ఇచ్చే పాత్రలకు నిజంగా నూరు శాతం న్యాయం చేయడానికి శ్రమిస్తాను. ఇక బడ్జెట్ అనేది నిర్మాతకు బ్రహ్మాండం అన్నది దర్శకుడికి సంబంధించిన విషయాలు. నా శ్రమ వృథా కాకూడదన్న అంశం గురించి దర్శక నిర్మాతల్ని గమనిస్తుంటాను. దర్శకుడు రాజమౌళి చిత్రాలను నమ్మి శ్రమిస్తే ఫలితం కచ్చితంగా ఉంటుంది. అలా చేసిన చిత్రం విక్రమార్కుడు. ఇప్పుడు బాహుబలి. ప్రశ్న : పాత్ర పోషణ కోసం చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. అలాంటి డబ్బింగ్ చెప్పుకునే ప్రయత్నం చేయకుండా అవార్డులకు దూరమవుతున్నారే? జ : ఇక్కడ మీకో విషయం చెప్పాలి. నేను అభిమానుల్ని అలరించడానికే నటిస్తున్నాను గానీ అవార్డుల కోసం కాదు. ఏం చేస్తే పాత్రకు బలం చేకూరుతుందో అది చేస్తాను. నేను నటించిన పాత్రకు ఇంకొకరు డబ్బింగ్ చెబితే ఉన్నతంగా ఉంటుందంటే అలా చేయడానికి నేను ఏ మాత్రం సందేహించను. ప్రశ్న : సరే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటానని చెప్పి ఇంజి ఇడుప్పళగి, సింగం-3 అంటూ వరుసగా చిత్రాలు చేసేస్తున్నారు? జ: విశ్రాంతి తీసుకోనున్నట్లు నేనెప్పుడూ ఎక్కడా? అనలేదు. రుద్రమదేవి, బాహుబలి చిత్రాల తరువాత పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అవ్వనున్నట్లు మీరే ప్రచారం చేశారు. ఎవరేం చెప్పుకున్నా నేను నటించుకుంటూ పోతాను. ప్రశ్న : పెళ్లి ప్రస్తావన ఎలాగూ వచ్చింది కాబట్టి పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కనున్నారు? జ: నా నట జీవితం దశాబ్దం పూర్తి చేసుకుంది. ఒక్క సారి తిరిగి చూసుకుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. తదుపరి వివాహమే అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. స్త్రీకి వివాహం చాలా ముఖ్యం అన్న విషయం తెలుసు. ప్రస్తుతానికి దాని గురించి ఆలోచించే సమయం నాకు లేదు. నేను పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆలోగా ప్రేమ పుట్టవచ్చు. లేదా తల్లిదండ్రులే మంచి వరుణ్ని చూడవచ్చ. ఏ విషయాన్నైనా ఆ సమయం వచ్చినప్పుడు బహిరంగంగానే చెబుతాను. అంత వరకూ నా ప్రేమ, పెళ్లి గురించి ఎవరేమి చెప్పినా నమ్మవద్దు. -
ఇంతకీ అయినట్టా? కానట్టా?
రెండు రోజులుగా తమిళ సినీ మీడియాలో, ఆన్లైన్ వేదికల్లో ఎక్కడ చూసినా త్రిష నామస్మరణే. వ్యాపారవేత్త, తమిళ చిత్రాల నిర్మాత అయిన వరుణ్ మణియన్‌తో త్రిషకు పెళ్ళి కుదిరిందన్న వార్తే దీనికి కారణం. నిజానికి, నటుడు రానా, త్రిషల మధ్య ప్రేమ వ్యవహారం చాలాకాలం వార్తల్లో నిలిచినా, ఆ అనుబంధం తెగిపోయిందనీ, వరుణ్‌తో ఉన్న చిరకాల స్నేహం బలపడిందనీ కోడంబాకమ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. కొన్నాళ్ళుగా డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరూ కలిసున్న ఫోటోలు కూడా నెట్లో షికార్లు చేస్తున్నాయి. అయితే, తమ మధ్య బంధాన్ని కథానాయిక త్రిష అధికారికంగా అంగీకరించనూ లేదు. అలాగని తోసిపుచ్చనూ లేదు. ఈ నేపథ్యంలో త్రిష నిశ్చితార్థం కబురు నిజమేనని అందరూ భావించారు. చివరకు ఏమనుకున్నారో ఏమో త్రిష ట్విట్టర్‌ను వేదికగా చేసుకొని నిశ్చితార్థం కబుర్లన్నీ అబద్ధమంటూ వివరణ నిచ్చారు. ‘‘నాకు నిశ్చితార్థం జరగలేదు. నిశ్చితార్థం జరిగినప్పుడు నేనే ముందుగా ఆ వార్త చెబుతాను’’ అని ఈ చెన్నై సుందరి ట్వీట్ చేశారు. అయితే, త్రిష ట్వీట్‌పై విమర్శలు కూడా వస్తున్నాయి. నటి రాయ్ లక్ష్మి అయితే త్రిష తన వ్యక్తిగత జీవిత వాస్తవాలను తోసిపుచ్చే బదులు నిజం ఒప్పుకోవాలంటూ ట్వీట్ చేశారు. ‘‘ఎవరైనా సరే తమ వ్యక్తిగత జీవితం గురించి నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. నిజాన్ని ఒప్పుకోకుండా అబద్ధాలు చెప్పడం ఎందుకు?’’ అని ఆమె అన్నారు. రాయ్ లక్ష్మి మాటలు చూస్తుంటే, త్రిషకు నిజంగా నిశ్చితార్థం అయినట్లే ఉంది. మరి, త్రిష అధికారికంగా ఆ కబురు ఎప్పుడు చెబుతారో? -
మళ్లీ పెళ్లి వదంతులు
నిప్పులేనిదే పొగ రాదంటారు. అయితే మన నాయికలు మాత్రం నిప్పు లేకుండానే పొగ పెట్టేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. నటి స్వాతి కూడా ప్రస్తుతం ఈ తరహా వదంతులతోనే విసిగిపోతోందట. తెలుగులో కలర్స్ స్వాతిగా గుర్తింపు పొందిన ఈ ముద్దు గుమ్మ తమిళంలో సుబ్రమణిపురం చిత్రంలో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా ఆ చిత్రాలు అంతగా విజయం సాధించలేదు. ప్రస్తుతం కార్తికేయన్ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్న ఈ బ్యూటీపై ఇప్పటికే పలు వదంతులు ప్రచారమయ్యాయి. తాజా గా ఒక తమిళ నటుడితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు త్వరలో అతనితో మూడు ముళ్లు వేయించుకోవడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వదంతులపై స్వాతి మండిపడుతోంది. ఇప్పటికే చాలా మందితో చాలా సార్లు పెళ్లి చేసేశారు. ఇప్పుడు మళ్లీ పెళ్లి అంటూ అసభ్య ప్రచారం చేస్తున్నారు అంటూ వాపోయింది. దీని గురించి స్వాతి మాట్లాడుతూ ఇంతకు ముందు ఒక వ్యాపార వేత్తను కలుసుకున్నానని ఆ యన్నే పెళ్లి చేసుకోనున్నానని ప్రచారం చేశారని అంది. నిజానికి తాను ఏ వ్యాపార వేత్తను కలుసుకున్నానో తనకే తెలియదంది. తాను చెన్నైలో జరి గే షూటింగ్లో పాల్గొన్నా షూటింగ్ పూర్తి అయిన తరువాత తిన్నగా బ స చేసే హోటల్ గదికి చేరుకుంటానుగానీ పార్టీలకు, ఇతర కార్యక్రమాలకు వెళ్లనని చెప్పింది. అయినా ఎవరో? ఎందుకు ఇలాం టి వదంతులు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఒక తమిళ నటుడ్ని ప్రేమిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఇందులోనూ ఎలాంటి నిజం లేదని స్వాతి స్పష్టం చేసింది.