ఆ టైటిల్‌ పెట్టొద్దు.. దర్శకుడికి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ | 7/G Movie Director Haroon Got Threat Calls - Sakshi
Sakshi News home page

ఆ టైటిల్‌ పెట్టొద్దు.. దర్శకుడికి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌

Published Sat, Sep 9 2023 7:18 AM | Last Updated on Sat, Sep 9 2023 8:29 AM

7G Movie Director Haroon Got Threat Phone Calls - Sakshi

తమిళసినిమా: దర్శకుడు సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించిన కాదల్‌కొండేన్‌ చిత్రం ద్వారా ధనుష్‌ సరసన కథానాయకిగా పరిచయమైన నటి సోనియాఅగర్వాల్‌. ఈ చండీగర్‌ భామ ముందుగా 2002లో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత సెల్వరాఘవన్‌ దృష్టిలో పడింది. అలా ఇక్కడ కాదల్‌ కొండేన్‌, 7జీ రెయిన్బో కాలనీ వంటి పలు చిత్రాల్లో నటించి తనకంటూ గుర్తింపును తెచ్చుకుంది. అంతే కాకుండా ఈమె దర్శకుడు సెల్వరాఘవన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరి వివాహబంధం నాలుగేళ్లకే ముగిసింది. ఆ తరువాత ఒంటరిగానే జీవిస్తున్న సోనియా అగర్వాల్‌ నటనపైనే పూర్తిగా దృష్టిపెట్టింది.

కాగా తాజాగా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రానికి 7జీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. నటి శ్రుతి, వెంకట్‌ నటిస్తున్న ఇందులో సోనియాఅగర్వాల్‌ దెయ్యం పాత్రలో నటిస్తోంది. హారూన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ వివాదాల్లో చిక్కుకుంది. 2004లో సోనియా అగర్వాల్‌ నటించిన 7జీ రెయిన్బో కాలనీ చిత్రం తెలిసిందే. కాగా తాజాగా ఆమె నటిస్తున్న చిత్రానికి 7జీ అనే పేరును నిర్ణయించడంతో ఈ చిత్ర దర్శకుడికి బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయట. దీని గురించి దర్శకుడు హారూన్‌ మాట్లాడుతూ దెయ్యం ఇతివృత్తంతో రూపొందిస్తున్న హర్రర్‌ కథా చిత్రం ఇదన్నారు.

7జీ అనే టైటిల్‌ను ఎవరు రిజిస్టర్‌ చేయకపోవడంతో తమ చిత్రానికి ఆ టైటిల్‌ నిర్ణయించినట్లు తెలిపారు. 7జీ అనే ఇంట్లో షూటింగ్‌ నిర్వహించడం, కథకు నప్పడంతో ఆ టైటిల్‌ను ఖరారు చేసినట్లు చెప్పారు. అయితే తమ చిత్రానికి ఈ పేరు పెట్టకూడదని కొందరి నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని చెప్పారు. అయితే తాము టైటిల్‌ను మార్చే ప్రసక్తే లేదని, ఈ వ్యవహారాన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement