SP Charan And Actress Sonia Agarwal Marriage Rumors Goes Viral After Photos Shared - Sakshi
Sakshi News home page

SP Charan-Sonia Agarwal: 7/G బృందావన్ కాలనీ హీరోయిన్‌తో ఎస్పీ చరణ్‌ పెళ్లి?, ఫొటో వైరల్‌

Published Sat, Jun 25 2022 1:05 PM | Last Updated on Sat, Jun 25 2022 8:42 PM

SP Charan, Actress Sonia Agarwal Marriage Rumors Goes Viral After Photos Shared - Sakshi

గాన గాంధర్వుడు, దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తన పాటలతో ఎంతోమందిని అలరించారు. తెలుగుతో పాటు ఎన్నో భారతీయ భాషల్లో ఆయన 40వేలకు పైగా పాటలు పాడారు. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని రీతిలో 2020లో ఆయన కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ కూడా మంచి గాయకుడనే విషయం తెలిసిందే. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు చరణ్.

చదవండి: ‘మీకు ఉన్నా.. తనకు ఇష్టం లేదు’.. ఆ వార్తలపై రష్మిక స్పందన

దర్శకుడిగా, నిర్మాతగా, సింగర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చరణ్ స్వరం తన తండ్రి బాలును గుర్తుచేస్తుంటుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. ఇదిలా ఉంటే చరణ్‌కు సంబంధించి ఓ షాకింగ్‌ న్యూస్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఓ హీరోయిన్‌తో చరణ్‌ మరోసారి ఏడడుగులు వెయ్యబోతున్నాడంటూ ఒక్కసారిగా తమిళ మీడియాల్లో వార్తలు గుప్పుమన్నాయి. ఈ రూమర్లకు అతడు పెట్టిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టే ఆజ్యం పోసింది. ఇటీవల చరణ్‌ 7/G బృందావన కాలనీ హీరోయిన్‌తో సోనియా అగర్వాల్‌తో క్లోజ్‌గా దిగిన ఫొటోను షేర్‌ చేశాడు.

అంతేకాదు దీనికి ‘ఏదో కొత్తగా జరగబోతుంది’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. కాసేపట్లోనే ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. దీంతో సోనియాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించడమే కాదు వీరిద్దరి పెళ్లంటూ ప్రచారం కూడా మొదలెట్టారు. ఇది కాస్తా వైరల్‌ కావడంతో చరణ్‌ మరో పోస్ట్‌ పెట్టి ఇండియన్‌ వెబ్‌సిరీస్‌, ఫిలింప్రొడక్షన్‌ అంటూ హ్యాష్‌ ట్యాగ్స్‌ జత చేశాడు. అయితే ఈ ఫొటోతో రూమర్లకు చెక్‌ పెట్టాలనుకున్న చరణ్‌ నెటిజన్ల నుంచి మరిన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. రెండో పోస్ట్‌లో చరణ్‌, సోనియాలతో పాటు నటి అంజలి మరో నటుడు కూడా ఉన్నాడు. 

చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం

అయితే ‘ముందుగా ఈ ఫొటో ఎందుకు పెట్టలేదని, సోనియాతో ఉన్న ఫొటోనే జూమ్‌ చేసి ప్రత్యేకం ఎందుకు పోస్ట్‌ చేశారు’ అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా గత కొద్ది రోజులుగా సోనియా అగర్వాల్‌ రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చరణ్‌ ఆమెతో దిగిన ఫొటోను పోస్ట్‌ చేయడంతో ఆమె ఫ్యాన్స్‌ సైతం సోనియా పెళ్లి చేసుకొబోయేది ఎస్పీబీ చరణా? అని అభిప్రాయ పడుతున్నారు. కాగా ఎస్పీ చరణ్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement