
నటుడు బబ్లూ పృధ్వీ రాజ్ గురించి ప్రత్యేకం పరిచయం అక్కర్లేదు. తమిళ నటుడైన ఆయన తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించాడు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా హీరోగా కూడా పలు చిత్రాలు చేసి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అవకాశాలు తగ్గడంతో కొంతకాలంగా ఆయన తెలుగు తెరపై కనిపించడం లేదు. ఇటీవల ఇంటింటి గృహలక్ష్మీ అనే సీరియల్‌తో తెలుగులో బుల్లితెర ఎంట్రీ ఇచ్చాడు ఆయన.
చదవండి: జపానీస్‌లో మాట్లాడి అదరగొట్టిన తారక్, ఫ్యాన్స్ ఫిదా.. వీడియో వైరల్
ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. కొంతకాంలగా పృథ్వీరాజ్ భార్యతో దూరంగా ఉంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడనే వార్తలు గుప్పుమన్నాయి. 50 ఏళ్ల పృథ్యీరాజ్ 23 ఏళ్ల యువతిని రెండవ వివాహం చేసుకున్నాడంటూ తమిళ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, మెయిన్ స్ట్రీమ్‌లో ఆర్‌ఆర్‌ఆర్, అఖండ చిత్రాలు
ఈ తాజా బజ్ ప్రకారం.. మలేషియాకు చెందిన 23 ఏళ్ల అమ్మాయిని ఆయన సీక్రెట్ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన రెండో భార్యతోనే కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రెండో పెళ్లి గురించి ఆయన అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. మరి ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా పృధ్వీరాజ్‌కు 1994లో బీనా అనే మహిళతో పెళ్ల కాగా వీరికి ఓ బాబు కూడా జన్మించాడు.
Comments
Please login to add a commentAdd a comment