Sonia Agarwal
-
‘ఆహా’లో హారర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమాల డబ్బింగ్ విషయంలో సౌలభ్యం బాగా పెరిగిపోయింది. థియేటర్లలో కంటే డబ్ చేసిన నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు. అలా ఇప్పుడు హారర్ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఇంతకీ ఏంటా చిత్రం?(ఇదీ చదవండి: 'పుష్ప 2' కాదు.. అసలు కథ ముందుంది!)'7జీ బృందావన కాలనీ' సినిమా పేరు చెప్పగానే హీరోయిన్ సోనియా అగర్వాల్ గుర్తొస్తుంది. అయితే ఈ మూవీ తర్వాత కథానాయికగా ఏం సినిమాలు చేసిందో తెలీదు. సహాయ పాత్రల్లో అయితే అడపాదడపా కనిపిస్తోంది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా '7/జీ: ద డార్క్ స్టోరీ'. ఈ ఏడాది జూలైలో తమిళంలో రిలీజైంది.తమిళ వెర్షన్ ఆగస్టులో ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు తెలుగు వెర్షన్‌ని నేరుగా ఆహా ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు (డిసెంబరు 12) నుంచి స్ట్రీమింగ్ అవుతుందని పోస్టర్ రిలీజ్ చేశారు. కథ పరంగా రొటీన్ హారర్ మూవీ లాంటిదే. ఓ ఇంట్లోకి ఫ్యామిలీ వస్తారు. అదే ఇంట్లో దెయ్యం ఉంటుంది. ఇంతకీ ఎవరా దెయ్యం? ఏంటి సంగతి అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)Switch to '7/G - The Dark Story' 👻 🏘⏰ Stay connected on this Thursday! pic.twitter.com/Fa3NruRrh4— ahavideoin (@ahavideoIN) December 10, 2024 -
ఓటీటీలో సోనియా అగర్వాల్ హార్రర్, థ్రిల్లర్ సినిమా
హార్రర్, థ్రిల్లర్ కథా చిత్రాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి చిత్రాల నిర్మాణంపై చిన్న దర్శక నిర్మాతలు దృష్టి పెడుతున్నారని చెప్పవచ్చు. అలా ఈ ఏడాది జులైలో 7/G చిత్రం విడుదలైంది. ఇందులో సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించింది. హార్రర్ కథా చిత్రంగా దీనిని డ్రీమ్ హౌస్ పతాకంపై హరూన్ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది. 7/జీ బృందావన కాలనీ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సోనియా అగర్వాల్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించింది. ఆ సినిమా ఇమేజ్ను క్యాష్ చేసుకునేందుకే ఈ చిత్రానికి 7/G అనే టైటిల్ పెట్టారు. తమిళ్లో మిక్సిడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తమిళ్ ఆహాలో ఆగష్టు 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. అయితే, తెలుగు వర్షన్‌ను కూడా త్వరలోనే ఆహా విడుదల చేయనున్నట్లు సమాచారం. 7/జీ మూవీకి హరూన్ దర్శకత్వం వహిస్తూనే నిర్మాతగా కూడా ఉన్నారు. ఇందులో సోనియా అగర్వాల్‌తో పాటు స్మృతి వెంకట్, సిద్ధార్థ్ విపిన్ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రంలో హీరోగా నటించిన సిద్ధార్థ్ విపిన్ మ్యూజిక్ కూడా అందించడం విశేషం. సోనియా అగర్వాల్ యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. కానీ, రొటిన్ స్టోరీ కావడంతో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఆగస్ట్ 9 నుంచి ఆహా తమిళ్లో ఈ చిత్రాన్ని చూడొచ్చు. -
Sonia Agarwal: డైరెక్టర్‌తో ప్రేమవివాహం- విడాకులు.. ఇప్పటికీ సింగిల్‌గానే! (ఫోటోలు)
-
సెల్వతో పనిచేయడం ఇష్టమే.. మాజీ భర్త సినిమాపై సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు
ఉత్తరాది భామ సోనియా అగర్వాల్ గురించి సినీ వర్గాల్లో తెలియని వారుండరు. ఎందుకంటే అంత సంచలన నటి ఈ భామ. ధనుష్ సరసన కాదల్ కొండేన్, పుదుపేటఐఅట, రవికృష్ణకు జంటగా 7/జీ బృందావన్ కాలనీ వంటి విజయవంతమైన చిత్రాల్లో కథానాయికిగా నటించారు. ఈ మూడు చిత్రాలకు దర్శకుడు సెల్వరాఘవనే. ఆ సమయంలో సెల్వరాఘవన్, నటి సోనియా అగర్వాల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి దాంపత్య బంధం ఎక్కువ కాలం సాగలేదు. విభేదాలు కారణంగా విడిపోయారు. ఆ తరువాత ఎవరి వృత్తిని వారు కొనసాగిస్తున్నారు. అయితే ఆ తరువాత ఈ ఇద్దరిలో ఎవరికీ సరైన హిట్స్ లేకపోవడం గమనార్హం. కాగా ఇటీవల నటుడిగానూ అవతారం ఎత్తిన సెల్వరాఘవన్ తాజాగా ఆ వృత్తికి ఫుల్స్టాప్ పెట్టి మళ్లీ దర్శకత్వంపై దృష్టి పెట్టారు. తను ఆదిలో తెరకెక్కించి సంచలన విజయాన్ని కొట్టిన 7/జీ బృందావన్ కాలనీ చిత్రానికి సీక్వెల్ తీయనున్నారు. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. కాగా ఆయన ఇంతకు ముందు దర్శకత్వం వహించిన మరో సూపర్ హిట్ పుదుపేట్టై చిత్రానికి సీక్వెల్ చేస్తానని ప్రకటించారు. అదీ ఈ ఏడాదిలోనే మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా పుదుపేట్టై చిత్రంలో ధనుష్ సరసన నటి సోనియా అగర్వాల్, స్నేహా నటించారు. దీంతో పుదుపేట్టై– 2 చిత్రంలో మీరు నటిస్తారా? అన్న ప్రశ్నకు నటి సోనియా అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. సెల్వరాఘవన్ తో కలిసి పని చేయడానికి తనకెలాంటి సమస్య లేదన్నారు. నటన తన వృత్తి అని, పుదుపేట్టై– 2 చిత్రంలో నటించడం తనకు ఇష్టమేనన్నారు. అయితే ఆ చిత్రంలో నటించే విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. అసలు ఆ చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారో కూడా తెలియదని నటి సోనియా అగర్వాల్ పేర్కొన్నారు. -
ఆ టైటిల్ పెట్టొద్దు.. దర్శకుడికి బెదిరింపు ఫోన్ కాల్స్
తమిళసినిమా: దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన కాదల్‌కొండేన్ చిత్రం ద్వారా ధనుష్ సరసన కథానాయకిగా పరిచయమైన నటి సోనియాఅగర్వాల్. ఈ చండీగర్ భామ ముందుగా 2002లో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత సెల్వరాఘవన్ దృష్టిలో పడింది. అలా ఇక్కడ కాదల్ కొండేన్, 7జీ రెయిన్బో కాలనీ వంటి పలు చిత్రాల్లో నటించి తనకంటూ గుర్తింపును తెచ్చుకుంది. అంతే కాకుండా ఈమె దర్శకుడు సెల్వరాఘవన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరి వివాహబంధం నాలుగేళ్లకే ముగిసింది. ఆ తరువాత ఒంటరిగానే జీవిస్తున్న సోనియా అగర్వాల్ నటనపైనే పూర్తిగా దృష్టిపెట్టింది. కాగా తాజాగా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రానికి 7జీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. నటి శ్రుతి, వెంకట్ నటిస్తున్న ఇందులో సోనియాఅగర్వాల్ దెయ్యం పాత్రలో నటిస్తోంది. హారూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్ వివాదాల్లో చిక్కుకుంది. 2004లో సోనియా అగర్వాల్ నటించిన 7జీ రెయిన్బో కాలనీ చిత్రం తెలిసిందే. కాగా తాజాగా ఆమె నటిస్తున్న చిత్రానికి 7జీ అనే పేరును నిర్ణయించడంతో ఈ చిత్ర దర్శకుడికి బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయట. దీని గురించి దర్శకుడు హారూన్ మాట్లాడుతూ దెయ్యం ఇతివృత్తంతో రూపొందిస్తున్న హర్రర్ కథా చిత్రం ఇదన్నారు. 7జీ అనే టైటిల్‌ను ఎవరు రిజిస్టర్ చేయకపోవడంతో తమ చిత్రానికి ఆ టైటిల్ నిర్ణయించినట్లు తెలిపారు. 7జీ అనే ఇంట్లో షూటింగ్ నిర్వహించడం, కథకు నప్పడంతో ఆ టైటిల్‌ను ఖరారు చేసినట్లు చెప్పారు. అయితే తమ చిత్రానికి ఈ పేరు పెట్టకూడదని కొందరి నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని చెప్పారు. అయితే తాము టైటిల్‌ను మార్చే ప్రసక్తే లేదని, ఈ వ్యవహారాన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని అంటున్నారు. -
అలాంటి వ్యక్తి నా జీవితంలో లేనట్లే.. ముఖం కూడా చూడను: సోనియా అగర్వాల్
సోనియా అగర్వాల్ టాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలే అయినా కుర్రకారులో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. 2004లో విడుదలైన '7/జీ బృందావన కాలనీ' అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం కుమారుడు రవికృష్ణ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో సోనియా అగర్వాల్ హీరోయిన్ నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తర్వాత ఇక్కడ అంతగా అవకాశాలు రాకపోవడంతో తమిళ్, కన్నడ సినిమాలపై ఫోకస్ పెట్టి అక్కడ మంచి విజయాలే అందుకుంది. తాజాగ '7/జీ బృందావనీ కాలనీ' సీక్వెల్ తీస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: చంద్రయాన్ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ హీరోయిన్) తమిళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలోనే హీరో ధనుష్ అన్నయ్య అయిన దర్శకుడు సెల్వ రాఘవన్‌ను 2006లో వివాహమాడి ఆపై 2010లో విడాకులు తీసుకుంది. తర్వాత సెల్వరాఘవన్ 2011లో మళ్లీ పెళ్లి చేసుకున్నా.. సోనియా ఒంటరిగానే జీవిస్తోంది. తాజాగ ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను ఇలా పంచుకున్నారు. 'దర్శకుడిగా సెల్వరాఘవన్ మొండి పట్టుదలగలవాడు. కానీ వ్యక్తిగత జీవితంలో అలాంటి వ్యక్తి కాదు. చాలా ప్రశాంతమైన వ్యక్తి, ఎల్లప్పుడూ బిజీగా ఉంటారు. రచన వగైరాలతో ఎప్పుడూ తనదైన లోకంలో ఉండేవాడు. కానీ తనతో వైవాహిక జీవితం గురించి ఇక మాట్లాడే ప్రసక్తే లేదు. మేం ఎందుకు విడిపోయామో అతనికి, నాకు తెలుసు. ప్రస్తుతం ఆయన వెళ్తున్న దారిలో ఎంత సంతోషంగా ఉన్నారో.. నేను కూడా అంతే సంతోషంగా ఉన్నాను.' అని సోనియా అన్నారు. జీవితంలో భార్యాభర్తలుగా కలిసి ఉన్నవాళ్లు విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా ఎలా ఉంటున్నారో తనకు అర్థం కావడం లేదని తెలిపింది. తన వరకు అయితే అది సాధ్యం కాదని చెప్పింది. అలాంటి పని మాత్రం చేయలేనని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అతను తన కంటికి మళ్లీ స్నేహితుడిగా కనిపించడని పేర్కొంది. ప్రేమ చనిపోయిన తర్వాత స్నేహితుడిలా చూడలేమని తెలిపింది. జీవితంలో మళ్లీ తన ముఖం చూడనని, అలాంటి వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ లేనట్లేనని సోనియా అగర్వాల్ అన్నారు. పెళ్లి తర్వాత తన సినిమా కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదని సోనియా పేర్కొంది. (ఇదీ చదవండి: రాజమౌళి- మహేశ్‌బాబు సినిమాపై అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది) పెళ్లి జరిగిన సమయం నుంచే నటించకూడదని సెల్వ కుటుంబం అభ్యంతరం చెప్పిందని ఆమె గుర్తుచేసుకుంది. అందుకే ఆ సమయంలో బ్రేక్ తీసుకున్నానని తెలిపింది. అయితే 2010లో భర్త నుంచి విడిపోయిన తర్వాత, తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్లు సోనియా చెప్పింది. ఆ తర్వాత ఆమె కన్నడ,తమిళ్లో పలు సినిమాలతో బిజీగానే ఉంటుంది. ఇప్పుడు '7/జీ బృందావన కాలనీ' సీక్వెల్‌తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆమె ప్రకటించింది -
సూపర్ హిట్ లవ్ స్టోరీకి సీక్వెల్ రెడీ.. హీరోయిన్ ఎవరంటే..?
కోలీవుడ్‌లో 'తుళ్లువదో ఇళమై' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన సెల్వరాఘవన్ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత కాదల్‌కొండేన్, 7జీ రెయిన్బో కాలనీ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నటుడిగా బిజీ అవుతున్న ఈయన మళ్లీ దర్శకత్వం వహించడానికి సిద్ధం అయ్యారు. ఈయన ఇంతకుముందు కోలీవుడ్‌లో దర్శకత్వం వహించిన సక్సెస్ఫుల్ చిత్రం 7జీ రెయిన్బో కాలనీ తెలుగులో 7/G బృందావన్ కాలనీగా విడుదలైంది. (ఇదీ చదవండి: చిత్తూరు నుంచి బాలీవుడ్‌నే ఏలిన అంకుశం రామిరెడ్డి ఎలా మరణించారో తెలుసా?) తెలుగు వెండితెరపై ఎన్నో సూపర్ హిట్ లవ్ స్టోరీస్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. అందులో 7/G బృందావన్ కాలనీ ఒకటి. రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ఈ మూవీ 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అప్పట్లో ఈ సినిమాకు యువతలో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్‌కు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌ను తెరకెక్కించేందకు ప్లాన్ చేస్తున్నారు సెల్వరాఘవన్. తొలి భాగంలో నిర్మాత ఏఎం.రత్నం వారసుడు రవికృష్ణ కథానాయకుడిగా పరిచయం అయ్యారు. తరువాత ఆయన నటించిన పలు చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడంతో నటనకు దూరంగా ఉంటున్నారు. అలాంటిది 7/G బృందావన్ కాలనీ చిత్రం ద్వారా రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నాడు. (ఇదీ చదవండి: BRO Twitter Review ‘బ్రో’ మూవీ ట్విటర్ రివ్యూ) కాగా ఇందులో నటించే కథానాయకి పాత్ర కోసం నటి అదితి శంకర్, ఇవనాలలో ఒకరిని నటింపజేయడానికి దర్శకుడు సెల్వరాఘవన్ చర్చలు జరుపుతున్నట్లు టాక్. వీరిలో ఆ లక్కీ నటి ఎవరనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. అదితిశంకర్ నటించిన మావీరన్ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అధర్వ తమ్ముడు ఆకాశ్ మురళీకి జంటగా నటిస్తున్నారు. ఇకపోతే లవ్ టుడే చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న నటి ఇవనా నటుడు హరీశ్ కల్యాణ్‌కు జంటగా నటించిన ఎల్జీఎం చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. కాగా 7/G బృందావన్ కాలనీ చిత్రానికి సీక్వెల్ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
సంచలనం సృష్టించిన..7/G బృందావన్ కాలనీ సీక్వెల్
-
ఆ సమయంలో డైరెక్టర్‌తో ప్రేమ పెళ్లి.. ఆపై విడాకులు : హీరోయిన్
పెళ్లి తర్వాత సినిమాలు మానేసిన హీరోయిన్లు ఎంతోమంది. అలాంటి హీరోయినే సోనియా అగర్వాల్ కూడా. తను దేనికోసమైతే, తన స్టార్‌డమ్‌ను దూరం చేసుకుందో ఆ బంధమే విడిపోతే, అందరిలా చింతించలేదు. పోగొట్టుకున్న స్టార్‌డమ్‌ను సాధించుకునే ప్రయత్నం చేసింది. ఫలితంగా వరుస సినిమాలు, సిరీస్‌లతో దూసుకుపోతోంది. చండీగఢ్‌లో పుట్టిన సోనియా మాతృ భాష పంజాబీ. స్కూల్‌కెళ్లే రోజుల్లోనే సీరియల్స్‌లో నటించి, హీరోయిన్ కావాలనుకుంది. ‘7/జీ బృందావన్ కాలనీ’ చిత్రంతో తెలుగు నాట అనితగా గుర్తిండిపోయిన సోనియా, నిజానికి 2000లోనే ‘నీ ప్రేమకై’, ‘ధమ్’ చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కానీ, రెండూ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. దీంతో తమిళ ఇండస్ట్రీకి మకాం మార్చింది. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ‘కాదల్ కొండేన్’తో మొదటి హిట్ కొట్టడమే కాదు, ‘ఉత్తమ నూతన నటిగా ఇంటర్నేషనల్ తమిళ్ ఫిల్మ్ పురస్కారం’ కూడా అందుకుంది. తమిళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలోనే దర్శకుడు సెల్వ రాఘవన్‌ను వివాహమాడి సినిమాలకు స్వస్తి పలికింది. అయితే, విభేదాల కారణంగా భర్త నుంచి విడిపోయింది. తర్వాత, తిరిగి తన అభినయ కళతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. హీరోయిన్‌గానే కాకుండా తల్లి, అక్క, సహాయ పాత్రలకు ప్రిఫరెన్స్ ఇస్తూ వరుసగా ‘డిటెక్టివ్ సత్యభామ’, ‘టెంపర్’, ‘శాసనసభ’ సినిమాల్లో నటించింది. మొదట్లో కెరీర్ కాస్త తడబడ్డా, ప్రస్తుతం పలు సినిమా, సిరీస్ అవకాశాలతో బిజీగా మారింది. ఇప్పుడు డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లో ఉన్న ‘ఫాల్’ వెబ్ సిరీస్‌తో అలరిస్తోంది. గతం అనేది నేర్చుకోవడానికే కానీ, దానితో పాటు కరిగిపోవడానికి కాదు. అందుకే, గతం నుంచి ప్రతి ఒక్కరు ఏదో ఒక్కటైనా నేర్చుకుంటారు. – సోనియా అగర్వాల్ -
హీరోయిన్‌తో విడాకులు..ఒంటరిగా ఉండమని సలహా ఇచ్చిన ధనుష్
సినిమా ఇండస్ట్రీలో ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడాకులు తీసుకుంటారు. ఒకప్పుడు బెస్ట్ కపుల్ అనిపించుకున్న వారే ఆ తర్వాత విడాకులు తీసుకొని షాక్ ఇచ్చిన జంటలు చాలానే ఉన్నాయి. వారిలో తమిళ స్టార్ డైరెక్టర్ సెల్వరాఘవన్- హీరోయిన్ సోనియా అగర్వాల్ కూడా ఉన్నారు. 7/G బృందావన్ కాలనీతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ సోనియా అగర్వాల్. ఆ సినిమా సమయంలోనే డైరెక్టర్ సెల్వరాఘవన్‌తో ప్రేమలో పడిన ఆమె హీరోయిన్గా పీక్ టైంలో ఉండగానే అతడిని 2006లో పెళ్లాడింది. అయితే మనస్పర్థల కారణంగా వీరు 2010లో విడాకులు తీసుకున్నారు. తాజాగా ఈ విషయంపై సెల్వ రాఘవన్ ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ''కొన్ని కారణాల వల్ల నేను, సోనియా విడాకులు తీసుకున్నాం. అప్పుడు నా తమ్ముడు ధనుష్ ఒక మాట అన్నాడు.. దీని గురించి త్వరగా బయటపడు. దేవుడు నీకు సరైన అవకాశం ఇస్తాడు. అప్పుటిదాకా ఒంటరిగా ఉండు అని. నిజంగానే విడాకుల తర్వాత చాలా మానసిక క్షోభకు గురయ్యాను. కానీ సరైన సమయంలో నా జీవితంలోకి గీతాంజలి వచ్చింది. ఆమె వల్ల నా జీవితంలో పెను మార్పు చోటుచేసుకుంది. ఇప్పుడు ఇద్దరం సంతోషంగా ఉన్నాం'' అంటూ చెప్పుకొచ్చారు. సెల్వ రాఘవన్ 2011 లో గీతాంజలి రామన్ ను రెండో వివాహం చేసుకోగా సోనియా మాత్రం సింగిల్‌గానే ఉంటోంది. -
సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలో హార్రర్ చిత్రం
హార్రర్, థ్రిల్లర్ కథా చిత్రాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి చిత్రాల నిర్మాణంపై చిన్న దర్శక నిర్మాతలు దృష్టి పెడుతున్నారని చెప్పవచ్చు. అలా తాజాగా నటి స్మతి వెంకట్ సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హార్రర్ కథా చిత్రం శనివారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. డ్రీమ్ హౌస్ పతాకంపై ఎన్.కారుణ్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఇది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ నిజ జీవితంలో మన కళ్లముందు జరిగే కొన్ని అమానుష సంఘటనలు నిజంగా ఎలా జరుగుతాయా మనకి తెలియదన్నారు. అలాంటి ఘటనలతో ఈ చిత్రాన్ని రపొందిస్తున్నట్లు చెప్పారు. ఇది సాధారణ హార్రర్ చిత్రాలకు భిన్నంగా థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టే విధంగా ఉంటుందన్నారు. నటి స్మతి వెంకట్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇందులో కథానాయకుడిగా రోషన్ నటిస్తున్నారని, సంగీత దర్శకుడు సిద్ధార్త్ విపిన్, దర్శకుడు సుబ్రమణియం, శివ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు చెప్పారు. చిత్ర షటింగ్ను చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్ర టైటిల్‌ను, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. కాగా దీనికి కేఎం రయాన్ సంగీతాన్ని, విజయ్‌కుమార్ కృష్ణ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. స్మృతి వెంకట్, సోనియా అగర్వాల్ కొత్త చిత్రం ప్రారంభం -
'7జీ బృందావన కాలనీ' సీక్వెల్‌కు రెడీ
తమిళసినిమా: నిర్మాత ఎంఎం.రత్నం నిర్మించిన చిత్రం 7జీ రెయిన్బో కాలనీలో ఆయన కుమారుడు రవికృష్ణను కథానాయకుడిగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సోనియా అగర్వాల్ నాయకిగా నటించారు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2004లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోన 7జీ బృందావన్ కాలనీ పేరుతో అనువాదమై సక్సెస్ అయ్యింది. యువన్‌శంకర్ రాజా సంగీతం అందింన ఇందులోని పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. ఆ తర్వాత రవికృష్ణ కొన్ని చిత్రాలు నటించినా అవేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. దీంతో ఆయన చాలాకాలం నటనకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో 7జీ రెయిన్బో కాలనీ చిత్రానికి సీక్వెల్‌ను నిర్మించాలని ఆలోచన ఉన్నట్లు నిర్మాత ఎంఎం.రత్నం ఇటీవల ఒక వేదికపై పేర్కొన్నారు. అయితే ఇందులో నటించే హీరో హీరోయిన్లు ఎవరు, దర్శకుడు ఎవరు అనేది ఆయన ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం ఆయన తెలుగులో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరిహర వీరమల్లు అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బహుశా ఆ చిత్రం పూర్తయిన తర్వాత 7జీ రెయిన్బో కాలనీ సీక్వెల్‌పై దృష్టి పెడతారేమో చూడాలి. -
హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న అంజలి 'ఫాల్' వెబ్‌సిరీస్
తమిళసినిమా: నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ఫాల్. ఎస్పీబీ చరణ్, నటి సోనియాఅగర్వాల్, సంతోష్ ప్రతాప్, నమిత కృష్ణమూర్తి, పూర్ణిమా భాగ్యరాజ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ వెబ్ సీరీస్‌ను డిస్నీ హాట్‌స్టార్ సంస్థ నిర్మించింది. దీని ద్వారా ప్రముఖ ఛాయాగ్రాహకుడు సిద్ధార్థ్ రామస్వామి దర్శకుడుగా పరిచయమయ్యారు. ఈ వెబ్ సిరీస్ శుక్రవారం నుంచి డిస్నీ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గురువారం రాత్రి చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో డిస్నీ హాట్‌స్టార్ సంస్థ నిర్వాహకులు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న నటి అంజలి మాట్లాడుతూ తాను ఇందులో దివ్య అనే పాత్రలో నటించానని చెప్పారు. ఇది రొటీన్ పాత్రలకు భిన్నంగా, కాస్త చాలెంజింగ్‌గా ఉంటుందన్నారు. థ్రిల్లర్ కథా చిత్రాలను ఇష్టపడే వారికి ఇది కచ్చితంగా నచ్చుతుందన్నారు. ఇందులో నటించిన నటినటీలందరికీ ప్రాముఖ్యత ఉంటుందన్నారు. పూరి్ణమా భాగ్యరాజ్‌తో కలిసి నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు. ఆమె మంచి కథలను చెప్పేవారని, తన లవ్‌స్టోరీ కూడా దాచుకోకుండా చెప్పారన్నారు. డిస్నీ హాట్‌స్టార్ సంస్థలో తాను నటించిన రెండవ వెబ్ సిరీస్ ఇది అని చెప్పారు. చాలా కంఫర్టబుల్‌గా చూసుకునే సంస్థ ఇది అని తెలిపారు. దర్శకుడు సిద్ధార్థ రామస్వామి గురించి చెప్పాలంటే ఆయన చాలా కూల్ పర్సన్ అని పేర్కొన్నారు. తనే చాయాగ్రాహకుడు కావడంతో సన్నివేశాల చిత్రీకరణలో చాలా పర్ఫెక్ట్గా ఉండేవారన్నారు. టెక్నికల్‌గా కూడా తమకు నటించడం చాలా ఈజీ అయ్యిందన్నారు. వన్ మోర్ టేక్ అన్నదే చేసేవారు కాదని చెప్పారు. ఆయన దర్శకత్వంలో పనిచేయడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. -
7/G బృందావన్ కాలనీ హీరోయిన్‌తో ఎస్పీ చరణ్ పెళ్లా?, ఫొటో వైరల్
గాన గాంధర్వుడు, దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తన పాటలతో ఎంతోమందిని అలరించారు. తెలుగుతో పాటు ఎన్నో భారతీయ భాషల్లో ఆయన 40వేలకు పైగా పాటలు పాడారు. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని రీతిలో 2020లో ఆయన కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక ఆయన తనయుడు ఎస్పీ చరణ్ కూడా మంచి గాయకుడనే విషయం తెలిసిందే. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు చరణ్. చదవండి: ‘మీకు ఉన్నా.. తనకు ఇష్టం లేదు’.. ఆ వార్తలపై రష్మిక స్పందన దర్శకుడిగా, నిర్మాతగా, సింగర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చరణ్ స్వరం తన తండ్రి బాలును గుర్తుచేస్తుంటుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. ఇదిలా ఉంటే చరణ్‌కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఓ హీరోయిన్‌తో చరణ్ మరోసారి ఏడడుగులు వెయ్యబోతున్నాడంటూ ఒక్కసారిగా తమిళ మీడియాల్లో వార్తలు గుప్పుమన్నాయి. ఈ రూమర్లకు అతడు పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్టే ఆజ్యం పోసింది. ఇటీవల చరణ్ 7/G బృందావన కాలనీ హీరోయిన్‌తో సోనియా అగర్వాల్‌తో క్లోజ్‌గా దిగిన ఫొటోను షేర్ చేశాడు. అంతేకాదు దీనికి ‘ఏదో కొత్తగా జరగబోతుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాసేపట్లోనే ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో సోనియాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించడమే కాదు వీరిద్దరి పెళ్లంటూ ప్రచారం కూడా మొదలెట్టారు. ఇది కాస్తా వైరల్ కావడంతో చరణ్ మరో పోస్ట్ పెట్టి ఇండియన్ వెబ్‌సిరీస్, ఫిలింప్రొడక్షన్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ జత చేశాడు. అయితే ఈ ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టాలనుకున్న చరణ్ నెటిజన్ల నుంచి మరిన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. రెండో పోస్ట్‌లో చరణ్, సోనియాలతో పాటు నటి అంజలి మరో నటుడు కూడా ఉన్నాడు. చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం అయితే ‘ముందుగా ఈ ఫొటో ఎందుకు పెట్టలేదని, సోనియాతో ఉన్న ఫొటోనే జూమ్ చేసి ప్రత్యేకం ఎందుకు పోస్ట్ చేశారు’ అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా గత కొద్ది రోజులుగా సోనియా అగర్వాల్ రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చరణ్ ఆమెతో దిగిన ఫొటోను పోస్ట్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ సైతం సోనియా పెళ్లి చేసుకొబోయేది ఎస్పీబీ చరణా? అని అభిప్రాయ పడుతున్నారు. కాగా ఎస్పీ చరణ్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) View this post on Instagram A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) -
డిటెక్టివ్ సత్యభామగా హీరోయిన్ సోనియా అగర్వాల్
Sonia Aggarwal Detective Sathyabhama All Set To Release: సోనియా అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘డిటెక్టివ్ సత్యభామ’. నవనీత్ చారి దర్శకత్వంలో శ్రీశైలం పోలెమాని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానున్న సందర్భంగా ట్రైలర్, పాటలను విడుదల చేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో నవనీత్ చారి మాట్లాడుతూ ‘‘ఎవరూ ఊహించని మలుపులు, ఆశ్చర్యకర విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అన్నారు. ‘‘దాదాపు 500 థియేటర్స్‌లో మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు శ్రీశైలం పోలెమాని. -
సోనియా అగర్వాల్ 'డిటెక్టివ్ సత్యభామ'గా వచ్చేది అప్పుడే..
Sonia Agarwal Movie Detective Satyabhama Release Date Out: ‘7/జీ బృందావన కాలనీ’ సినిమా ఫేమ్ సోనియా అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘డిటెక్టివ్ సత్యభామ’. నవనీత్ చారి దర్శకత్వం వహించారు. శ్రీశైలం పోలెమోని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోనియా అగర్వాల్ మాట్లాడుతూ ‘‘7/జి బృందావన కాలని’ తర్వాత నాకు అంతగా గొప్పగా పేరు తెచ్చిన సినిమాలు లేవు. కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో అంత క్రేజ్ తెచ్చే మూవీ ‘డిటెక్టివ్ సత్యభామ’ అవుతుంది. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూశాక అంత నమ్మకం వచ్చింది’’ అన్నారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. నాలుగు పాటలతో పాటు యాక్షన్స్ సీన్స్ ఉంటాయి’’ అన్నారు డైరెక్టర్ నవనీత్ చారి. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా నిర్మించాం’’ అని శ్రీశైలం పోలెమోని అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అంతం చేయడానికి సత్యభామ చేసిన పోరాటమే ఈ చిత్రం. ఇదివరకు విడుదలైన సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇదీ చదవండి: ‘డిటెక్టివ్ సత్యభామ’గా సోనియా అగర్వాల్, ట్రైలర్, ఫస్ట్‌లుక్ రిలీజ్ -
‘డిటెక్టివ్ సత్యభామ’గా సోనియా అగర్వాల్, ట్రైలర్, ఫస్ట్‌లుక్ రిలీజ్
సోనియా అగర్వాల్, సాయి పంపన, రవి వర్మ, సునీత పాండే ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘డిటెక్టివ్ సత్యభామ’. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అంతం చేయడానికి సత్యభామ చేసిన పోరాటమే ఈ చిత్రం. నవనీత్ చారి దర్శకత్వంలో శ్రీశైలం పోలెమోని నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రం ట్రైలర్, పోస్టర్‌ను విడుదల చేసిన తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ.. ‘‘మహిళలపై జరుగుతున్న ఆత్యాచారాల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. నవనీత్ మల్టీ టాలెంటెడ్. సిరాజ్గారి ద్వారా ఈ సినిమా విడుదల కానుండటం నిర్మాతలకు హెల్ప్ అవుతుంది’’ అన్నారు. ‘‘చాలా తక్కువ సమయంలో అనుకున్న బడ్జెట్లో నవనీత్గారు ఈ సినిమాను పూర్తి చేశారు. త్వరలోనే సినిమా విడుదల వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు శ్రీశైలం. ‘‘సోనీ అగర్వాల్ వంటి ఓ స్టార్ హీరోయిన్ ఈ సినిమా కథను ఓ సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేయడాన్ని బట్టి కథలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు నవనీత్. ఈ కార్యక్రమంలో మాటల రచయిత బాషా శ్రీ, టీఎఫ్‌సీసీ డైరెక్టర్స్ వింగ్ జాయింట్ సెక్రటరీ సిరాజ్ పాల్గొన్నారు. -
మరోసారి పెళ్లికి సిద్ధమవుతున్న 7/G బృందావన కాలని హీరోయిన్..!
‘7/G బృందావన కాలని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సోనియా అగర్వాల్. తెలుగులో ఆమె హీరోయిన్గా కనిపించింది ఒక్క సినిమానే అయినా ఇక్కడ బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో ఆమె అమాయకంగా, క్యూట్ క్యూట్‌గా నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన ఆమె కొద్ది రోజులకు తెరపై కనుమరుగైంది. తనను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన తమిళ డైరెక్టర్ సెల్వరాఘవన్‌ను 2006లో ప్రేమ వివాహం చేసుకుంది. చదవండి: ప్రముఖ యూట్యూబ్ స్టార్ మృతి, దీప్తి సునైనా దిగ్భ్రాంతి ఈ క్రమంలో వ్యక్తిగత ల కారణాలతో 2010లో భర్తకు విడాకులు ఇచ్చింది సోనియా. విడాకుల తర్వాత తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సోనియా జూనియర్ ఎన్టీఆర్ ‘టెంపర్’ మూవీలో తళుక్కుమ్మంది. ఇక అప్పటి నుంచి సినిమాల్లో క్యారెక్టర్ అర్టిస్టుగా, సహా నటిగా చేస్తూ పలు టీవీ షోలు చేస్తూ వస్తోంది. విడాకుల అనంతరం ఒంటరిగా ఉంటున్న ఆమె తాజాగా రెండో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఓ డైరెక్టర్‌తో సోనియా సన్నిహితం ఉంటుందట. ఈ క్రమంలో అతడినే ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ ఫిలిం దూనియా గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: సోషల్ మీడియాలో చేదు అనుభవం, బోల్డ్‌గా స్పందించిన హీరోయిన్ గతంలో కూడా సోనియా రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సోనియా రెండో పెళ్లి వ్యవహరం తెరపైకి వచ్చింది. ఆమె రెండో పెళ్లికి సిద్దమైందని, త్వరలోనే ఓ డైరెక్టర్‌ను వివాహం చేసుకొనుందంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై నటి సోనియా అగర్వాల్ స్పందించే వరకు వేచి చూడాలి. కాగా సోనియా తాజాగా నటించిన ద్విభాషా చిత్రం ‘గ్రాండ్మా’ త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. -
డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదు : నటి సోనియా
Bengaluru Drug Case : కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి దుమారం రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో హీరోయిన్స్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ అరెస్ట్ అయి ఇటీవలె బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నటి, మోడల్ సోనియా అగర్వాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమె ప్రస్తుతం కర్ణాటకలో కాస్మోటిక్ వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. తాజాగా బెంగుళూరులో ఏకకాలంలో జరిపిన సోదాల్లో సోనియాతో పాటు మరో వ్యాపారవేత్త భరత్, డీజే వచన్ చిన్పప్ప ఇళ్లలో డ్రగ్స్ బయటపడ్డాయి. దీంతో వీరందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరికి వీరికి నైజీరియా డ్రగ్స్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా డ్రగ్స్ వ్యవహారంలో నటి సోనియా అగర్వాల్ అరెస్ట్ కాగా కొన్ని మీడియా సంస్థలు అత్యత్సాహంతో ఆమెకు బుదులుగా సినీ నటి సోనియా అగర్వాల్ ఫోటోను ప్రచురించాయి. పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో భయపడి ఆమె బాత్రూంలో దాక్కుందని, అయినా లాక్కొచ్చి పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో అంతా 7/జీ బృందావన కాలనీ ఫేమ్ సోనియానే అనుకున్నారు. కానీ సోనియా ఆ వార్తలను కొట్టిపారేశారు. ఈ కేసుతో తనకు ఏ సంబంధం లేదని, అసలు పోలీసులు రైడ్ చేసింది తన ఇంట్లో కాదని, ఆ సమయంలో తాను కేరళలో షూటింగ్లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన గురించి తప్పుడు వార్తలు ప్రచురించిన మీడియా సంస్థలు, వెబ్సైట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. చదవండి : Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన చార్మీ ‘ఇద్దరు పిల్లల తల్లిని.. విచారణకు హాజరుకాలేను’ -
ప్రేమను వెతుక్కుంటూ నిత్యానంద
సినిమా మీద ఇంట్రెస్ట్ తెప్పించడానికి, ఆడియన్స్‌ను థియేటర్ వరకూ రప్పించడానికి కొన్నిసార్లు సినిమా టైటిల్ చాలు. ఆ ఫార్ములాను గట్టిగా నమ్ముతున్నట్టున్నారు తమిళ దర్శకుడు ఆదిక్. ఆల్రెడీ తన గత సినిమాలకు ‘త్రిష ఇల్లన నయనతార (తెలుగులో ‘త్రిషా లేదా నయనతార’) అఅఅ (అన్బానవన్ అసరదావన్ అడంగాదవన్) అని పెట్టారు. ప్రస్తుతం సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ హీరోగా చేస్తోన్న సినిమాకు ఆయన పెట్టిన టైటిల్ ‘కాదలై తేడి నిత్యానంద’ (అంటే ప్రేమను వెతుకుతూ నిత్యానంద). ఈ పాటికే మీకు అర్థం అయ్యింటుంది ఎంత క్రేజీ టైటిల్‌ని తన సినిమాకు పెట్టారో. పోస్టర్ కూడా డిఫరెంట్‌గా ఉంది కదూ. సోనియా అగర్వాల్, అమైరా దస్తూర్, సంచితా శెట్టి హీరోయిన్లుగా ఈ సినిమాను త్రీడీలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రేమను వెతుక్కునే అమర ప్రేమికుడిగా జీవీ ప్రకాశ్ కనిపిస్తారని ఊహించవచ్చు. -
డిసెంబర్ 2న తిరుట్టుపయలే–2
తమిళసినిమా: బాబిసింహా, ప్రసన్నా, అమలాపాల్ నటించిన చిత్రం తిరుట్టుపయలే–2. తిరుట్టుపయలే మొదటి భాగాన్ని నిర్మించిన ఏజీఎస్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ కల్పాత్తి అగోరమే తిరుట్టుపయలే–2కు కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. జీవన్, అబ్బాస్, సోనియా అగర్వాల్ కలిసి నటించిన తిరుట్టుపయలే చిత్రం తొలి భాగం 2006 ఏప్రిల్‌లో విడుదలైంది. సాధారణంగా ఒక చిత్రం మొదటి భాగం విడుదలైన ఒకటి రెండు సంవత్సరాల్లోనే రెండో భాగం కూడా విడుదల చేస్తారు. అయితే తిరుట్టుపయలే చిత్రం 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండో భాగం విడుదలకు సిద్ధమవుతుండడం విశేషం. ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయాలని నిర్ణయించినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. -
ఎవనవన్ అంటున్న సోనియా అగర్వాల్
నటి సోనియా అగర్వాల్ చాలా గ్యాప్ తరువాత మళ్లీ నటిగా బిజీ అవుతున్నారు.ఈమె నటించిన చాయ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఎవనవన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమెతో కలిసి నటుడు అశోకన్ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. డ్రీమ్ ఆన్ ఫ్రేమ్స్ పతాకంపై తంగముత్తు, పీకే.సుందర్, కరుణ, నటరాజ్ కలిసి నిర్మిస్తున్న ఇందులో అఖిల్సంతోష్, మురుగాట్రుపడై చారణ్, సాక్షీశివ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. దీనికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని జే.నట్టికుమార్ నిర్వహిస్తున్నారు. అమెరికాలో సినిమా కోర్స్‌ను చదివిన ఈయన.. మోహమున్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నిర్మాత జానకిరామన్ కొడుకు. ఇంతకు ముందు రాష్ట్రప్రభుత్వం నుంచి ఉత్తమ చిత్ర అవార్డును అందుకున్న మెయ్పొరుళ్, పనితుళి చిత్రాలకు నట్టికుమార్ దర్శకత్వం వహించారన్నది గమనార్హం. తాజా చిత్రం ఎవనవన్ గురించి దర్శకుడు తెలుపుతూ నేటి యువత తాము చేసే పనుల్లో చాలా అవగాహనతో ఉంటున్నారన్నారు. వాటి భవిష్యత్తు పరిణామాల గురించి ముందుగానే ఊహిస్తున్నారని, అయితే కొందరు మాత్రం చేసే పనుల్లో తప్పులు దొర్లితే అదేమంత పెద్ద తప్పు కాదులే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అలాంటి చిన్న చిన్న తప్పులే చివరికి ఎలాంటి సమస్యలను తెచ్చిపెడుతున్నాయన్నది ఆవి ష్కరించే చిత్రంగా ఎవనవన్ చిత్రం ఉంటుందని తెలిపారు. ఇంతకు ముందు తాను తెరకెక్కించిన పిణితుళి చిత్ర షూటింగ్‌ను అధిక భాగం అమెరికాలో చిత్రీకరించినట్లు చెప్పారు.అయితే ఈ చిత్రాన్ని చెన్నై, ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు వెల్లడించారు. పాటలను మాత్రం మలేషియాలో షూట్ చేసినట్లు చెప్పారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని బధవారం సాయంత్రం స్థానిక మైలాపూర్‌లోని రష్యన్ కల్చరల్ సెంటర్ ఆవరణలో నిర్వహించారు. -
ఆమెకి అతనే విలన్!
‘మిస్సమ్మ’, ‘అదిరిందయ్యా చంద్రం’,‘మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి’ తదితర చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు శివాజీ. కొంత విరామం తర్వాత ఆయన అంగీకరించిన చిత్రం ‘షీ’. ఈ చిత్రంలో శివాజీ నెగటివ్ రోల్ చేయడం విశేషం. శ్వేతామీనన్, మహత్ రాఘవేంద్ర, చేతనా ఉత్తేజ్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వర్ రావు(కన్నారావ్) ఈ చిత్రం నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం ఈ చిత్రం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 15కు ఈ షెడ్యూల్ పూర్తి చేస్తాం. దీంతో టాకీ పార్ట్ పూర్తవుతుంది. పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంటుంది. ఓ పాటను బెల్జియంలో చిత్రీకరిస్తాం. తమిళ హీరో శింబు, సంగీత దర్శకుడు అనిరుధ్ ఇందులో ఓ పాట పాడుతున్నారు’’ అని తెలిపారు. ‘‘కొంచెం గ్యాప్ తరువాత మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాను. ఇందులో నెగటివ్ రోల్‌తో పాటు మరో రెండు చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్ చేస్తున్నా’’ అని శివాజీ అన్నారు. దర్శకుడు రమేష్, శ్వేతామీనన్, దీక్షా పంత్ తదితరులు కూడా మాట్లాడారు. -
ఆమె నిరీక్షణ
‘‘మన సంస్కృతి, సంప్రదాయాలకు చాలా విలువలున్నాయి. వాటిని ఎలా కాపాడుకోవాలి? అనే అంశానికి భయాన్ని జోడించి తెరకెక్కిస్తున్న స్వచ్ఛమైన ప్రేమకథ ఇది’’ అని దర్శకుడు పర్స రమేష్ మహేంద్ర అన్నారు. శ్వేతామీనన్, మహత్ రాఘవేంద్ర, చేతన ఉత్తేజ్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వర్‌రావ్(కన్నారావ్) నిర్మిస్తున్న చిత్రం ‘షీ’. ‘ఈజ్ వెయిటింగ్’ అనేది ఉపశీర్షిక. ‘‘ఈ చిత్రం ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. మార్చిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. ‘‘ప్రస్తుతం పాట చిత్రీకరణ జరుగుతోంది. పంచభూతాల నేపథ్యంలో ఈ పాట ఉంటుంది. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెస్తుంది’’ అని చేతన ఉత్తేజ్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: బోలే, కెమెరా: అనిత్, లైన్ ప్రొడ్యూసర్: గట్టు విజయ్ గౌడ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బసంత్ రెడ్డి. -
ఆయన భార్యకు ఇష్టమైతే..నటించడానికి ఓకే
జీవితంలో అనుభవాలకు మించిన పాఠాలు ఉండవని చెప్పడం అతిశయోక్తి కాకపోవచ్చు. అలా పరిణితి పొందిన నటి సోనియా అగర్వాల్. ఆది నుంచి విజయపరంపరను కొనసాగించిన ఈ ఉత్తరాది బ్యూటీ దర్శకు డు సెల్వరాఘవన్‌ను ప్రేమించి పెళ్లాడిన తరువాత జీవితంలో కాస్త తడబడ్డారు. అందుకు మూల్యం భారీగానే చెల్లించుకోవాల్సి వచ్చింది. మనస్పర్థలు, పెళ్లి విడాకులు సోనియాను బాధించాయనే చెప్పాలి. మళ్లీ నటనపై దృష్టి సారించిన సోనియా అగర్వాల్‌కు ఇటీవల హాస్య నటుడు వివేక్ సరసన నటించిన పాలక్కాట్టు మాధవన్ చిత్రంలో నటనకు మంచి గుర్తింపే లభించింది. ఈ సందర్భంగా ఈ భామ తో చిన్న భేటీ ప్రశ్న: డ్రీమ్ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న మీరు నటి సదా ఇప్పుడు హాస్యనటుల సరసన నటిస్తున్నారే? జ: కలలరాణి, అందాల దేవతలుగా మేము పే రు తెచ్చుకుని ఉండవచ్చు. ఇప్పుడు సినిమా పూర్తిగా మారి పోయింది. చాలా చిత్రాల్లో కథానాయికలు వేరే మాదిరిగా నటిస్తున్నా రు. నటి త్రిష ఎన్నై అరిందాల్ చిత్రంలో తల్లిగా నటించారు. నాకిప్పుడు 33 ఏళ్ల వయసు. ఈ వయసుకు ఏతరహా పాత్ర ల అవకాశాలు వస్తాయో అవే చేయగ లం. 16 ఏళ్ల అమ్మాయిలా స్క్రీన్ మీద కనిపించలేం కదా? నాకు తెలిసి ఇప్పుడు కథ, పాత్రలే ముఖ్యం. మేమంతా పాత్రదారులం అంతే. ప్రశ్న: విద్యాబాలన్ లాంటి తారలు చాలెంజింగ్ పాత్రలు చేస్తున్నారు. మీరు అలాంటి పాత్రలు చేయాలని ఆశిస్తున్నారా? జ: రిస్క్ చేయడం అంటే సహజంగానే ఇష్టం.విద్యాబాలన్, కంగనా రావత్ తరహాలో చిత్రాలు చేయడానికి నేనేప్పుడూ సిద్ధమే. ప్రశ్న: దర్శకుడు సెల్వరాఘవన్ నుంచి విడిపోయిన తరువాత ఒంటరి జీవితం సంతోషంగా ఉందా? కష్టం అనిపిస్తోందా? జ : నాకు ఒంటరిగా ఉంటున్నాననే భావనే కలగలేదేప్పుడూ. నా చుట్టూ ఎప్పుడూ నా నట బృందం ఉంటుంది. నేనాయన్ని మిస్ చేసుకున్న విషయం నిజమే. అయితే అందుకు బాధ పడలేదు. ఒక బ్రేక్అప్ అంతే. అయినా అదే నిర్ణయం కాదు. నా కుటుంబం, బంధువులతో సంతోషంగా జీవిస్తున్నాను. చెన్నైలోనే నివశిస్తున్నాను. ఇక్కడే నటిస్తున్నాను. ప్రశ్న: సరే దర్శకుడు సెల్వరాఘవన్ మళ్లీ చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రంలో అవకాశం వస్తే నటిస్తారా? జ : ఇప్పటి వరకూ ఆ చిత్రంలో నటించమని నన్ను ఎవరూ అడగలేదు. సెల్వరాఘవన్ మరో పెళ్లి చేసుకున్నారు. పిల్లలున్నారు. ఆయన చిత్రంలో నటించాలని నాకూ చాలా ఆశే. అయితే నేను నటించడం ఆయన భార్యా ఇష్ట పడాలి. ఆమె ఎలాంటి సమస్య ఉండదని భావిస్తే నేను తప్పకుండా నటిస్తాను. ప్రశ్న: నటుడు ధనుష్ గురించి? జ: ధనుష్ మంచి నటుడు. ప్రతిభావంతుడు. నాకు మంచి మిత్రుడు. మా మధ్య ఎలాంటి సమస్యలు లేవు. ఒకే రంగంలోనే ఉన్నాం కదా?ఆయనతో నటించే అవకావం మరోసారి వస్తే తప్పకుండా నటిస్తా. ప్రశ్న: చాలా మంది నటీమనులు నటన కాకుండా వేరే వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. మీకు అలాంటి ఆలోచన లేదా? జ: చండీగర్లో లెదర్ ఫ్యాక్టరీ ప్రారంభించనున్నాను. ఆ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఆగస్టులో ఆ వ్యాపారం ప్రారంభమవుతుందని భావిస్తున్నాను. ఒక పక్క నటన, మరో పక్క వ్యాపారం అంటూ ప్లాన్ చేస్తున్నాను. ప్రశ్న: మళ్లీ వివాహం చేసుకునే ఆలోచన ఉందా? జ: ఎమీ నిర్ణయించు కోలేదు. అయితే మంచి వ్యక్తి దొరికితే, నా గురించి తనూ, ఆయన గురించి నేను పూర్తిగా తెలుసుకుని ఒకరినొకరు అర్థం చేసుకుంటే తప్పక పెళ్లి చేసుకుంటా. మరో మూడు నాలుగేళ్లు ఆగమని చెప్పను. వెంటనే పెళ్లి చేసుకుంటాను. ప్రశ్న: ఎక్కువగా పార్టీలో కనిపిస్తున్నారనే వాళ్ల ప్రశ్నకు మీ సమాధానం? జ: నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేసుకుంటున్నాను. ఇందులో ఎ వరికేం చింత? పార్టీలకు వెళ్లే స్వేచ్ఛ నాకు ఉంది. వెళుతున్నాను. ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదుగా.