7/G Brundavan Colony Actress Sonia Aggarwal Second Marriage Rumours Goes Viral - Sakshi
Sakshi News home page

Sonia Agarwal Second Marriage: ఆ డైరెక్టర్‌తో రెండో పెళ్లికి సిద్ధమవుతున్న సోనియా అగర్వాల్‌!

Published Wed, Dec 8 2021 4:23 PM | Last Updated on Wed, Dec 8 2021 9:20 PM

Actress Sonia Aggarwal Second Wedding Rumours Goes Viral - Sakshi

‘7/G బృందావన కాలని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సోనియా అగర్వాల్‌. తెలుగులో ఆమె హీరోయిన్‌గా కనిపించింది ఒక్క సినిమానే అయినా ఇక్కడ బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో ఆమె అమాయకంగా, క్యూట్‌ క్యూట్‌గా నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన ఆమె కొద్ది రోజులకు తెరపై కనుమరుగైంది. తనను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన తమిళ డైరెక్టర్‌ సెల్వరాఘవన్‌ను 2006లో ప్రేమ వివాహం చేసుకుంది.

చదవండి: ప్రముఖ యూట్యూబ్‌ స్టార్‌ మృతి, దీప్తి సునైనా దిగ్భ్రాంతి

ఈ క్రమంలో వ్యక్తిగత ల కారణాలతో 2010లో భర్తకు విడాకులు ఇచ్చింది సోనియా. విడాకుల తర్వాత తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సోనియా జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ మూవీలో తళుక్కుమ్మంది. ఇక అప్పటి నుంచి సినిమాల్లో క్యారెక్టర్‌ అర్టిస్టుగా, సహా నటిగా చేస్తూ పలు టీవీ షోలు చేస్తూ వస్తోంది. విడాకుల అనంతరం ఒంటరిగా ఉంటున్న ఆమె తాజాగా రెండో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఓ డైరెక్టర్‌తో సోనియా సన్నిహితం ఉంటుందట. ఈ క్రమంలో అతడినే ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ ఫిలిం దూనియా గుసగుసలు వినిపిస్తున్నాయి.

చదవండి: సోషల్‌ మీడియాలో చేదు అనుభవం, బోల్డ్‌గా స్పందించిన హీరోయిన్‌

గతంలో కూడా సోనియా రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సోనియా రెండో పెళ్లి వ్యవహరం తెరపైకి వచ్చింది. ఆమె రెండో పెళ్లికి సిద్దమైందని, త్వరలోనే ఓ డైరెక్టర్‌ను వివాహం చేసుకొనుందంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై నటి సోనియా అగర్వాల్‌ స్పందించే వరకు వేచి చూడాలి. కాగా సోనియా తాజాగా నటించిన ద్విభాషా చిత్రం ‘గ్రాండ్‌మా’ త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement